'రూపాయి ఉంగరాల' బామ్మ | Elderly Woman designs her rings with One Rupee coins | Sakshi
Sakshi News home page

'రూపాయి ఉంగరాల' బామ్మ

Published Fri, May 29 2015 4:44 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

'రూపాయి ఉంగరాల' బామ్మ - Sakshi

'రూపాయి ఉంగరాల' బామ్మ

ఆదిలాబాద్ : ఎవరైనా ముత్యాలు, పగడాలు, వజ్రాలలాంటి రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాలను ధరించడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వాటిని ఆసక్తిగా ఆర్డరిచ్చి చేయించుకుంటారు. కానీ ఓ వృద్ధురాలు రూపాయి నాణాలు వేళ్లపై కనబడేలా ఉంగరాలు చేయించుకుని చేతివేళ్లకు ధరించి అందరినీ ఆకర్షిస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా కండెల గ్రామానికి చెందిన రుక్మిణి బాయికి మొదటి నుంచి అలంకరణ మీద అమితమైన ఆసక్తి. ఆమె అలంకరణ కూడా అందరికంటే భిన్నంగా ఉండేది. ఈ క్రమంలోనే రూపాయి నాణాలతో ఉంగరాలను తయారుచేయించుకుంది. ఆమె ధరించిన ఆ రూపాయి నాణాలు తన స్వార్జితమని, అవి తన కళ్ల ముందు ఎప్పుడూ కనబడుతూనే ఉండాలని ఇలా చేయించుకున్నానని అందరికీ చూపెడుతూ తెగ మురిసిపోతుంది ఈ రుక్మిణి బామ్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement