crores of money
-
ఖమ్మంలో బెట్టింగుల హోరు !
సాక్షి,ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఇప్పటికే బెట్టింగ్ మార్క్ 100 కోట్లు దాటిందా? పోలింగ్ సమయానికి బెట్టింగులు మరింతగా పెరుగుతాయా? ఏపీకి చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లా బెట్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థులు మాత్రం తమ గెలుపోటములపై బెట్టింగులు పెట్టవద్దని సూచిస్తున్నారంటూ టాక్ మొదలైంది. ఇంతకీ బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం మొదలైన ఆ నాలుగు స్థానాల కథేంటో చూద్దాం. పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఖమ్మంలో ఏంజరుగుతోందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న పది సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. ఒకవైపున పోరు రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు కూడా అదే రేంజ్లో సాగుతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా రెండు జనరల్ సీట్లు..రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయం మీద భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి అధికార గులాబీ పార్టీ తరపున మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్...కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్యా పోటీ అత్యంత తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఈ ఇద్దరి గెలుపు ఓటములపై భారీ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పది వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపులా బెట్టింగ్ నడుస్తున్నాయి. అయితే మెజారిటీ 30వేలు దాటుతుందని ఓ పార్టీ అభ్యర్థిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టారు. ఇక పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున కందాల ఉపేందర్‌రెడ్డి...కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. ముగ్గురి మధ్య పోటీ టఫ్‌గా ఉంది. అందుకే ఒక్క ఓటుతో గెలుస్తారనేదానిపై ఎక్కువగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోనే బెట్టింగులు వంద కోట్లు దాటాయని టాక్ నడుస్తోంది. ఖమ్మం, పాలేరు స్థానాల తర్వాత..సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. అనూహ్యంగా సత్తుపల్లిలో బెట్టింగ్‌లు భారీగా పెరిగాయి. ఇక్కడ కూడా ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ నడుస్తూ ఉండటమే బెట్టింగులకు కారణం. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులకు సంబంధించి 5 వేల లోపు మెజార్టీతో బయట పడుతారని బెట్టింగ్‌లు కాస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలో ఉండగా..కాంగ్రెస్ నుంచి మట్టా రాగమయి పోటీ చేస్తున్నారు. మధిరలో సైతం సీఎల్పీ నేత భట్టి విక్కమార్క గెలుస్తారా లేదా అనేదానిపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. మధిరలో బీఆర్ఎస్ నుంచి లింగాల కమల్ రాజ్ బరిలో ఉండగా...భట్టి విక్కమార్క కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 10వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపుల నుంచి బెట్టింగ్ లు నడుస్తున్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకి పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. బెట్టింగ్‌లు సైతం అదే స్థాయిలో స్పీడ్ అందుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బెట్టింగ్ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారన్న దానిపై నిరంతరం -
బ్యాంక్ ఉద్యోగం వదిలి కోట్లు సంపాదిస్తున్నాడిలా!
