లక్నో: ఇటీవల కాలంలో కొన్ని వివాహాలు వింత కారణాలతో పెళ్లి పీటలు వరకు వచ్చి ఆగిపోతున్నాయి. మంటపం వరకు వచ్చిన పెళ్లి కాస్త.. వరుడు లేక వధువు చేసిన పని ఇరువరిలో ఎవరికో ఒకరికి నచ్చక మధ్యలోనే పెళ్లిని ఆపేస్తున్నారు. ఈ తరహా రద్దు వివాహాలు ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లోని బిదునా పోలీస్ సర్కిల్ పరిధిలోని నవీన్ బస్తీలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఔరయ్యా జిల్లాలోని ఓ ప్రాంతంలో పెళ్లి జరగాల్సి ఉంది. ఆ వివాహ వేడుకలో అక్కడ సాంప్రదాయం ప్రకారం వరమాల కార్యక్రమం జరగాలి. అయితే అసలు సమస్యంతా ఇక్కడే వచ్చింది. వరమాల కార్యక్రమంలో.. వరడు దండను వధువు మెడలో వేయకుండా విసిరడంతో వధువుకి కోపం వచ్చింది. దీంతో వధువు పెళ్లి వద్దంటూ తెగేసి చెప్పేసింది. చివరకు ఆమె కుటుంబ సభ్యలు ఎంత చెప్పినా వినలేదు. ఈ విషయమై ఇరు కుటుంబాలు వాగ్వాదానికి కూడా దిగారు. విషయం తేల్చేందుకు పోలీసులను పిలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి పెళ్లి రద్దు చేసుకుని ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment