Janhvi Kapoor Reveals Filming Mili Hurt Her Mental Health - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor : కలలో కూడా అదే గుర్తొచ్చేది.. పెయిన్‌ కిల్లర్స్‌ వాడాను

Published Tue, Nov 1 2022 12:19 PM | Last Updated on Tue, Nov 1 2022 2:43 PM

Janhvi Kapoor Reveals Filming Mili Hurt Her Mental Health - Sakshi

సాధారణంగా హీరోహీరోయిన్లు అన్నాక రకరకాల పాత్రల్లో నటించాల్సి వస్తుంది. అయితే వాటిలో కొన్ని సింపుల్‌ క్యారెక్టర్స్ ఉంటే.. మరికొన్ని తమ నటనకే పరీక్ష పేట్టే పాత్రలు ఉంటాయి. అలాంటి పాత్రలు పోషించినప్పుడే నటీనటులకు మంచి గుర్తింపు వస్తుంది. తాజాగా బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ ఓ చాలెంజింగ్‌ రోల్‌ చేసింది. ‘మిలి’ చిత్రంలో మైనస్‌ 16 డిగ్రీల చలిలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా నటించింది .దీని కోసం దాదాపు 7.5 కిలోల బరువు తగ్గింది. మలయాళ సూపర్‌ హిట్‌ ‘హెలెన్‌’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి మత్తుకుట్టి జేవియర్‌ దర్శకత్వం వహించారు. నవంబర్‌ 4న ఈ చిత్రం విడుదల కానుంది.

(చదవండి: దిల్‌ రాజు కొడుకును చూశారా.. ఫోటో వైరల్‌)

ఈ సందర్భంగా జాన్వీ ఓ జాతీయ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ.. షూటింగ్‌ సమయంలో ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించింది. ‘మిలి’సినిమా కోసం శారీరకంగానే కాకుండా.. మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నేను పోషించిన మిలీ నౌదియార్‌ పాత్ర కోసం 7.5 కిలోలు తగ్గాను. ఫ్రిజ్‌లో ఉన్నట్లు నటించిన సీన్స్‌ రాత్రి కలలోకి వచ్చేవి. సరిగా నిద్రకూడా పట్టేది కాదు.

దీంతో నా ఆరోగ్యం దెబ్బతింది. మూడు రోజుల పాటు పెయిన్‌ కిల్లర్‌ మాత్రలు వేసుకున్నాను. నాతో పాటు మా దర్శకుడి ఆరోగ్యం కూడా పాడైపోయింది.  ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగాలంటే ఇలాంటి పాత్రలు చేయాల్సిందే. మన పని మనం నిజాయితీగా చేస్తే దానికి తగ్గట్టుగా ఫలితం తప్పకుండా వస్తుంది’అని జాన్వీ కపూర్‌ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement