
బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారుని ర్యాష్‌గా వచ్చి ఢీ కొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ కారు యజమాని వృద్ధుడుని ఆపేందుకు యత్నించాడంతో ఈడ్చుకెళ్లిపోయాడు. దీంతో పలువురు అతన్ని వెంబడించి అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.
వివరాల్లోకెళ్తే..బెంగళూరులోని ముత్తప్ప అనే వ్యక్తి కారుని సాహిల్ అనే వ్యక్తి బైక్‌తో ఢీ కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి కారులోంచి దిగి మాట్లాడాదాం అనుకుంటుండగా.. సాహిల్ తన బైక్‌తో పారిపోయేందుకు యత్నించాడు. ఐతే వృద్ధుడు అతన్ని ఆపాలనే ఉద్దేశంతో అతని బైక్ బ్యాక్ సైడ్ గట్టిగా పట్టుకున్నాడు. కానీ సాహిల్ వృద్ధుడన్న కనికరం లేకుండా బైక్‌ని ఆపకుండా ఈడ్చు కెళ్లిపోయాడు.
పట్టపగలే అందరూ చూస్తుండగా 71 ఏళ్ల వృద్ధుడుని దాదాపు ఒక కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లాడు. ఇంతలో అటుగా వస్తున్న ఆటో రిక్షా వాలా, ఒక ద్విచక్ర వాహనదారుడు ఆ వ్యక్తిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఆ వృద్ధుడి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
click here: viral Video
(చదవండి: జల్లికట్టు పోటీలో అపశ్రుతి..నలుగురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment