marriges
-
నెల రోజుల వ్యవధిలో 26 లక్షలకు పైగా పెళ్లిళ్లు !
అయ్యా, గట్టి మేళం మోగించండి.. తలంబ్రాలు సిద్ధం చేయండి.. వివాహ భోజనంబు..చందన తాంబూలాలు, పూలు, పండ్లు రెడీ ‘విజయవాడకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తన కుమారుడికి ఈఏడాది మొదట్లో ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇంతలో కరోనా రెండో విడత కమ్ముకొచ్చింది. ఆయన యత్నాన్ని ఆదిలోనే దెబ్బతీసింది’.. ‘కెనడాలోని టొరంటోలో పర్మినెంట్ రెసిడెంట్‌గా ఉంటున్న గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మధ్య తరగతి యువకుడికి కాకినాడలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తెతో పెళ్లి నిశ్చయమైంది. ముందనుకున్న ప్రకారం మే నెలాఖరులో వివాహం జరగాల్సి ఉంది. కానీ కరోనా ఆంక్షలు అడ్డం వచ్చాయి.అయితే ఇప్పుడవి తొలగిపోయాయి. – సాక్షి, అమరావతి కరోనా కారణంగా విధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించడం.. పెళ్లిబంధంతో ఒక్కటవుదామనుకుంటున్న యువతీ యువకుల నెత్తిన అక్షింతలయ్యాయి.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది ఇళ్లలో పెళ్లి భాజాభజంత్రీలు మోగుతున్నాయి. కళ్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. బంధుమిత్రుల పలకరింపులు, ఆనంద వినోదాలతో పెళ్లింట కొత్త శోభ సంతరించుకుంటుంది. ఏదేమైనా..ఎక్కడ చూసినా.. రెండేళ్ల నాటి పరిస్థితులు మళ్లీ ఊపందుకుంటున్నాయనేది స్పష్టమవుతున్నది. కలిసొచ్చిన వ్యాక్సినేషన్.. కరోనా వైరస్ మహమ్మారి నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్రంలో దాదాపు పూర్తి కావడం ఇందుకు ప్రధాన కారణం. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో 98.86 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఫలితంగా రాష్ట్రప్రభుత్వం జనం గుమికూడడంపై ఆంక్షలు సడలించింది. ఈ అవకాశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రజలు పెద్దఎత్తున పెళ్లిళ్లకు గేట్లు బార్లా తెరిచారు. నెల వ్యవధిలో లక్షకు పైమాటే.. అఖిల భారత ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 13వతేదీ లోపు దాదాపు 26 లక్షలకు పైగా వివాహాలు జరుగుతాయని అంచనా. కాగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే లక్షకు పైగా వివాహాలు జరుగుతాయని తెలుస్తున్నది. ఆగస్టులో కరోనా ఆంక్షల్ని స్వల్పంగా సడలించినప్పుడు 13 రోజుల్లో 47 వేలకు పైగా పెళ్లిళ్లు జరగడమే ఈ అంచనాకు ప్రాతిపదిక. ఆంధ్రాలో ఆది నుంచీ ఆడంబరమే.. ఇల్లుకట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత మనకు ఉండనే ఉంది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రాలో పెళ్లిళ్లకు పెట్టే ఖర్చు, ఆడంబరాలు ఆది నుంచీ ఎక్కువే. ముహూర్త బలానికి గిరాకీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఫంక్షన్ హాళ్లు ఖాళీలు లేకుండా పోయాయి. నవంబర్ 21, 27, 28, డిసెంబర్ 8 తేదీల్లో స్టార్ హోటళ్లలోని హాళ్లు ఖాళీలు లేవంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చాలామంది కార్తీక మాసంలోనే పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడతారని పెళ్లిళ్ల పేరయ్యలు చెబుతున్నారు. ధరలు మండిపోతున్నాయి.. ఈ పెళ్లిళ్లు, కార్తీకమాసం పేరిట కూరగాయల ధరలు పెరిగిపోయాయని విజయవాడకు చెందిన ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎం.చంద్రశేఖర్ వాపోయారు. మంచి ముహూర్తం ఉన్న ఏ రోజూ కూరగాయలు దొరకడం లేదన్నారు. కిలోకి రూ.60,70 పెట్టనిదే ఏ కూరగాయా దొరకడం లేదని, చివరకి గోంగూర కట్ట రూ.10 అయిందని వాపోయారు. కార్తీకమాసం, మంచి ముహూర్తాలు కలిసి రావడంతో ఈవెంట్ మేనేజ్మెంట్లకు గిరాకీ పెరిగింది. కరోనా కాలంలో చిన్నా చితకా ఫంక్షన్లు చేసి మహాఅయితే ఏ 40,50 మందికో భోజనాలు ఏర్పాటు చేసిన వీళ్లకు ఇప్పుడు చేతినిండా పని దొరికినట్టయిందని విజయవాడకు చెందిన ఈవెంట్ మేనేజర్ శ్రీనివాసరావు చెప్పారు. బట్టలు, బంగారు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పూల వ్యాపారుల పంట పడింది. పెళ్లి కుమారులు, కుమార్తెలు జిగేల్ జిగేల్ మంటూ మెరిసిపోతున్నారు. వేద పండితులకు, సన్నాయి వాయిద్య కళాకారులకు గిరాకీ పెరిగింది. ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్మేన్ల కొరత కనిపిస్తోంది. మొత్తం మీద ఖర్చుమాత్రం తడిసిమోపెడవుతున్నా ఎవ్వరూ ఎక్కడా వెనక్కితగ్గడం లేదు. పెళ్లి వేడుకల్లో గట్టి మేళాలు మోగుతున్నాయి. -
వైరల్ వీడియో: పాపం పానీ పూరి కోసం..
జీవితంలో చాలా మంది పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టంగా భావిస్తుంటారు. పెళ్లి సమయంలో బంధువుల సందడులు, బావ మరదలు సరసాలు, చిన్నపిల్లల అల్లర్లు ఇలా చూసేందుకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. కొన్ని సార్లు వధూవరులు ఒకరినొకరు ఆట పట్టించడం లాంటివి జరుగుతుంటాయి. ఈ తరహాలోనే పానీ పూరి తినడం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వరుడుని వధువు ఆటపట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వధువు పానీ పూరి తినిపిస్తుందని ఆశగా నోరు తెరుస్తాడు వరుడు, కానీ ఆమె నోటి దగ్గరకు తీసుకు వచ్చి వరుడుకి తినిపించుకుండా తానే తింటుంది. రెండోసారి ఏమైనా తినిపిస్తుందని మళ్లీ ఎదురుచూడగా, పాపం ఈసారి కూడా అతనికి నిరాశే ఎదురవుతుంది. ఇలా ఆ వధువు అతడిని సరదాగా ఆట పట్టిస్తున్న ఘటన ఉత్తర భారత దేశంలో జరిగింది. ఈ వీడియోను వధువు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం చక్కర్లు కొడతోంది. ఇప్పటకే ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Shivani Sharma Singh ▪Creator (@shivanisharmasinghh) చదవండి:41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు -
పెళ్లిళ్లపై కరోనా కాటు!
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్–19 (కరోనా) ప్రభావం శుభకార్యాలపై తీవ్రంగా చూపుతోంది. కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోవడంతోపాటు విస్తరించకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు రద్దీగా ఉండే కార్యక్రమాలను వాయిదా లేదా తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు వాయిదా పడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు, పక్క రాష్ట్రంలోని ముంబై, పుణే, బెంగళూరులతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదవడంతో పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకున్న పలు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముహుర్తాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. దీంతో రెండు, మూడు నెలల ముందే ఫంక్షన్ హాల్స్, కేటరింగ్ తదితరాలను బుక్ చేసుకున్నారు. తమ వ్యాపారం జోరుగా సాగుతుందని ఫంక్షన్ హాల్, డెకరేషన్లు, ఫుడ్ కేటరింగ్ యజమానులు భావించారు. (మనిషిపై కరోనా ప్రభావమిలా..) అయితే వైరస్ కారణంగా ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్న వారు పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి పెళ్లిళ్లు పెట్టుకున్నా ఫంక్షన్ హాల్స్‌కు బంధువులు వస్తారో.. రారో అని వధువరుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. కొందరు ఇప్పటికే శుభకార్యాలు రద్దు చేసుకోవడంతో కేటరింగ్, డెకరేటర్లకు, ఫంక్షన్ హాళ్లకు బుకింగ్ సమయంలో చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ముంబై దాదర్‌లోని ధురు ఫంక్షన్ హాల్ యజమాని మనోహర్ సాల్వీ, జోగేశ్వరిలోని మాంగళ్య మంగల్ హాల్ యజమాని అమిత్ తెలిపారు. (కరోనాపై సీఎం కేసీఆర్ ప్రకటన) కరోనా కారణంగా శుభకార్యాలు రద్దయ్యే ప్రమాదం ఉండటంతో తమ ఆదాయానికి గండిపడుతుందని ఫంక్షన్ హాల్స్, డెకరేటర్లు, కేటరింగ్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఇప్పటికే 85 కేసులు నమోదు అవ్వగా.. వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు.ఇక తెలంగాణలోనూ వైరస్ తీవ్ర భయాందోళనలు సృష్టిస్తోంది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చైనాలోని వుహాన్‌లో పురుడుపోసుకున్న ప్రమాదకర వైరస్ అక్కడ కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ ఆసియా వెలుపల గల దేశాలపై మరణమృదంగం మోగిస్తోంది. -
పట్టని వివాహ చట్టం
గ్రామ పంచాయతీల్లో వివాహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అటకెక్కింది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాకే వివాహం చేయాలనే నిబంధన ఏ మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. చట్టంతో పాటు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామాల్లో అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా స్పందించడం లేదు. దీంతో ఇప్పటికీ గ్రామాల్లో బాల్యవివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి. తనకల్లు: బాల్య వివాహాలను నిర్మూలించాలనే లక్ష్యంతో 2012వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వివాహ చట్టాన్ని తీసుకొచ్చింది. అన్ని మతాల వారికి చట్టం వర్తించేలా రూపొందించారు. అయితే నియోజకవర్గంలోని 82 పంచాయతీల్లో ఏ పంచాయితీలోనూ వివా హాల రిజిస్ట్రేషన్ అమలు కావడం లేదు. పట్టించుకోని అధికారులు వివాహాలు చేసుకొనే ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలనే నిబంధన ఉన్నప్పటికీ అమలు గురించి సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటి వరకు కదిరి నియోజకవర్గంలో 30 నుంచి 40 శాతం వరకు బాల్య వివాహాలే జరుగుతున్నట్లు సమాచారం. ప్రత్యేకించి గిరిజన తండాలు, పల్లెల్లో తల్లిదండ్రుల అవగాహన లోపం, ఆర్థిక సమస్యల కారణంగా బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బాల్యవివాహాలకు ఏదీ అడ్డుకట్ట? బాల్య వివాహాలు చేయరాదని, ఆడ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తరువాతే వివాహాలు చేయాలంటూ గ్రామాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. వివాహ నమోదు చట్టం, బాల్య వివాహాల గురించి స్త్రీ సంక్షేమ శాఖ, విద్యా శాఖ, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి తల్లిదండ్రులకు, విద్యార్థినులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి. అయితే ఈ సదస్సులు ఇప్పటి వరకు మండలంలోని ఏ పంచాయతీ లోనూ నిర్వహించిన దాఖలాలు లేవు. అవగాహన కల్పిస్తాం వివాహాల నమోదు కా ర్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేసేందుకు చర్యలు తీ సుకుంటాం. బాల్య వి వాహాల వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తాం. కార్యదర్శులతో కలిసి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తాం. – ఆదినారాయణ, ఈఓఆర్డీ, తనకల్లు అవగాహన కల్పించాలి వివాహాల నమోదు గురించి చాలా మందికి తెలియదు. ఈ ప్రక్రియ గురించి అధికారులు గ్రామాల్లో తల్లిదండ్రులతో కలిసి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. అవగాహన లేక కొందరు ప్రభుత్వ పథకాలను కూడా కోల్పోతున్నారు. – చిదానందరెడ్డి, గణాధివారిపల్లి అనర్థాలను గ్రామీణులకు వివరించాలి గిరిజనుల నిరక్షరాస్యతకు తోడు, ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. దీంతో తండాలలో అత్యధికంగా జరిగేవి బాల్య వివాహాలే. అయినా అధికారులు బాల్య వివాహాం చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పించడం లేదు. అధికారులు తండాలలో వివాహ రిజిస్ట్రేషన్‌పై చైతన్యం తీసుకురావాలి. – రవీంద్రానాయక్, గిరిజన సంఘం నాయకుడు, జీఎన్ తండా -
వివాహానంతర ప్రేమ.. విషాదాంతం
వారిద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే ఇద్దరికీ వివాహాలయ్యాయి. ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు. అతనికి భార్యతోను, ఆమెకు భర్తతోను విభేదాలు వచ్చాయి. ఆమె పుట్టిల్లు.. అతని సొంతిల్లు ఆ గ్రామంలోని ఒకే ప్రాంతం. దీంతో తమ జీవిత భాగస్వాములకు దూరంగా ఉన్న వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇది వారి కుటుంబాలకు తెలిసింది. ఇద్దరిపై ఒత్తిడి పెరిగింది. వారు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పశ్చిమగోదావరి : ఉంగుటూరులో నంద్యాల సురేష్, తణుకు ఉమాసరోజిని కలిసి ఒకే చున్నీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం వేకువ జామున వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో గ్రామం ఉలిక్కిపడింది. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు కోనేరుపేటకు చెందిన నంద్యాల సురేష్(27)కు కైకరానికి చెందిన నాగలక్ష్మితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అదే పేటకు చెందిన జొన్నాడ ఉమాసరోజిని(23)కి తణుకు మండలం కాయలపాడుకు చెందిన తణుకు సుబ్బారావుతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. సురేష్ తన భార్యతో గొడవల నేపథ్యంలో ఒంటరిగా ఉంటున్నాడు. సరోజిని తన భర్తతో ఉన్న స్పర్థలతో కొన్ని నెలలుగా ఉంగుటూరులోని పుట్టింట్లో ఉంటోంది. వారిద్దరిది కోనేరు పేట కావటంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది తెలిసి రెండు కుటుంబాల నుంచి వీరిపై ఒత్తిడి వచ్చింది. దీంతో సురేష్, సరోజిని కలిసి మూడు రోజుల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఏమైందో కానీ వారిద్దరు ఉంగుటూరు కోనేరుపేట వచ్చారు. ఏలూరు కాలువ గట్టు వద్ద వినాయక ఆలయం సమీపంలోని పూరిపాకలో ఒకే చున్నీతో ఇద్దరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలంలో పానీ పూరీ, వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి. ఈ విషయం తెలిసి వీఆర్వో పీతల ముత్యాలు శుక్రవారం ఉదయం చేబ్రోలు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్సై తాడి వెంకటనాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చి చలించి పోయారు. సురేష్ తల్లి వేదన: ఎప్పుడు అమ్మా అమ్మా అంటూ వెంట ఉండే కుమారుడు సురేష్ మృతితో అతని తల్లి గుండెలవిసేలా రోదించింది. అతని తండ్రి ఏడుకొండలు ఆవేదనతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయాడు. కలలో కూడా అనుకోలేదు కుమారై మృతదేహం చూసి ఆమె తండ్రి జొన్నాడ చిన్ననాగేశ్వరరావు బోరున విలపించారు. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని మృతదేహం వద్ద ఆమె తల్లి వెంకటరమణ, తండ్రి నాగేశ్వరరావు గుండెలు బాదుకుంటూ విలపించారు. -
ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్న ట్రంప్
-
ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అమెరికా అల్లుళ్లకు భారత్‌లో మంచి గిరాకీ ఉంది. తాజాగా ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హెచ్1బీ వీసాలపై తీసుకువస్తున్న ఆంక్షలు, ఇమిగ్రేషన్ చట్టాలు అమెరికాలో ఉంటున్న భారత యువకులకు పెళ్లి యోగ్యతను దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన మ్యారేజ్ బ్యూరోల్లో ఎన్నారై సంబంధాలకు డిమాండ్ పడిపోయింది. తాజాగా తెలుగు యువకులపై అమెరికాలో జరిగిన జాతి విద్వేష దాడి ఈ పరిస్ధితిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. ఏటా భారత్ నుంచి అమెరికా వెళ్తున్న వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. ట్రంప్ నిర్ణయాల వల్ల వలస వస్తున్న భారత టెకీలు ఉద్యోగాలు ప్రమాదంలో పడటమే కాకుండా వారికి వివాహం అయ్యే అవకాశాలను కూడా తగ్గిపోయేలా చేస్తున్నాయని హైదరాబాద్‌లో మ్యారేజ్ బ్యూరోను నడుపుతున్న దయాకర్ చెప్పారు. ప్రస్తుతం అమ్మాయిల తల్లిదండ్రులు ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిల సంబంధాల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఆయన తెలిపారు.