
వీడియో దృశ్యం
సాక్షి, మంచిర్యాల : జిల్లా కేంద్రంలో లారీ, బైక్‌ను ఢీకొన్న ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బెల్లంపల్లి చౌరస్తాలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ బైకు ఎడమవైపు నుంచి కుడివైపు రహదారికి మలుపు తీసుకుంది. ఈ నేపథ్యంలో వెనకాలే వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దానిపైకి ఎక్కి ముందుకు వెళ్లింది. ( ‘బ్యాండ్ బజా బరాత్’.. ఒక్కరికి రూ.12 లక్షలు )
దీంతో బైక్‌పై ఉన్న మహిళ కాళ్లు లారీ టైర్ల కింద పడి నలిగి, తీవ్రంగా గాయపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు వాహనదారులు ఒకేసారిగా భారీ వాహనాల ముందుకు రావడంతో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment