old coins
-
రూ.10 కోట్లకు అమ్ముడుపోయిన రూపాయి నాణేం.. అంత ధర ఎందుకు!
1885 One Rupee Coin Value In Auction: పాత నాణేలు, నోట్లు సేకరించే అలవాటు చాలామందికి ఉంటుంది. పాతవి, అరుదైన నాణేలు ఎక్కడ కనిపించిన భద్రంగా దాచుకుంటారు. కొందరేమో వాటికి మంచి ధర దొరికిన సమయంలో అమ్ముకుంటారు. ఈ క్రమంలో ఓ పాత నాణేం ఊహించని ధరకు అమ్ముడుపోయిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. అరుదైన రూపాయి నాణేం అన్లైన్ వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఒక లాటరీలో దక్కించుకున్న సొమ్ముకు ఏమాత్రం తీసిపోదు. నమ్మడానికి కాస్తా వింతగా అనిపించినా ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం వెనక ఓ కారణం ఉంది. అయితే ఈ నాణేం ఇప్పటిది కాదు.1885లో భారత్‌లో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణెం. ఓ వ్యక్తి దగ్గర ఇది ఉండగా ఇటీవల జరిగిన వేలంపాటలో ఓ వెబ్సైట్ దీనిని ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఒక్క నాణేం అతన్ని మిలియనీర్ చేసింది. గత జూన్‌లో కూడా 1933 నాటి యూఎస్ నాణేం న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 18.9 మిలియన్లు( దాదాపు 188 కోట్లు) అమ్ముడుపోయింది. చదవండి: Biggest Ice Gola: ఈ ఐస్‌గోళా అతిపె..ద్ద..ది.. ధర ఎంతంటే!! స్పైడర్మెన్లా గోడను పాకిన చిన్నారి.. ‘నీ టాలెంట్ సూపర్’ -
మీ దగ్గర ఈ 25 పైసల నాణెం ఉంటే లక్షాధికారులే
న్యూఢిల్లీ: మీ దగ్గర పాత 25 పైసల నాణెం ఉందా.. ఒకవేళ ఉంటే మీరు లక్షాధికారులు కావచ్చు అంటుంది ఇండయామార్ట్ వెబ్సైట్. పావలా ఉంటే లక్షాధికారులు ఎలా అవుతారా అని ఆలోచిస్తున్నారా అయితే ఇది చదవండి. ఇండియామార్ట్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. మీ దగ్గర గనుక 1992 కాలం నాటి ఖడ్గ మృగం ఉన్న 25 పైసల కాయిన్ ఉంటే.. మీరు లక్షాధికారులే అని తెలిపింది. ఇందుకు గాను మీరు ఆ కాయిన్‌ను రెండు వైపులా ఫోటో తీసి.. ఇండియామార్ట్. కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అక్కడ దీన్ని వేలం వేస్తారు. ఎంత ఎక్కువ ధర పలుకుతుందనేది బిడ్డర్ల మీద ఆధారపడి ఉంటుంది. అయితే గరిష్టంగా 1.50 లక్షల రూపాయల వరకు పలకవచ్చని భావిస్తున్నారు. ఈ 25 పైసల నాణెం తప్పకుండా వెండి రంగులో ఉండాలి అని తెలిపింది. ఇక మీ దగ్గర పాత 5,10 పైసల నాణేలు ఉంటే వాటిని ఇండియామార్ట్ వెబ్సైట్లో అమ్మి డబ్బు చేసుకోవచ్చు. అలానే ఎవరికైనా పాత నాణేల మీద ఆసక్తి ఉంటే ఇక్కడ కొనవచ్చు. ఇక ఇండియామార్ట్ భారతదేశంలోకెల్లా అతిపెద్ద ఇ-కామర్స్ వెబ్సైట్లలో ఒకటి. "ఇండియామార్ట్ 10 కోట్లకు పైగా కొనుగోలుదారులు, 60 లక్షలకు పైగా సరఫరాదారులకు సేవలు అందిస్తోంది. మీరు రిటైలర్, తయారీదారు అయినా, ఆన్లైన్లో వ్యాపారం పెరగడానికి ఇండియామార్ట్ మంచి గమ్య స్థానం అని దాని వెబ్సైట్లో పేర్కొంది. ఇక ఇది ఎంత వాస్తవమనేది చూడాలి. చదవండి: రూ.5 కాయిన్‌కు రూ.5 లక్షలట! -
