జీవితంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్లయిన వారిని సెటిల్ అయ్యారని కూడా అంటుంటారు. అయితే పెళ్లి విషయంలో వివిధ దేశాల్లో పలు రకాలైన సంప్రదాయాలున్నాయి. కొన్ని దేశాల్లో పెళ్లి వేడుకలు రోజుల తరబడి కూడా జరుగుతుంటాయి. అయితే ఆ దేశంలో పెళ్లి వేడుక అన్ని ప్రాంతాలకన్నా భిన్నంగా జరుగుతుంది. అక్కడ యువకులు ఒక్కరోజు కోసం పెళ్లికొడుకులుగా మారతారు. అమ్మాయి కూడా ఒక్కరోజు కోసం వధువుగా మారుతుంది. ఇంతకీ ఇలాంటి వింత వివాహం ఎక్కడ జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? పూర్తి వివరాలు..
ఇటువంటి వింత వివాహం చైనాలో జరుగుతుంది. ఇటీవలి కాలంలో చైనాలో వింత వివాహాలు జరుగుతున్నాయి. గతంలో ఇటువంటి విధానం లేదు. తాజాగా ఒక్కరోజు కోసమే ఇక్కడ వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాల కోసం భారీ ఎత్తున ఏర్పాట్లేమీ జరగవు. సాదాసీదాగా, రహస్యంగా ఈ వివాహాలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా చైనాలో ఇటువంటి వివాహాల తంతు పెరిగిపోయింది.
ఈమధ్య కాలంలొ చైనాలలోని యువకులకు వివాహం జరగడం అత్యంత కష్టదాయకంగా మారింది. పెళ్లికి అత్యధికంగా సొమ్ము ఖర్చుపెట్టాల్సి రావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. అయితే చైనాలో పురుషులు బ్రహ్మచారులుగా మరణించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. దీనిని అధిగమించేందుకే యువకులు ఒకరోజు పెళ్లికి సిద్దం అవుతున్నారు. తద్వారా తమ బ్రహ్మచర్యాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలోనైతే ఎవరైనా వ్యక్తి పెళ్లికాకుండా మరణిస్తే, ఆ మృతదేహానికి వివాహం జరిపిస్తారు.
ఇటీవలి కాలంలో చైనాలో ఒక్కరోజు పెళ్లిపేరట భారీ వ్యాపారం జరుగుతోంది. పెళ్లికాని యువకులకు ఒక్క రోజు కోసం పెళ్లి జరిపిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత ఆ వధువు తిరిగి తన ప్రాంతానికి వెళ్లిపోతుంది. ఇలాంటి ఒక్కరోజు వధువులకు కూడా చైనాలో డిమాండ్ పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: ‘నా జీవితం ఇంకొకరికి అంకితం’.. నర్సు ఉద్యోగం రాగానే భర్తను గెంటేసి..
Comments
Please login to add a commentAdd a comment