జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అయితే ఆరోజు ప్రత్యేక అతిథులకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అనుమతివుంది. అయితే అయోధ్యకు వెళ్లి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తిలకించలేనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ (డీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దూరదర్శన్ అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం డీడీ నేషనల్, డీడీ న్యూస్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
జనవరి 23న కూడా దూరదర్శన్‌లో రామ్‌లల్లా ప్రత్యేక హారతితో పాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాన ఆలయ సముదాయం మాత్రమే కాకుండా, సరయూ ఘాట్ సమీపంలోని రామ్‌కి పైడి, కుబేర్ తిల దగ్గరున్న జఠాయువు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి కూడా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది.
మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసేందుకు ప్రత్యేక యూట్యూబ్ లింక్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు.
దూరదర్శన్‌తో పాటు పలు ప్రైవేట్ ఛానెళ్లు కూడా దూరదర్శన్ నుంచి ఫీడ్‌ను అందుకుంటాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. దూరదర్శన్ ఈ కార్యక్రమాలను 4కె టెక్నాలజీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనుందని, ఫలితంగా ప్రేక్షకులు హైక్వాలిటీ పిక్చర్‌ను చూడగలుగుతారని అపూర్వ చంద్ర తెలిపారు.
ఇది కూడా చదవండి: శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది?
Comments
Please login to add a commentAdd a comment