Amith Kishan Success Story: ఆధునిక పోటీ ప్రపంచంలో ఒకరి కంటే ఒకరు ముందుగా డెవలప్ అవ్వాలనే ఆలోచనల్లో పడి సంపాదన బాటలో పడి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయడం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలను వదిలి పెట్టి కేవలం డబ్బు వెంట పరుగెడుతూ తక్కువ వయసులోనే తనువు చాలిస్తున్నారు. ఉద్యోగం ఏదైనా అందులోనే పడి బతికేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగం వదిలేసి బాగా సంపాదిస్తూ ఈ రోజు ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇంతకీ అతడెవరు? అతన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన సాధించిన సక్సెస్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. బ్యాంక్ ఉద్యోగం.. నివేదికల ప్రకారం, కర్ణాటక చిక్కబళ్ళాపూర్ ప్రాంతానికి చెందిన 'అమిత్ కిషన్' (Amith Kishan) చదువు పూర్తయిన తరువాత చాలా సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగం చేసాడు. ఇందులో భాగంగానే ఐసీఐసీఐ, బజాజ్, హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి వాటిలో పనిచేశాడు. నిజానికి అమిత్ తాత గారు వ్యవసాయంలో దిట్ట, చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పలుకుబడి ఉండేది. ఈ కారణంగానే అమిత్ కిషన్‌కి కూడా చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండేది. దీంతో ఉద్యోగం చేస్తున్నప్పటికీ అతనికి వ్యవసాయం చేయాలనే కోరిక బలంగా ఉండేది. ''డబ్బు సంపాదిస్తున్నాము, కానీ ఆరోగ్యకరమైన ఆహారం తినలేకపోతున్నామనేది'' అతని మనసులో ఎప్పటి నుంచి ఉన్న ప్రశ్న. అదే సమయంలో అతని మిత్రుడు అనారోగ్యంతో చనిపోవడం అతన్ని మరింత కృంగదీసింది. ఉద్యోగానికి రాజీనామా.. సుమారు ఎనిమిది సంవత్సరాలు బ్యాంక్ ఉద్యోగం చేసిన అమిత్ వ్యవసాయం చేయడానికి ఉద్యోగానికి స్వస్తి పలికాడు. ఆ తరువాత తాతగారి ఊరిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. దీనికి అతని తమ్ముడు అశ్రిత్ చాలా సహకరించాడు. వీరిరువురు మిర్చి, వేరుశెనగ వంటి పంటలు చేయడం మొదలు పెట్టారు. అయితే సీజన్ల విషయంలో అవగాహన లేకపోవడంతో మొదట వైఫల్యమే ఎదురైంది. ఆ తరువాత వ్యవసాయం గురించి మరింత తెలుసుకోవడం ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం.. సేంద్రియ వ్యవసాయం చేయాలనే సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. అయితే ఇది అనుకున్నంత సులభమేమీ కాదు, కానీ దీని కోసం భూమిని నాలుగు అడుగులు తవ్వి అందులో రసాయనాలకు బదులు ఆవు పేడ, మూత్రం వంటి వాటితో పాటు అరటిపండు తొక్కలు కూడా వేసాడు. ఈ ఆలోచన చాలా బాగా సక్సెస్ అయింది. భూమిని సారవంతం చేయడంలో ఇది చాలా ఉపయోగపడింది. (ఇదీ చదవండి: రాధిక ధరించిన ఈ డ్రెస్ అంత ఖరీదా? అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది మరి!) సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగించిన భూమిలో వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. ప్రారంభంలో రూ. 1.5 కోట్లతో సుమారు 15 ఎకరాల భూమితో ప్రారంభమైన వీరి వ్యవసాయం ఇప్పుడు ఏకంగా 600 ఎకరాలకు విస్తరించింది. వీరి పొలాల్లో ఉపయోగించడానికి సేంద్రియ ఎరువుల కోసం ఆవులు, గేదెలను కూడా వారే పెంచుతున్నారు. సుమారు ఇవన్నీ 700 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: మూడు పోస్టులు.. మిలియన్ ఫాలోవర్స్ - మెటా థ్రెడ్స్‌లో యూట్యూబర్ హవా!) హెబ్పేవు ఫామ్స్ & సూపర్ మార్కెట్.. ఒక పక్క సేంద్రియ వ్యవసాయం, మరో వైపు పాల వ్యాపారం కూడా బాగా సాగింది. వీరి వ్యాపారానికి హెబ్పేవు ఫామ్స్, హెబ్పేవు సూపర్ మార్కెట్ అని పేరు పెట్టారు. వ్యవసాయం బాగా విస్తరించిన తరువాత వార్షిక ఆదాయం రూ. 21 కోట్లకు చేరింది. ప్రస్తుతం వీరి వద్ద 120 మంది వ్యక్తులతో ఒక టీమ్ ఉంది. అంతే కాకుండా వీరి వ్యవసాయ క్షేత్రంలో 3000 మంది కంటే ఎక్కువ మంది మహిళలు పనిచేస్తున్నారు. హెబ్పేవు ఉత్పత్తులు బెంగళూరు వంటి నగరాల్లో విరివిగా అమ్ముడవుతున్నాయి. -
జాక్‌పాట్: అకౌంట్లో పడిన 18 కోట్లు.. ఖాతాదారుడు ఏం చేశాడంటే?
