ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్న ట్రంప్
Published Fri, Mar 3 2017 10:02 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ఎన్నారైలకు పెళ్లిళ్లు కాకుండా చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా అమెరికా అల్లుళ్లకు భారత్‌లో మంచి గిరాకీ ఉంది. తాజాగా ట్రంప్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత హెచ్1బీ వీసాలపై తీసుకువస్తున్న ఆంక్షలు, ఇమిగ్రేషన్ చట్టాలు అమెరికాలో ఉంటున్న భారత యువకులకు పెళ్లి యోగ్యతను దూరం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన మ్యారేజ్ బ్యూరోల్లో ఎన్నారై సంబంధాలకు డిమాండ్ పడిపోయింది. తాజాగా తెలుగు యువకులపై అమెరికాలో జరిగిన జాతి విద్వేష దాడి ఈ పరిస్ధితిని మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది.
ఏటా భారత్ నుంచి అమెరికా వెళ్తున్న వారిలో అత్యధికులు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. ట్రంప్ నిర్ణయాల వల్ల వలస వస్తున్న భారత టెకీలు ఉద్యోగాలు ప్రమాదంలో పడటమే కాకుండా వారికి వివాహం అయ్యే అవకాశాలను కూడా తగ్గిపోయేలా చేస్తున్నాయని హైదరాబాద్‌లో మ్యారేజ్ బ్యూరోను నడుపుతున్న దయాకర్ చెప్పారు. ప్రస్తుతం అమ్మాయిల తల్లిదండ్రులు ఇండియాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్న అబ్బాయిల సంబంధాల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఆయన తెలిపారు.
Advertisement
Advertisement