షుమాకర్‌పై దావా
గతంలో మోటార్‌బైక్‌ను ఢీకొట్టిన డ్రైవర్
మాడ్రిడ్: స్కీయింగ్ చేస్తూ గాయపడి కోమాలోకి వెళ్లిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్‌పై... గతంలో యాక్సిడెంట్ చేశాడన్న ఆరోపణలతో కోర్టులో కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 17న బోర్మోజోస్ టౌన్ (స్పెయిన్)లో అద్దె కారులో ప్రయాణించిన షుమాకర్... మోటార్‌బైక్‌పై వెళ్తున్న ఫ్రాన్సిస్కో ఎం.ఎ. అనే వ్యక్తిని ఢీకొట్టాడు.
రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో పాటు సరైన వెలుతురు లేకుండా ప్రయాణిస్తూ రోడ్ మలుపు తిరిగే సమయంలో బైక్‌ను గుద్దాడు. ఈ యాక్సిడెంట్‌లో ఫ్రాన్సిస్కోకు మణికట్టు విరగడంతో పాటు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేయాలంటే కోర్టులో కేసు విచారణ జరగాలి. కానీ ఆరోపణలు ఎదుర్కొంటున్న షుమాకర్ కోర్టుకు హాజరుకాలేని పరిస్థితి ఉండటంతో కేసు తేలేలా కనిపించడం లేదు.