దొంగను చేసిన బైక్ మోజు
గూడూరు టౌన్: మోటారు బైక్‌లపై షికారు చేయాలనే కోరిక ఆ యువకుడిని దొంగను చేసింది. కనిపించిన బైక్‌ను చిటికెలో మాయం చేసి అందులో పెట్రోల్ అయిపోయేంత వరకు షికారు చేశాక వదిలేసేవాడు. తరచూ బైక్‌లు చోరీకి గురవతుండటంతో పోలీసులు నిఘా పెట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితు డి వివరాలను బుధవారం గూడూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో డీఎస్పీ శ్రీని వాస్ విలేకరులకు వివరించారు.
బాలాయపల్లి మండలం జయంపునకు చెంది న మోడిబోయిన చెంచయ్యకు తల్లిదండ్రులు లేరు. జులాయిగా తిరిగే చెం చయ్య సినిమాల ప్రభావంతో బైక్ షికారుపై మోజు పెంచుకున్నాడు. ఎక్కడై నా బైక్ కనిసిస్తే దాన్ని అపహరించి అందులో పెట్రోలు అయిపోయేంత వరకు షికారు చేసేవాడు. అనంతరం ఆ బైక్‌ను అక్కడే వదిలేసేవాడు. ఇలా ఇప్పటి వరకు గూడూరు, నాయుడుపేట, వెంకటగిరి ప్రాంతాల్లో 9 బైక్‌లను అపహరించాడు.
తరచూ బైక్‌లు చోరీకి గురవుతుండటంతో పట్టణ సీఐ భూషణం, ఎస్సైలు బాబీ, అజయ్‌కుమార్ నిఘా పెట్టారు. బృందాలుగా ఏర్పడి మంగళవారం సాయంత్రం వెంకటగిరి క్రాస్‌రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన చెంచయ్య ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాలు అంగీకరించాడు. అతను వదిలేసి వెళ్లిన 9 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. చెంచయ్యను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ఆయన వెంట ఒకటో పట్టణ ఎస్సై బాబి, సిబ్బంది ఉన్నారు.
‘పవర్‌గ్రిడ్’లో చోరీ కేసును ఛేదిస్తాం
మనుబోలు మండలం కాగితాలపూరు సమీపంలోని పవర్‌గ్రిడ్ క్వార్టర్స్‌లో జరిగిన భారీ చోరీ కేసును త్వరలో ఛేదిస్తామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. నలుగురు సీఐలు, ఎస్సైలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు విచారణ ను వేగవంతం చేశామన్నారు. పవర్‌గ్రిడ్‌లో సెక్యూరిటీ లోపభూయిష్టంగా ఉందన్నారు.భద్రత పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.