One Rupee coins
-
రూపాయి కాయిన్లతో డ్రీమ్ బైక్.. మూడేళ్ల కష్టం
సాక్షి చెన్నై: గతంలో ఒక వ్యక్తి చిల్లర పైసలతో డ్రీమ్ స్కూటీని కొనుగోలు చేశాడు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఏకంగా అత్యంత ఖరీదైన బైక్‌ని రూపాయి కాయిన్లతో కొనుగోలు చేశాడు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తమిళనాడులోని సేలంలో భూబాతీ అనే యువకుడు తన డ్రీమ్ బైక్‌ని కొనేందుకు రూపాయి నాణేలను సేకరించాడు. మూడేళ్ల క్రితం ఒక బైక్ కొనాలనుకున్నాడు. అప్పడు ఆ బైక్ ఖరీదు రూ.2 లక్షలు. అందుకోసం గత మూడేళ్లుగా రూపాయి నాణేలు సేకరించడం మొదలు పెట్టాడు. ఈ మేరకు ఆ యువకుడు సుమారు 2.6 లక్షల రూపాయి నాణేలతో తన డ్రీమ్ బైక్‌ని కొనుగోలు చేశాడు. ఆ మోటార్ సైకిల్ షోరూం సిబ్బందికి ఆ నాణేలను లెక్కించేందుకు సుమారు 10 గంటల సమయం పట్టిందని భారత్ ఏజెన్సీ మేనేజర్ మహావిక్రాంత్ తెలిపారు. ఇలానే ఇటీవల ఒక వృద్ధుడు తన డ్రీమ్ కారును కొనుక్కునేందుకు తన పెన్షని వెచ్చించాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆన్లైన్లో వైరల్ తెగ అవుతోంది. (చదవండి: ఆమె గోల్ కోసమే టెన్షన్...వేస్తుందా ? లేదా!) -
రూ.10 కోట్లకు అమ్ముడుపోయిన రూపాయి నాణేం.. అంత ధర ఎందుకు!
1885 One Rupee Coin Value In Auction: పాత నాణేలు, నోట్లు సేకరించే అలవాటు చాలామందికి ఉంటుంది. పాతవి, అరుదైన నాణేలు ఎక్కడ కనిపించిన భద్రంగా దాచుకుంటారు. కొందరేమో వాటికి మంచి ధర దొరికిన సమయంలో అమ్ముకుంటారు. ఈ క్రమంలో ఓ పాత నాణేం ఊహించని ధరకు అమ్ముడుపోయిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. అరుదైన రూపాయి నాణేం అన్లైన్ వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఒక లాటరీలో దక్కించుకున్న సొమ్ముకు ఏమాత్రం తీసిపోదు. నమ్మడానికి కాస్తా వింతగా అనిపించినా ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం వెనక ఓ కారణం ఉంది. అయితే ఈ నాణేం ఇప్పటిది కాదు.1885లో భారత్‌లో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణెం. ఓ వ్యక్తి దగ్గర ఇది ఉండగా ఇటీవల జరిగిన వేలంపాటలో ఓ వెబ్సైట్ దీనిని ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఒక్క నాణేం అతన్ని మిలియనీర్ చేసింది. గత జూన్‌లో కూడా 1933 నాటి యూఎస్ నాణేం న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 18.9 మిలియన్లు( దాదాపు 188 కోట్లు) అమ్ముడుపోయింది. చదవండి: Biggest Ice Gola: ఈ ఐస్‌గోళా అతిపె..ద్ద..ది.. ధర ఎంతంటే!! స్పైడర్మెన్లా గోడను పాకిన చిన్నారి.. ‘నీ టాలెంట్ సూపర్’ -
'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను'
సాక్షి, బనశంకరి: 1947 నాటి రూపాయి నాణేన్ని కొనుగోలు చేస్తానని చెప్పి ఉపాధ్యాయురాలికి రూ.లక్ష టోపీ వేశాడు సైబర్ మోసగాడు. బెంగళూరు సర్జాపుర రోడ్డులో ఉండే టీచర్ (38) తన వద్ద 1947 నాటి అరుదైన రూపాయి నాణెం ఉందని, విక్రయిస్తానని జూన్ 15 తేదీన ఓఎల్ఎక్స్ యాప్‌లో ప్రకటన ఇచ్చి మొబైల్ నెంబరు పెట్టింది. ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి తాను రూ.కోటికి కొంటానని చెప్పి ఆమె బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నాడు. అంత డబ్బు మీ ఖాతాలోకి పంపాలంటే కొన్ని పన్నులు కట్టాలి అని ఆమె నుంచే పలుసార్లు రూ.లక్ష వరకు తన ఖాతాలోకి బదిలీ చేయించుకున్నాడు. అతడు మళ్లీ మళ్లీ డబ్బులు కట్టాలని కోరడం, గట్టిగా అడిగిన తరువాత అతని ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో మోసపోయినట్లు తెలుసుకున్న టీచరమ్మ వైట్‌పీల్డ్ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
ఒక్క రూపాయి నాణెం రద్దు చేశారు!
రాంపూర్ : యాచకులకు ఒక్క రూపాయి నాణెంను దానంగా వేస్తున్నారా? అయితే ఇక నుంచి వాటిని వారు స్వీకరించరట. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో యాచకుల గ్రూప్ ఒక్క రూపాయి నాణెంను ఇక మీదట దానంగా అంగీకరించకూడదని నిర్ణయించింది. ఈ నాణెంను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేసినట్టుగానే, ఇక మీదట తాము కూడా ఒక్క రూపాయి నాణెంను రద్దు చేస్తున్నామని, దీని సైజు 50 పైసల మాదిరి ఉందని యాచకుడు శుక్ర మని చెప్పాడు. ఈ కాయిన్లను తమ వద్ద నుంచి స్వీకరించవద్దని దుకాణాదారులకు, రిక్షావారిని కూడా కోరినట్టు యాచకులు చెప్పారు. ఇక నుంచి యాచకులకు ఎవరు దానం చేయాలన్న ఒక్క రూపాయి కంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. -
'రూపాయి ఉంగరాల' బామ్మ
ఆదిలాబాద్ : ఎవరైనా ముత్యాలు, పగడాలు, వజ్రాలలాంటి రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాలను ధరించడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వాటిని ఆసక్తిగా ఆర్డరిచ్చి చేయించుకుంటారు. కానీ ఓ వృద్ధురాలు రూపాయి నాణాలు వేళ్లపై కనబడేలా ఉంగరాలు చేయించుకుని చేతివేళ్లకు ధరించి అందరినీ ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా కండెల గ్రామానికి చెందిన రుక్మిణి బాయికి మొదటి నుంచి అలంకరణ మీద అమితమైన ఆసక్తి. ఆమె అలంకరణ కూడా అందరికంటే భిన్నంగా ఉండేది. ఈ క్రమంలోనే రూపాయి నాణాలతో ఉంగరాలను తయారుచేయించుకుంది. ఆమె ధరించిన ఆ రూపాయి నాణాలు తన స్వార్జితమని, అవి తన కళ్ల ముందు ఎప్పుడూ కనబడుతూనే ఉండాలని ఇలా చేయించుకున్నానని అందరికీ చూపెడుతూ తెగ మురిసిపోతుంది ఈ రుక్మిణి బామ్మ.