
ఆపదలో ఉన్న ప్రజలను కాపాడేందుకు పోలీసు బలగాలు ప్రాణాలకు తెగించి సహాయం అందించే సంగతి తెలిసిందే. తాజాగా సాటి మానవులను కాదు మూగ జంతువులను సైతం ఆదుకుంటామని బెంగళూరు పోలీసులు చాటారు. బెంగళూరు పోలీసులకు ట్విట్టర్‌లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సింగిల్‌లైన్ పంచ్ డైలాగ్ పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న బెంగళూరు కాప్స్.. తాజా చర్యతో ప్రశంసలు అందుకుంటున్నారు.
ఓ వీధికుక్క అనుకోకుండా ప్లాస్టిక్ బిందెలో తల దూర్చి.. అందులో తల ఇరుక్కోవడంతో చాలాసేపు నరకాన్ని అనుభవించింది. ఈ విషయం తెలియడంతో ఏకంగా 15మంది పోలీసులు రంగంలోకి దిగి.. ఆ కుక్కకు విముక్తి కల్పించారు. శునకం తలకు ఇరుక్కున ప్లాస్టిక్ బిందెను తొలగించి.. అది అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించారు. ఈ విషయాన్ని బెంగళూరు ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ గోయల్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్లు బెంగళూరు పోలీసుల చర్యను ప్రశంసిస్తున్నారు. మూగజీవాల పట్ల సానుభూతి చూపుతున్న పోలీసులపై తమకు గౌరవం పెరిగిందని కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment