ప్రతీకాత్మక చిత్రం
లక్నో: పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే వేడుక. అయితే ఇటీవల చూస్తే.. పీటల వరకు వచ్చిన వివాహాలు ఏదో ఒక కారణంగా ఆగిపోతున్నాయి. తాజాగా ఓ వధువు పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దని వరుడుకి షాకిచ్చింది. బంధువులు ఎంత నచ్చజెప్పినా ససేమిరా అంటూ తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో చౌబేపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరివురి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. ఆ రోజు సాయంత్రం వరుడు అతని బంధువులు ఊరేగింపుగా పెళ్లి మండపంలోకి చేరుకున్నారు. కాసేపటి తర్వాత వరడు, వధువు ఇద్దరూ కలిసి వేదికపైకి వెళ్లారు.
పెళ్లి తతంగాలు మొదలు పెట్టారు ఇరువైపు బంధువులు. ఈ క్రమంలో వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అదే సమయంలో మద్యం సేవించిన వరుడి స్నేహితులు పెళ్లి కుమార్తె స్నేహితులను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. దీంతో స్టేజీపై ఉన్న వారంతా ఆగ్రహానికి గురయ్యారు. వారితో పాటు వరుడు కూడా వింత పనులు చేస్తూన్నాడు. మాల వేస్తుండగా వరుడు మద్యం సేవించాడని వధువు గమనించింది. కోపంతో స్టేజి దిగి నేరుగా తన గదిలోకి పెళ్లికి నిరాకరించింది. కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి.
చదవండి: భానురేఖ మృతిపై.. విస్తుపోయేలా బెంగళూరు మహానగరపాలక సంస్థ రిపోర్టు
Comments
Please login to add a commentAdd a comment