సాక్షి, వికారాబాద్: జిల్లాలోని ఓ వ్యక్తి అకౌంట్లో ఏకంగా రూ. 18కోట్లు జమయ్యాయి. బ్యాంక్ ఖాతా చెక్ చేసి షాకైన సదరు బ్యాంక్ ఖతాదారుడు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన వ్యాపారి వెంకట్‌రెడ్డికి జాక్‌పాట్ తగిలింది. అతడి HDFC బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 18.52 కోట్లు జమయ్యాయి. డబ్బులు పడిన విషయం తెలుసుకున్న వెంకట్‌రెడ్డి.. బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. నిన్న(ఆదివారం) కూడా తమిళనాడులో HDFC బ్యాంకుకు చెందని పలువురి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో సంబంధిత బ్యాంకు అధికారులు అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: కేజీఎఫ్ కోటలో కలకలం -
రూ.10 కోట్లకు అమ్ముడుపోయిన రూపాయి నాణేం.. అంత ధర ఎందుకు!
1885 One Rupee Coin Value In Auction: పాత నాణేలు, నోట్లు సేకరించే అలవాటు చాలామందికి ఉంటుంది. పాతవి, అరుదైన నాణేలు ఎక్కడ కనిపించిన భద్రంగా దాచుకుంటారు. కొందరేమో వాటికి మంచి ధర దొరికిన సమయంలో అమ్ముకుంటారు. ఈ క్రమంలో ఓ పాత నాణేం ఊహించని ధరకు అమ్ముడుపోయిన ఘటన తాజాగా చోటుచేసుకుంది. అరుదైన రూపాయి నాణేం అన్లైన్ వేలంలో కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఒక లాటరీలో దక్కించుకున్న సొమ్ముకు ఏమాత్రం తీసిపోదు. నమ్మడానికి కాస్తా వింతగా అనిపించినా ఇంత ఎక్కువ ధరకు అమ్ముడు పోవడం వెనక ఓ కారణం ఉంది. అయితే ఈ నాణేం ఇప్పటిది కాదు.1885లో భారత్‌లో బ్రిటిష్ రాజులు పరిపాలిస్తున్న కాలంలో జారీ చేసిన రూపాయి నాణెం. ఓ వ్యక్తి దగ్గర ఇది ఉండగా ఇటీవల జరిగిన వేలంపాటలో ఓ వెబ్సైట్ దీనిని ఏకంగా రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఒక్క నాణేం అతన్ని మిలియనీర్ చేసింది. గత జూన్‌లో కూడా 1933 నాటి యూఎస్ నాణేం న్యూయార్క్‌లో జరిగిన వేలంలో 18.9 మిలియన్లు( దాదాపు 188 కోట్లు) అమ్ముడుపోయింది. చదవండి: Biggest Ice Gola: ఈ ఐస్‌గోళా అతిపె..ద్ద..ది.. ధర ఎంతంటే!! స్పైడర్మెన్లా గోడను పాకిన చిన్నారి.. ‘నీ టాలెంట్ సూపర్’ -
షాకింగ్: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లలో ఏకంగా రూ. 900 కోట్లు జమ!
