
ప్రతీకాత్మక చిత్రం
1885 One Rupee Coin Value In Auction: పాత నాణేలు, నోట్లు సేకరించే అలవాటు చాలామందికి ఉంటుంది. పాతవి, అరుదైన నాణేలు ఎక్కడ కనిపించిన భద్రంగా దాచుకుంటారు. కొందరేమో వాటికి మంచి ధర దొరికిన సమయంలో అమ్ముకుంటారు. ఈ క్రమంలో ఓ పాత నాణేం ఊహించని ధరకు అమ్ముడుపోయిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. అరుదైన రూపాయి నాణేం అన్‌లైన్ వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఒక లాటరీలో దక్కించుకున్న సొమ్ముకు ఏమాత్రం తీసిపోదు. నమ్మడానికి కాస్తా వింతగా అనిపించినా ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం వెనక ఓ కారణం ఉంది.
అయితే ఈ నాణేం ఇప్పటిది కాదు.1885లో భారత్‌లో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణెం. ఓ వ్యక్తి దగ్గర ఇది ఉండగా ఇటీవల జరిగిన వేలంపాటలో ఓ వెబ్‌సైట్ దీనిని ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఒక్క నాణేం అతన్ని మిలియనీర్ చేసింది. గత జూన్‌లో కూడా 1933 నాటి యూఎస్ నాణేం న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 18.9 మిలియన్లు( దాదాపు 188 కోట్లు) అమ్ముడుపోయింది.
చదవండి: Biggest Ice Gola: ఈ ఐస్‌గోళా అతిపె..ద్ద..ది.. ధర ఎంతంటే!!
స్పైడర్‌మెన్‌లా గోడను పాకిన చిన్నారి.. ‘నీ టాలెంట్ సూపర్’