సాక్షి, వికారాబాద్: జిల్లాలోని ఓ వ్యక్తి అకౌంట్‌లో ఏకంగా రూ. 18కోట్లు జమయ్యాయి. బ్యాంక్ ఖాతా చెక్ చేసి షాకైన సదరు బ్యాంక్ ఖతాదారుడు బ్యాంక్ అధికారులను సంప్రదించాడు. వివరాల ప్రకారం.. వికారాబాద్‌కు చెందిన వ్యాపారి వెంకట్‌రెడ్డికి జాక్‌పాట్ తగిలింది. అతడి HDFC బ్యాంక్ ఖాతాలో ఏకంగా రూ. 18.52 కోట్లు జమయ్యాయి. డబ్బులు పడిన విషయం తెలుసుకున్న వెంకట్‌రెడ్డి.. బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా.. నిన్న(ఆదివారం) కూడా తమిళనాడులో HDFC బ్యాంకుకు చెందని పలువురి ఖాతాల్లో కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీంతో సంబంధిత బ్యాంకు అధికారులు అలర్ట్ అయ్యారు.
ఇది కూడా చదవండి: కేజీఎఫ్ కోటలో కలకలం
Comments
Please login to add a commentAdd a comment