పాట్నా: ఇటీవల బిహార్‌లోని ఖగారియా జిల్లాలో ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.5.5 లక్షలు డిపాజిట్ అయిన విషయం తెలిసిందే. అయితే అవి తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని, వాటిని తిరిగి ఇవ్వనని తెగించి చెప్పాడు. దీంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే అదే బిహార్‌లో మరొకటి వెలుగులోకి వచ్చింది. కానీ ఈసారి డబ్బులు లక్షల్లో కాదు ఏకంగా వందల కోట్ల రూపాయలు అకౌంట్లో జమయ్యాయి. అది కూడా పాఠశాలకు వెళ్లే పిల్లల అకౌంట్లలో. 10, 100 రూపాయలకే ఆనందపడే చిన్న పిల్లలు ఒకేసారి వారి అకౌంట్లలో రూ. 900 కోట్ల రూపాయలు జమ అయితే ఎలా ఉంటుంది. వారి సంతోషానికి అవధులు లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే.. కటిహార్ జిల్లాలోని బౌరా పంచాయితీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన ఆశిష్, విశ్వాస్ అనే ఇద్దరు విద్యార్థులకు బిహార్ గ్రామీణ్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వీరి పాఠశాల యూనిఫామ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు తమ తల్లిదండ్రులతో కలిసి ఊరిలోని ఇంటర్నెట్ వద్దకు వెళ్లారు.. బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వత వారి ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ఆరో తరగతి చదివే ఆశిష్ ఖాతాలో రూ. 6.2 కోట్లు.. గురు చరణ్ విశ్వాస్ ఖాతాలో రూ.900 కోట్లు జమయ్యాయి. ఈ విషయాన్ని గ్రామ అధికారి ధృవీకరించగా. ఈ సంఘటనపై బ్యాంక్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. డబ్బుల విషయం తెలిసి బ్యాంక్ మేనేజర్ మనోజ్ గుప్తా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరు అబ్బాయిల బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తాన్ని గుర్తించినట్లు తమకు సమాచారం అందిందని దానిని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపారు. చదవండి: లేదండి ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు.. తిరిగి ఇవ్వను రైలు పట్టాలపై మొసలి.. ఆగిపోయిన రైళ్లు -
శివుడి సన్నిధానం... సమస్యలే సమస్తం
ఈనెల 27న మహా శివరాత్రి. పొలతల, నిత్యపూజకోన, లంకమల, కన్యతీర్థం, అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం, గుండాలకోన, అత్తిరాల ఆలయాలతో పాటు చాలా శైవక్షేత్రాల్లో భక్తులు విశేష పూజలు చేస్తారు. అయితే వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమవుతున్నారు. ఈనెల 26, 27, 28 తేదీలలో ఈ పుణ్యక్షేత్రాల్లో భక్తులరద్దీ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో భక్తులకు అవసరమైన వసతులు ఎలా ఉన్నాయి...పాలకులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. అనే కోణంలో న్యూస్‌లైన్ బృందం పుణ్యక్షేత్రాలను పరిశీలించారు. చాలా ఆలయాల్లో ఇప్పటికీ భక్తులకు అవసరమైన కనీస వసతులు కల్పించేందుకు ఆలయపాలానాధికారులు ఉపక్రమించలేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సరైన దారులు లేవు...అక్కడికి వెళితే తాగేందుకు మంచినీళ్ల వసతి లేదు. విడిది గదులు లేవు....