ఈ నాణెం విలువ రూ. 9.5 కోట్లు
షికాగో : అమెరికాలోని షికాగోలో ఓ వస్తువు వేలం పాట జరుగుతోంది.. అందరూ ఆ వస్తువును దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. అందులో యుటా రాష్ట్రానికి చెందిన ఒక పెద్దాయన అందరి కన్నా ఎక్కువ.. దాదాపు రూ.9.5 కోట్లు వేలం పాట పాడి ఆ వస్తువును దక్కించుకున్నాడు. అమ్మో అంత మొత్తంతో దక్కించుకున్న ఆ వస్తువు ఏమై ఉంటుందనే కదా మీ ఉత్కంఠ.. అది పది పైసల బిళ్ల. ఏంటీ.. పది పైసల బిళ్లను అన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నాడా.. అతడికేమైనా పిచ్చి పట్టిందా.. అని తిట్టుకోకండి. ఎందుకంటే ఆ పదిపైసల బిళ్ల చాలా విలువైంది. ఆ బిళ్లను డైమ్ అంటారు. ఒక్క డాలరులో పదో వంతు దీని విలువ ఉంటుంది. అంటే రూపాయిలో పదో వంతన్నమాట. అయితే ఈ డైమ్ నాణేన్ని 1894లో ముద్రించారు. ఇప్పటివరకు ఇలాంటి నాణేలను 24 మాత్రమే ముద్రించారు. -
టీటీడీలో పురాతన నాణేలు మాయం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు మాయమవుతున్నాయి. రూ. కోట్లు విలువచేసే అతిపురాతనమైన నాణేలు కనిపించకుండా పోయాయి. భక్తులు శ్రీవారికి నాణేల రూపంలో సమర్పించే కానుకలను టీటీడీ అధికారులు పరకామణిలో లెక్కించి రికార్డుల్లో నమోదు చేస్తారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలోని ట్రెజరీలో భద్రపరుస్తారు. ఇందులోకి టీటీడీ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించరు. అలాంటి ట్రెజరీలో భద్రపరచిన 49 అతి పురాతనమైన బంగారు నాణేలు మాయమైనట్లు టీటీడీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒక్కో నాణెం విలువే రూ.కోటి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.కాగా తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా వస్తున్న నాణేల లెక్కింపు ప్రక్రియను ఇకపై తిరుపతిలోనే చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనం ఆవరణంలో రూ. 4 కోట్ల నిధులతో కొత్తగా నిర్మించిన పరకామణి భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. -
పురాతన నాణేలు స్వాధీనం
అనంతపురం సెంట్రల్: కర్ణాటకలోని బీజాపూర్ కోటలో తవ్వకాల్లో బయటపడిన పురాతన నాణేలను విక్రయించేందుకు సిద్ధపడ్డ నిందితుడు బెస్త కరుణాకర్‌బాబును నాల్గవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పాత నేరస్తుడుగా ఉన్న సదరు నిందితుడు బుధవారం తపోవనం బస్‌స్టాప్ వద్ద పురాతన నాణేలతో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి అమ్మవారి విగ్రహం, మత్తు పానీయం సేవించే పాత్ర, , రాగి బిందె, 822 రాగి నాణెలు స్వాధీనం చేసుకున్నట్లు నాల్గవ పట్టణ సీఐ శ్యామరావు వెల్లడించారు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు వివరించారు.