
తమిళసినిమా: నటి జాన్వీ కపూర్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అందాలరాశి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ వారసురాలిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తల్లిలాగే మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే అందుకు జాన్వీ కపూర్ సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. అయితే ఈమె గ్లామర్‌నే నమ్ముకున్నట్లు ఉంది. తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ విమర్శలను ఎదుర్కొంటోంది. ఇక జాన్వీ కపూర్ నటించిన చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోయినా, నటిగా మాత్రం తన ప్రయత్నం చేస్తూనే ఉంది.
తొలి చిత్రం దడక్ నుంచి గుడ్‌లక్ జెర్రి, రుషీ, గుంజన్ సక్సేనా, మిలి ఇలా జాన్వీ కపూర్ నటించిన సినిమాలన్ని వేర్వేరు జానర్‌లో తెరకెక్కిన చిత్రాలే. కాగా ఈమె నటించిన తాజా చిత్రం మిలి. సవ్వైవల్ డ్రామా కథ రూపొందిన ఈ చిత్రం ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను విపరీతంగా అలరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో జాన్వీ నటనకపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ఇండియన్ ఓటీటీలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని చిత్రవర్గాలు బుధవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇది నటి జాన్వికపూర్‌కు ఆనందాన్ని కలిగించే విషయమే కదా.
Comments
Please login to add a commentAdd a comment