ఉన్నచోట శిథిలావస్థలో కొన్ని, నిరుపయోగంగా మరికొన్ని ఉన్నాయి. ఈ 20 రోజుల్లో ప్రత్యేక దృష్టి పెడితే భక్తులకు వసతులు కల్పించవచ్చు. - సాక్షి, కడప పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవక్షేత్రాలలో పొలతల ఒకటి. ఈ క్షేత్రానికి వార్షిక ఆదాయం కోటి రూపాయలు ఉన్నా వసతులు, సౌకర్యాలు మాత్రం నామమాత్రమే. ప్రస్తుతం ఈ క్షేత్రానికి నిర్మిస్తున్న తారురోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు నాసిరకంగా చేపడుతున్నారు. ఏటా భక్తులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. తాగునీరు, బాత్రూమ్ సౌకర్యాలు కరువు : పొలతల క్షేత్రానికి వచ్చే భక్తులకు తాగునీటి కొరత ప్రతి ఏడాది తప్పడం లేదు. ఆలయ ఆవరణంలో తాగునీటికి ఓవర్ హెడ్ ట్యాక్ 10లక్షల వ్యయంతో నిర్మించారు. దానికి పైపులైన్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా ఉంది. ఇక్కడ ఒక్క బాత్రూమ్ కూడా లేదు. పర్యాటక భవనం నిర్మించినా సరైన వసతులు లేవు. నిత్యపూజయ్యా.. వసతులు లేవయ్యా.. సిద్దవటం, న్యూస్‌లైన్: సిద్దవటం మండలంలోని లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీనిత్యపూజయ్యస్వామి కోనకు నిధులు లక్షలరూపాయల్లో ఉన్నప్పటికీ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి రూ.33 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఇటీవల భక్తుల తలనీలాల వేలంపాటలో రూ. 6.60 లక్షలు వచ్చింది. ప్రతి యేటా శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులు అసౌకర్యాలకు గురవుతున్నారు. నీటిగుండం వద్ద నుంచి మూడు వైపులా ఉన్న తాపల వద్ద ఉత్సవాలల్లో వ చ్చి పోయే భక్తులతో రద్దీగా ఉంటున్నాయి. తాపలు వెడల్పు చేసి శాశ్వత బారికేడ్లు ఏర్పాటు చేయకుంటే ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి. తాపలు పూర్తిగా దెబ్బతిని సంవత్సరాలు గడుస్తున్నా వాటికి మరమ్మతులు చేయలేదు. భైరవకోన.. దారి లేక... మైదుకూరు టౌన్, న్యూస్‌లైన్ : మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె పంచాయితీ పరిధిలో తాండ నుండి 20 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో వెళితే భైరవకోన ఆలయం వస్తుంది. ఈ గుడి దగ్గరకు వెళ్లాలంటే దారి అస్తవ్యస్తంగా ఉంది. రాళ్లు.. రప్పలూ.. గుండ్రాళ్లే ఎక్కువగా ఉంటాయి. ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇక ఆలయం వద్ద వసతిగృహాలు లేవు. నీటి సౌకర్యం అరకొరే. కోనేరు శుభ్రం చేసేవారేలేరు. ప్రతి ఆదివారం ఇక్కడికి దాదాపు 100మందికి పైగా భక్తులు వస్తుంటారు. అయినా కూడా ఆలయ అధికారులు, పాలకులు ఎవరూ ఇటు వైపు చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ 20 రోజుల్లో స్పందిస్తే... సాక్షి, కడప: రాబోయే 20రోజుల్లో ఆలయపాలానాధికారులు మరమ్మతు చర్యలకు ఉపక్రమిస్తే శివరాత్రిరోజున భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే పరిస్థితి కల్పించినట్లవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే ఉంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడకతప్పుదు. జిల్లాలోని పలు క్షేత్రాల్లో ముఖ్య సమస్యలు భైరవకోనకు వెళ్లే 20 కిలోమీటర్ల రహ దారి పూర్గిగా గుంతలు, గుండ్రాల్లతో అధ్వాన్నంగా ఉంది. ట్రాక్టర్లు, లారీలతో పాటు కాలినడకన కూడా భక్తులు వెళతారు. ఇక్కడ విడిదిగహాలు నిర్మించినా వీటికి తలుపులు లేవు. నిరుపయోగంగా ఉన్నాయి. కుక్కలు కాపురం చేస్తున్నాయి. నిత్యపూజ కోన ఆలయానికి సంబంధించి 33లక్షల రూపాయల బ్యాంక్డిపాజిట్స్ ఉన్నాయి. ఇటీవల 6.60లక్షల రూపాయల తలనీలాల ఆదాయం వచ్చింది. కానీ ఇక్కడ రోడ్డువసతి లేదు. కుంటల్లోని నీరు అపరిశుభ్రంగా ఉంది. దీన్ని క్లోరినేషన్ చేయాలి. స్నానం చేసిన తర్వాత మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయాలి. మరుగుదొడ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అల్లాడుపల్లె వీరభద్రస్వామి సన్నిధిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. కోనేటి గోడ కూలిపోయింది. దీన్ని పునర్నిర్మించాలి. పూర్తయిన అతిథిభవనం ప్రారంభానికి నోచుకోలేదు. దీన్ని ప్రారంభించాలి. పొలతల ఆలయానికి లక్షలాధి భక్తులు వస్తారు. కానీ సరైన రోడ్డు మార్గం లేదు. పారిశుధ్యం, మంచినీటి సమస తీవ్రంగా ఉంది. రెండుకోనేర్లు ఉన్నా వాటిని శుభ్రపరచలేదు. ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించినా కనెక్షన్ ఇవ్వలేదు. వాహనాల పార్కింగ్‌కు ఏటా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోటి రూపాయల ఆదాయం ఉన్నా వసతులు మాత్రం పూర్తిడొల్లగా ఉన్నాయి. సౌకర్యాలు కల్పించాలి.. వేలాదిగా భక్తులు అత్తిరాలకు వస్తుంటారు. కనీస వసతులు కూడా లేవు. మహిళలు స్నానం చేయాలన్నా ఇబ్బందిగా ఉంది. బహుదానదిలో నీరు కలుషితం అవుతున్నాయి. ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది. - నాగినేని వెంకటరామయ్య, భక్తుడు, అత్తిరాల, రాజంపేట దురదలు వస్తున్నాయి... బహుదానది నీరు మురికి కావడంతో స్నానం చేస్తే దురదలు వస్తున్నాయి. శివరాత్రికి వచ్చే భక్తులు రాత్రి నిద్రించాలంటే కష్టంగా ఉంది. పైగా కోతుల బెడద ఎక్కువైంది. తాత్కాళిక రేకుల షెడ్లు నిర్మించాలి. - కోవూరు శంకరయ్య, అత్తిరాల, రాజంపేట శివరాత్రి రోజు భక్తులు బాగా వస్తారు గుండాలయ్య కోనకు శివరాత్రి, కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేసి జాగారాలు చేస్తుంటారు. సరైన సౌకర్యాలు లేక భక్తుల సంఖ్య తగ్గుతుంది. ఎంతో మహిమగల మళ్లేశ్వరున్ని ఆరాధించడం వల్ల కోరికలు నెరవేరుతున్నాయి. కష్టాలు పడుతూ ఆలయానికి భక్తులు వస్తున్నారు. సౌకర్యం కల్పిస్తె బాగా అభివృద్ధిచెందుతుంది. - మస్తాన్ బాబు ( గొర్రెల కాపరి) యర్రబల్లి ప్రారంభం ఎప్పుడో... గత మూడు సంవత్సరాల నుంచి అత్తిరాలలో నత్తనడకన నడుస్తున్న అతిథి గృహం శివరాత్రికి పూర్తవుతుందా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులు రాత్రులు పవళించేందుకు ఈ భవనం ఏ పరిధిలో సరిపోతుందో ఆ సర్వేశ్వరునికే తెలియాలి. - న్యూస్‌లైన్, రాజంపేట రూరల్ పర్యాటక అభివృద్ధి పనులలో భాగంగా నిర్మించిన భక్తాదుల అతిథి భవనం పూర్తయినా కూడా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏటా వీరభద్రుడి సన్నిధిలో భక్తులు అనేక అవస్థలు పడుతున్నా అధికారులుగానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదు. శివరాత్రికయినా ప్రారంభిస్తే వసతి కల్పించినవారవుతారు. - న్యూస్‌లైన్,చాపాడు రాళ్లు రప్పలు... నడవాలంటే తిప్పలు ఈ ఫోటో చూశారా? ఇదేదో కొండకాదు. నిత్యపూజకోనకు వెళ్లే దారి. శివరాత్రిరోజున ఇక్కడకు కూడా వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అయితే భక్తులు వెళ్లేందుకు సరైన మార్గం లేదు. మెయిన్‌రోడ్డు నుంచి 14 కిలోమీటర్లు ఉంది. ఇందులో 3 కిలోమీటర్లు గుట్టలు, రాళ్లలో నడవల్సాందే! మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఈ గుట్టల్లో నడవాలంటే కుదరనిపని. కనీసం నడిచేందుకు వీలుగా దారిని ఏర్పాటు చేయాల్సిఉంది. అలాగే ఆలయంలోకి వెళ్లే మెట్లు కిలోమీటరు మేర ఉన్నాయి. మెట్లకు ఇనుపకంచె పాడైపోయింది. భక్తుల రద్దీలో తోపులాట జరిగితే మెట్లపై నుంచి కొండలోకి పడిపోకతప్పుదు. పండుగ 20రోజులు ఉంది. ఈలోగా దారితో పాటు మెట్లకు కంచెను రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే భక్తులు ఇబ్బందిపడక తప్పదు. పంచలింగాల.. వెళ్లేదెలా.. పులివెందుల టౌన్, న్యూస్‌లైన్ : పులివెందుల మండల పరిధిలో ఉన్న పంచలింగాల కోన, గుండాలయ్యకోనలో ఉన్న శైవక్షేత్రాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఏళ్లు గడుస్తున్నా పాలకులు అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోలేదు. కాలినడకన భక్తులు వె ళుతూ ఇబ్బందులు పడుతున్నారు. పురాతన ఆలయాలైన పంచలింగాల, గుండాలయ్యకోనలకు భక్తులు కార్తీకమాసంలో, శివరాత్రి పండుగరోజుల్లో పెద్దసంఖ్యలో వెళ్లి శివున్ని దర్శించుకుంటారు. పంచలించాల కోన పులివెందుల నుండి 10కిలోమీటరు దూరం ఉంటుంది. గుండాలయ్యకోనలకు 3కిలోమీటర్లు దూరం ఉంది. పొలాల మీదుగా కాలి నడకన భక్తులు వెళ్లాల్సిందే. నల్లపురెడ్డిపల్లె గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు బలరామిరెడ్డి ఆధ్వర్యంలో మట్టిరోడ్డు ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతినింది. ప్రస్తుతం దారి వెంట ముళ్లపోదలు, రోడ్డు గుంతలమయం కావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అత్తిరాల... సమస్యల గోల.. రాజంపేట రూరల్, న్యూస్‌లైన్: రాజంపేట మండలంలోని అత్తిరాల(హత్యరాల)లో సమస్యలు తాండవిస్తున్నాయి. భక్తులకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ మూడు రోజుల పాటు కొనసాగే ఈ తిరుణాలలో భక్తులు నిద్ర చేయడమంటే సాహసమే. అగ్రహారంలో ఉన్న చిన్న సత్రాలు తప్ప వేరే గత్యంతరం లేదు. వేలసంఖ్యలోపాల్గొనే భక్తులు పడిగట్లు, ఆలయం, ఆరుబయట పవళించాల్సిందే. చంటిపాపలు, వృద్ధులకు ప్రత్యక్ష నరకం ఇక్కడే కనిపిస్తుంది. ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కనీసం రేకుల షెడ్లు నిర్మించినా బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. - ఇక్కడ ప్రవహించే బహుదానదిలో స్నానం ఆచరిస్తే... సకలపాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఈ నదిలో మునిగితే పాపాలు పోవడం అటు ఉంచితే, రోగాలు రావడం ఖాయమని ప్రజలు అంటున్నారు. బహుదానదిలో నీరు కలుషితం కావడమే దీనికి కారణం. ఇక స్వామివారి రథం శిథిలావస్థకు చేరింది. వీరభద్రా... కనుమా... చాపాడు, న్యూస్‌లైన్: అల్లాడుపల్లె శ్రీవీరభద్రస్వామి సన్నిధిని చాపాడు మీదుగా చేరుకునే సీతారామాపురం వద్ద గల కుందూనదిపై పాత వంతెన(100 ఏళ్లుపై బడినది) తూర్పు వైపు గోడ కుంగిపోయింది. రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ ఈ వంతెనను పరిశీలించినా పూర్తిస్థాయిలో ప్రయోజనం లేదు. కొన్ని నెలల క్రి తం దీని మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు చేయటంలో నిర్లక్ష్యం కన్పిస్తోంది. లంకమల్లేశ్వరా... చూస్తున్నావా.. బద్వేలు, న్యూస్లైన్ః బద్వేలు నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని లంకమల్ల అడవుల్లో లంకమల్లేశ్వర క్షేత్రం ఉంది. సరైన దారి సౌకర్యం లేదు. దాదాపు పది కిలోమీటర్లు అడవి మార్గాన ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ దారి కూడా పెద్ద పెద్ద బండరాళ్లతో, గుంతలతో ఉంది. - లంకమల్లేశ్వర క్షేత్రంలో స్నానపు గుండం వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అంతే. గతేడాది ఒక భక్తుడు ఇందులో పడి మృతి చెందాడు. అంతకు మునుపు కూడా జరిగిన ప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవించింది. అధికారులు పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలి.