
జీవితంలో చాలా మంది పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టంగా భావిస్తుంటారు. పెళ్లి సమయంలో బంధువుల సందడులు, బావ మరదలు సరసాలు, చిన్నపిల్లల అల్లర్లు ఇలా చూసేందుకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. కొన్ని సార్లు వధూవరులు ఒకరినొకరు ఆట పట్టించడం లాంటివి జరుగుతుంటాయి. ఈ తరహాలోనే పానీ పూరి తినడం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వరుడుని వధువు ఆటపట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వధువు పానీ పూరి తినిపిస్తుందని ఆశగా నోరు తెరుస్తాడు వరుడు, కానీ ఆమె నోటి దగ్గరకు తీసుకు వచ్చి వరుడుకి తినిపించుకుండా తానే తింటుంది. రెండోసారి ఏమైనా తినిపిస్తుందని మళ్లీ ఎదురుచూడగా, పాపం ఈసారి కూడా అతనికి నిరాశే ఎదురవుతుంది. ఇలా ఆ వధువు అతడిని సరదాగా ఆట పట్టిస్తున్న ఘటన ఉత్తర భారత దేశంలో జరిగింది. ఈ వీడియోను వధువు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం చక్కర్లు కొడతోంది. ఇప్పటకే ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment