గత ఏడాది అమెరికాకు వెళ్లిన భారతీయుల సంఖ్య 5 శాతం తగ్గింది. 2016లో 11.72 లక్షల మంది భారతీయులు వివిధ పనులపై అమెరికా వెళ్లగా, 2017లో 11.14 లక్షల మందే అమెరికా వెళ్లారని ఆ దేశానికి చెందిన జాతీయ ప్రయాణ, వాణిజ్య కార్యాలయం(ఎన్‌టీటీవో) వెల్లడించింది.2009 తర్వాత ఇంత తక్కువ మంది భారతీయులు అమెరికా వెళ్లడం ఇదే మొదటి సారి.చదువు కోసం కాకుండా ఇతరత్రా పనులపై అమెరికా వచ్చివేళ్లే వివిధ దేశస్థుల వివరాలను ఎన్‌టీటీవో ప్రకటిస్తుంటుంది.2009లో 5.5 లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళ్లారు.2008తో పోలిస్తే ఇది 8శాతం తక్కువ.మాంద్యం కారణంగా ఆ సంవత్సరంలో ప్రయాణికుల సంఖ్య తగ్గింది.తర్వాత నుంచి 2016 వరకు ఏటా అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య పెరుగుతూనే ఉంది.2018 నుంచి 2022 వరకు మళ్లీ వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఎన్‌టీటీవో అంచనా వేసింది.
‘భారత దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్లే వారి సంఖ్య గత కొన్నేళ్లుగా ఏటా 10,12 శాతం పెరుగుతూ ఉంది. ట్రంప్ ప్రభుత్వం తెస్తున్న నిబంధనలు, ఆంక్షల కారణంగా అమెరికా వెళ్లడం కష్టమని పలువురు భారతీయులు భావిస్తున్నారు.దాంతో అక్కడికి వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గింది.’అని న్యూఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు చెప్పారు.అమెరికా చాలా మంది భారతీయులకు పదేళ్ల పాటు చెల్లుబాటయ్యే మల్లిపుల్ ఎంట్రీ వీసాలు ఇస్తోందని, బీ1–బీ2 కేటగిరీకి చెందిన ఈ వీసాకు పది నుంచి పదకొండు వేల రూపాయలు ఖర్చవుతుందని,ఎక్కువ మంది రావాలన్న అభిప్రాయంతో ఐరోపా దేశాల కంటే తక్కువ ఫీజు పెట్టిందని మరో ట్రావెల్ ఏజెంట్ చెప్పారు. అనవసర భయాలతో భారతీయులు అమెరికా ప్రయాణాలు తగ్గించుకుంటున్నారని ఆయన అన్నారు. అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గినా, ఇతర దేశాల ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, దాంతో అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య 0.7% పెరిగిందని అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇది కూడా చదవండి : అమెరికా ఐటీ కంపెనీకి భారీ జరిమానా
Comments
Please login to add a commentAdd a comment