
సీసీటీవీ దృశ్యాలు
సాక్షి, మంచిర్యాల : జిల్లా కేంద్రంలో ముసుగు దొంగ హల్‌చల్ చేస్తున్నాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ముసుగు ధరించి, తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్నాడు. వారం రోజుల పరిధిలో నస్పూర్‌లోని జగదాంబ కాలనీలో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అక్కడి సీసీ కెమెరాల ద్వారా దొంగ కదలికలు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అర్థరాత్రి వేళ ముసుగు ధరించి చేతిలో కత్తితో కాలనీలో అటు ఇటు పరిగెత్తుతూ రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ( గొంతునులిమి చంపి.. శవంతో శృంగారం )
దీంతో రాత్రిళ్లు బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఎవరి ఇంట్లో దొంగతనానికి పాల్పడతాడోనని జంకుతున్నారు. ఈ నేపథ్యంలో దొంగను పట్టుకునేందుకు సీసీసీ నస్పూర్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ( అంకిత్ శర్మ మృతదేహంపై 51 గాయాలు )
Comments
Please login to add a commentAdd a comment