సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకలు మాయమవుతున్నాయి. రూ. కోట్లు విలువచేసే అతిపురాతనమైన నాణేలు కనిపించకుండా పోయాయి. భక్తులు శ్రీవారికి నాణేల రూపంలో సమర్పించే కానుకలను టీటీడీ అధికారులు పరకామణిలో లెక్కించి రికార్డుల్లో నమోదు చేస్తారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలోని ట్రెజరీలో భద్రపరుస్తారు. ఇందులోకి టీటీడీ ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఎవరినీ అనుమతించరు. అలాంటి ట్రెజరీలో భద్రపరచిన 49 అతి పురాతనమైన బంగారు నాణేలు మాయమైనట్లు టీటీడీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఒక్కో నాణెం విలువే రూ.కోటి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.కాగా తిరుమల శ్రీవారికి హుండీ ద్వారా వస్తున్న నాణేల లెక్కింపు ప్రక్రియను ఇకపై తిరుపతిలోనే చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనం ఆవరణంలో రూ. 4 కోట్ల నిధులతో కొత్తగా నిర్మించిన పరకామణి భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు.
టీటీడీలో పురాతన నాణేలు మాయం
Published Thu, Dec 14 2017 1:32 AM | Last Updated on Thu, Dec 14 2017 1:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment