మళ్లీ వార్తల్లో నిలిచిన ప్రియా వారియర్‌ | Priya Prakash Varrier New Song Becomes Viral With More Dislikes | Sakshi
Sakshi News home page

మళ్లీ వార్తల్లో నిలిచిన ప్రియా వారియర్‌

Published Fri, Sep 21 2018 11:28 AM | Last Updated on Thu, Sep 27 2018 6:06 PM

Priya Prakash Varrier New Song Becomes Viral With More Dislikes - Sakshi

ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఒరు ఆదార్‌ లవ్‌ సినిమాలోని మాణిక్య మలరాయ సాంగ్‌లో కన్నుకొట్టి, గన్నుతో పేల్చి కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిందీ భామ. ఈ ఒక్క సాంగ్‌తో బాలీవుడ్‌లో చాన్స్‌ కొట్టేసింది. ఇక ప్రస్తుతం ఒరు అదార్‌ లవ్‌ సినిమాలోని మరో సాంగ్‌ను రిలీజ్‌చేశారు మేకర్స్‌. 

ఈ సాంగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇది కూడా మరో కొత్త రికార్డును సెట్‌ చేస్తోంది. యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డిస్‌లైక్‌లు సాధించిన సాంగ్‌గా రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటికే ఈ పాటను పది లక్షలకు పైగా వీక్షించగా, రెండు లక్షలకు పైగా డిస్‌లైక్‌లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాటే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ప్రియకు ఇంతటి వ్యతిరేకతకు గల కారణాలు ఏంటో తెలియడం లేదు. తన అభిమానులు సైతం ఈ డిస్‌లైక్‌లకు గల కారణాలేంటని సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా మళ్లీ ప్రియా వారియర్‌ వార్తల్లోకెక్కేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement