సాక్షి,ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఇప్పటికే బెట్టింగ్ మార్క్ 100 కోట్లు దాటిందా? పోలింగ్ సమయానికి బెట్టింగులు మరింతగా పెరుగుతాయా? ఏపీకి చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లా బెట్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థులు మాత్రం తమ గెలుపోటములపై బెట్టింగులు పెట్టవద్దని సూచిస్తున్నారంటూ టాక్ మొదలైంది. ఇంతకీ బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం మొదలైన ఆ నాలుగు స్థానాల కథేంటో చూద్దాం.
పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఖమ్మంలో ఏంజరుగుతోందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న పది సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. ఒకవైపున పోరు రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు కూడా అదే రేంజ్‌లో సాగుతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా రెండు జనరల్ సీట్లు..రెండు ఎస్‌సీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయం మీద భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి అధికార గులాబీ పార్టీ తరపున మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్...కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్యా పోటీ అత్యంత తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఈ ఇద్దరి గెలుపు ఓటములపై భారీ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పది వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపులా బెట్టింగ్ నడుస్తున్నాయి. అయితే మెజారిటీ 30వేలు దాటుతుందని ఓ పార్టీ అభ్యర్థిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టారు. ఇక పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున కందాల ఉపేందర్‌రెడ్డి...కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. ముగ్గురి మధ్య పోటీ టఫ్‌గా ఉంది. అందుకే ఒక్క ఓటుతో గెలుస్తారనేదానిపై ఎక్కువగా బెట్టింగులు నడుస్తున్నాయి.
ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోనే బెట్టింగులు వంద కోట్లు దాటాయని టాక్ నడుస్తోంది. ఖమ్మం, పాలేరు స్థానాల తర్వాత..సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. అనూహ్యంగా సత్తుపల్లిలో బెట్టింగ్‌లు భారీగా పెరిగాయి. ఇక్కడ కూడా ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ నడుస్తూ ఉండటమే బెట్టింగులకు కారణం. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులకు సంబంధించి 5 వేల లోపు మెజార్టీతో బయట పడుతారని బెట్టింగ్‌లు కాస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలో ఉండగా..కాంగ్రెస్ నుంచి మట్టా రాగమయి పోటీ చేస్తున్నారు. మధిరలో సైతం సీఎల్పీ నేత భట్టి విక్కమార్క గెలుస్తారా లేదా అనేదానిపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. మధిరలో బీఆర్ఎస్ నుంచి లింగాల కమల్ రాజ్ బరిలో ఉండగా...భట్టి విక్కమార్క కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 10వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపుల నుంచి బెట్టింగ్ లు నడుస్తున్నాయి.
రాష్ట్రంలో రోజు రోజుకి పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. బెట్టింగ్‌లు సైతం అదే స్థాయిలో స్పీడ్ అందుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బెట్టింగ్ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారన్న దానిపై నిరంతరం
Comments
Please login to add a commentAdd a comment