Tamil Nadu Man Buys Dream Bike With One Rupee Coins, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

రూపాయి కాయిన్లతో డ్రీమ్‌ బైక్‌.. మూడేళ్ల కష్టం

Published Mon, Mar 28 2022 1:21 PM | Last Updated on Mon, Mar 28 2022 2:23 PM

Youth In Tamil Nadus Collect 1 Rupee Coins Buy Dream Bike Viral - Sakshi

సాక్షి చెన్నై: గతంలో ఒక వ్యక్తి చిల్లర పైసలతో డ్రీమ్‌ స్కూటీని కొనుగోలు చేశాడు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఏకంగా అత్యంత ఖరీదైన బైక్‌ని రూపాయి కాయిన్లతో కొనుగోలు చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని సేలంలో భూబాతీ అనే యువకుడు తన డ్రీమ్‌ బైక్‌ని కొనేందుకు రూపాయి నాణేలను సేకరించాడు. మూడేళ్ల క్రితం ఒక బైక్‌ కొనాలనుకున్నాడు. అప్పడు ఆ బైక్‌ ఖరీదు రూ.2 లక్షలు. అందుకోసం గత మూడేళ్లుగా రూపాయి నాణేలు సేకరించడం మొదలు పెట్టాడు.

ఈ మేరకు ఆ యువకుడు సుమారు 2.6 లక్షల రూపాయి నాణేలతో తన డ్రీమ్‌ బైక్‌ని కొనుగోలు చేశాడు. ఆ మోటార్‌ సైకిల్‌ షోరూం సిబ్బందికి ఆ నాణేలను లెక్కించేందుకు సుమారు 10 గంటల సమయం పట్టిందని భారత్ ఏజెన్సీ మేనేజర్ మహావిక్రాంత్ తెలిపారు. ఇలానే ఇటీవల ఒక వృద్ధుడు తన డ్రీమ్‌ కారును కొనుక్కునేందుకు తన పెన్షని వెచ్చించాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్‌లైన్‌లో వైరల్‌ తెగ అవుతోంది.

(చదవండి: ఆమె గోల్‌ కోసమే టెన్షన్‌...వేస్తుందా ? లేదా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement