Actress Sameera Reddy Reveals How A Vegetable Seller Commented On Her Postpartum Body - Sakshi
Sakshi News home page

Sameera Reddy: కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా కామెంట్‌ చేశాడు.. భయంతో బయటకు రాలేదు

Published Sun, Aug 13 2023 3:38 PM | Last Updated on Sun, Aug 13 2023 3:50 PM

Actress Sameera Reddy Reveals How A Vegetable Seller Commented On Her Postpartum Body - Sakshi

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన చాలామంది నటీమణులు పెళ్లి తర్వాత సినిమాలకు సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి వారిలో నటి సమీరా రెడ్డి ఒకరు. అశోక్‌, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి.

(చదవండి: టాప్‌ హీరోయిన్‌.. 18 ఏళ్లకే గదిలో శవమై.. మెడపై ఉరితాడు గుర్తులు!)

గర్భం దాల్చిన సమయంలో కాస్త బరువు పెరిగారు. ఆ సమయంలో ఎవరికైనా ఈ మార్పులు సహజం. కానీ తనపై మాత్రం దారుణంగా విమర్శలు చేశారని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు. చివరకు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా బాడీ షేమింగ్‌ చేశారని బాధపడ్డారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వివాహం తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి చెప్పుకొచ్చారు. 

‘2014లో అక్షయ్‌తో నాకు పెళ్లి జరిగింది. చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నాం. అయితే కొంతమంది మాత్రం నేను ప్రేగ్నెంట్‌ అయ్యాయనని, అందుకే ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారని పుకార్లు సృష్టించారు. అలా ఎందుకు పుట్టించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇక నా ఫస్ట్‌ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాను.

2015లో బాబు పుట్టాక నా శరీరాకృతిలో మార్పులు వచ్చాయి. బరువు పెరిగాను. దీంతో చుట్టు పక్కల వాళ్లు నా శరీరాకృతిపై కామెంట్‌ చేశారు. చివరకు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ‘ఇది మీరేనా?, ఇలా మారిపోయారేంటి?’అని అన్నారు. వారి మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. మీడియాకు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. అభిమానులతో కనెక్ట్‌ కావాలనే ఉద్దేశంతో సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాను. ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేట్‌ చేసుకున్న తర్వాత దానిని ప్రమోట్‌ చేయాలని ఇండస్ట్రీలోని స్నేహితులను కోరితే..ఒక్కరు కూడా సాయం చేయలేదు. చాలా బాధపడ్డాను’ అని సమీరారెడ్డి చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement