Viral Video: Amazing jugaad technique during construction of a wall - Sakshi
Sakshi News home page

వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు!

Published Sat, Jul 8 2023 12:34 PM | Last Updated on Sat, Jul 8 2023 12:55 PM

amazing jugaad for construction of a wall - Sakshi

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే కొన్ని వీడియోలు చూపరులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ వీడియోలను చూస్తే జనానికి ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ ముక్కున వేలేసుకుంటాం. కొందరు కార్లను హెలీకాప్టర్లుగా మార్చేస్తూ ఉంటే, మరికొందరు ఇటుకలతో కూలర్‌ తయారు చేస్తారు. 

@TansuYegen పేరుతో ట్విట్టర్‌లో
ఈ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో @TansuYegen పేరుతో ట్విట్టర్‌లో షేర్‌ అయ్యింది. ఈ వీడియోలో కొందరు కూలీలు గోడ నిర్మించడం కనిపిస్తుంది. ఇద్దరు కూలీలు రెండు కర్ర చెక్కలపై కూర్చుని కనిపిస్తారు. వారు కిందకు మీదకు కదులుతుంటారు. ఈ చెక్కలకు మరోవైపున ఉన్న కూలీలు ఆ చెక్కలను పైకి కిందకు కదుపుతుంటారు. ఒక కూలీ ఇటుక, సిమెంట్‌లను పైనున్న కూలీకి అందిస్తుండగా అతను వాటిని పైనున్న కూలీకి అందిస్తుంటాడు. వాటిని అందుకున్న ఆ కూలీ గోడను వేగంగా నిర్మిస్తుంటాడు.
 


సూపర్‌ ఐడియా అంటూ..
ఈ వీడియోను ఇప్పటివరకూ 2.5 మిలియన్లమందిపైగా నెటిజన్లు వీక్షించారు. చాలామంది దీనిని సూపర్‌ ఐడియా అంటూ ఆ కూలీలను మెచ్చుకుంటున్నారు. ఈ టెక్నిక్‌ నిర్మాణ పనిని మరింత వేగవంతం చేస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. కారణం తెలిస్తే షాకవుతారు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement