Telecast
-
‘సాక్షి’ టీవీ ప్రసారాల నిలిపివేత రాజ్యాంగ ఉల్లంఘనే: ఎన్బీడీఏ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడంపై ‘బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్’ (ఎన్బీడీఏ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలనూ ఏపీలోని కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిలిపివేయడానికి సరైన కారణాలు చూపకపోవడం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమని ఎన్బీడీఏ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్బీడీఏ సోమవారం(జూన్24) మీడియా ప్రకటన విడుదల చేసింది.మీడియాతో పాటు ప్రజల ప్రయోజనాలకు భంగం..ఏపీలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన టీడీపీపై విమర్శనాత్మక కథనాలు ప్రసారం చేయడం వల్లనే ఆయా టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపివేసినట్లు చెబుతున్నారని, కొందరు కేబుల్ టీవీ ఆపరేటర్లు తీసుకున్న ఈ చర్యలు బ్రాడ్కాస్టర్లు, మీడియా, ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని ప్రకటించింది. కొన్ని టీవీ ఛానళ్ల ప్రసారాలు ఆపడం ప్రమాదకరమైన సంకేతాలు పంపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..ఛానెళ్లలో ఎలాంటివి ప్రసారం చేయాలన్నది బ్రాడ్కాస్టర్ల ఇష్టమన్నది రాజకీయ పార్టీలు గుర్తించాలని, మీడియా స్వేచ్ఛలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా పేర్కొంది. ఇతరుల జోక్యంతో మీడియా తన స్వతంత్రతను కోల్పోయే పరిస్థితి కల్పిస్తుందని తెలిపింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ), ఆర్టికల్ 19(1)(జీ)లను ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. మీడియా స్వేచ్ఛపై ప్రభావం..ఛానళ్లపై నిషేధం సరైన పద్ధతి కాదని,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేదని ఎన్బీడీఏ పునరుద్ఘాటించింది. ఏకపక్ష నిర్ణయాలు బ్రాడ్కాస్టర్ల వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తాయని, వ్యూయర్షిప్పై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది. ఇది చివరికి ఛానళ్ల రేటింగ్ తద్వారా ఆదాయంపైనా ప్రభావం చూపుతుందని వివరించింది. ప్రభుత్వానిదే బాధ్యత..దీర్ఘకాలంలో బ్రాడ్కాస్టర్లు, ప్రకటనకర్తల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు చర్యలు కారణమవుతాయని తెలిపింది. ఏపీలో మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా వ్యవహరించేలా కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎన్బీడీఏ అభ్యర్థించింది. ఇతరుల జోక్యం ఏమాత్రం లేకుండా మీడియా తమ కార్యకలాపాలు నిర్వహించుకునేలా చూడాలని కోరింది.సమాచారం పొందడం ప్రజల హక్కు..ప్రజాస్వామ్య వ్యవస్థలో వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం పొందే హక్కు ప్రజల మౌలిక హక్కు అని, మీడియా నోరు నొక్కేందుకు చేసే ఏ ప్రయత్నాన్ని అయినా వెంటనే అడ్డుకోవాలని సూచించింది. సాక్షి టీవీతోపాటు మరో మూడు ఛానళ్ల ప్రసారాలను నిలిపి వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, కొందరు కేబుల్ ఆపరేటర్లు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే సమీక్షించి ఘర్షణ పూర్వక పరిస్థితిని నివారించాలని ఎన్బీడీఏ కోరింది. -
అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి!
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అయితే ఆరోజు ప్రత్యేక అతిథులకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అనుమతివుంది. అయితే అయోధ్యకు వెళ్లి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తిలకించలేనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ (డీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దూరదర్శన్ అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం డీడీ నేషనల్, డీడీ న్యూస్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. జనవరి 23న కూడా దూరదర్శన్‌లో రామ్‌లల్లా ప్రత్యేక హారతితో పాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాన ఆలయ సముదాయం మాత్రమే కాకుండా, సరయూ ఘాట్ సమీపంలోని రామ్‌కి పైడి, కుబేర్ తిల దగ్గరున్న జఠాయువు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి కూడా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసేందుకు ప్రత్యేక యూట్యూబ్ లింక్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. దూరదర్శన్‌తో పాటు పలు ప్రైవేట్ ఛానెళ్లు కూడా దూరదర్శన్ నుంచి ఫీడ్‌ను అందుకుంటాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. దూరదర్శన్ ఈ కార్యక్రమాలను 4కె టెక్నాలజీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనుందని, ఫలితంగా ప్రేక్షకులు హైక్వాలిటీ పిక్చర్‌ను చూడగలుగుతారని అపూర్వ చంద్ర తెలిపారు. ఇది కూడా చదవండి: శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది? -
Ram Mandir Pran Pratishtha: టైమ్స్ స్క్వేర్‌లో ‘ప్రాణప్రతిష్ఠ’ ప్రత్యక్ష ప్రసారం
జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అయోధ్య పవిత్రోత్సవం వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆరోజు రామభక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం. బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి 84 సెకన్ల శుభ సమయం నిర్ణయించారు. 2024, జనవరి 22న ఉదయం 12:29 నుండి 12:30 మధ్య కాలంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. కాగా నూతన రామాలయం మూడు అంతస్తులలో నిర్మితమయ్యింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలుని రూపంలో ఉంటుంది. కాగా ఆలయంలో ఇంతవరకూ ఉన్న బాలరాముని విగ్రహాన్ని నూతన విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య ‘ప్రాణప్రతిష్ఠ’కు ముఖ్య అతిథులెవరు? -
IPL 2022: ఆ దేశంలో ఐపీఎల్ ప్రసారాలు బంద్
IPL 2022 Broadcast Goes Off In Sri Lanka: తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ద్వీప దేశం శ్రీలంకలో ఐపీఎల్ ప్రసారాలు కూడా బంద్ అయ్యాయి. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బుల్లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్లు క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపి వేశాయి. దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నెలకొన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ఐపీఎల్ మ్యాచ్‌లు చూసి ఎంజాయ్ చేసే మూడ్‌లో లేరని, అందుకే ఐపీఎల్ టెలికాస్ట్‌పై అంతగా ఫోకస్ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది. మరోవైపు పేపర్ కాస్ట్ పెరగడంతో పాటు సిబ్బంది జీతాలివ్వలేక పత్రికలు ప్రింటింగ్ చేయడం మానేశాయి. కనీసం డిజిటల్ పేపర్లలో కూడా ఐపీఎల్ వార్తల ప్రస్తావన లేదు. ఐపీఎల్లో ఆడుతున్న లంక క్రికెటర్ల వనిందు హసరంగ (ఆర్సీబీ), భానుక రాజపక్స (పంజాబ్), దుష్మంత చమీర (లక్నో సూపర్ జెయింట్స్), చమిక కరుణరత్నే (కోల్‌కతా నైట్ రైడర్స్)లను పట్టించుకునే నాధుడే లేడు. మరోవైపు దేశంలో నెలకొన్న దుర్భర పరిస్థితులపై ఐపీఎల్లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న లంక మాజీలు గళం విప్పుతున్నారు. చదవండి: మీతో కాకపోతే చెప్పండి.. నేనొస్తా..! సన్‌రైజర్స్, లక్నో జట్లకు బెంగాల్ మంత్రి ఆఫర్ -
తెలుగు 'బిగ్‌బాస్ ఓటీటీ' వచ్చేది అప్పుడేనా ?
Telugu Bigg Boss OTT Show Will Telecast In February: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. సీజన్.. సీజన్‌కి ఈ షోకి ఆదరణ పెరిగిపోతుంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదికగా అలరించనుంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ ఐదో సీజన్ హోస్ట్ కింగ్ నాగార్జున స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కార్యక్రమానికి సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని రోజులు క్వారంటైన్లో ఉంటారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 27 నుంచి బిగ్‌బాస్ ఓటీటీ షో ప్రసారమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అంతేకాకుండా ఫిబ్రవరి రెండోవారంలో ఈ షో లోగో, ప్రోమో విడుదల కానున్నాయట. బిగ్‌బాస్ గత సీజన్లలో పాల్గొన్న ముమైత్ ఖాన్, ఆదర్శ్, తనీశ్, ధన్రాజ్తోపాటు యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, పార్టిస్పేట్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
Pro Kabaddi League 2021: కబడ్డీ కూతకు వేళాయె...
Pro Kabaddi 2021 Schedule And Venue: కూత పెట్టేందుకు ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ముస్తాబైంది. నేటి నుంచి ఎనిమిదో సీజన్ జరగనుంది. ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్ మ్యాచ్‌లన్నీ బెంగళూరు వేదికపైనే జరుగనున్నాయి. కోవిడ్ మహమ్మారి వల్ల గతేడాది టోర్నీ రద్దు కావడంతో ఈ సీజన్‌ను పకడ్బందీగా బయో బబుల్‌లో నిర్వహిస్తున్నారు. మొత్తం 12 జట్లు ఇది వరకే బయో బబుల్‌లో ఉన్నాయి. మాజీ చాంపియన్లు యు ముంబా, బెంగళూరు బుల్స్ల మధ్య బుధవారం జరిగే తొలి మ్యాచ్‌తో పీకేఎల్–8 మొదలవుతుంది. ఈ మ్యాచ్ ముగియగానే తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతుంది. అనంతరం మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధ తలపడుతుంది. ఈ సీజన్లో తొలి నాలుగు రోజులు మూడు మ్యాచ్‌ల చొప్పున నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం కూడా మూడేసి మ్యాచ్‌లుంటాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–6లో ఉన్న జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఫైనల్‌తో ఎనిమిదో సీజన్ ముగుస్తుంది. తొలి రెండు మ్యాచ్‌లు వరుసగా రాత్రి గం. 7:30 నుంచి... గం. 8:30 నుంచి మొదలవుతాయి. మూడో మ్యాచ్‌లను రాత్రి గం. 9:30 నుంచి నిర్వహిస్తారు. మ్యాచ్‌లన్నీ స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రసారమవుతాయి. పీకేఎల్‌లో మ్యాచ్ గెలిచిన జట్టుకు ఐదు పాయింట్లు లభిస్తాయి. ‘టై’ అయితే రెండు జట్ల ఖాతాలో మూడు పాయింట్లు చొప్పున చేరుతాయి. ఏడు లేదా అంతకంటే తక్కువ పాయింట్ల తేడాతో ఓడిన జట్టుకు ఒక పాయింట్ ఇస్తారు. ఏడు పాయింట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిన జట్టుకు పాయింట్లేమీ రావు. పీకేఎల్ బరిలో ఉన్న జట్లు బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్, పట్నా పైరేట్స్, యు ముంబా, తెలుగు టైటాన్స్, బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హరియాణా స్టీలర్స్, తమిళ్ తలైవాస్, యూపీ యోధ. -
మహేష్ మేనియా.. అక్కడ ‘మహర్షి’ దూకుడు తగ్గట్లేదుగా!
సందేశాత్మక చిత్రాలను ఎంపిక చేయడంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటాడు. ఈ తరహాలో మహేశ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం 'మహర్షి'. ఈ సినిమా కలెక్షనన్లు కొల్లగొట్టి మహేశ్ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఊపు ఊపిన ‘మహర్షి’ టీవీలో మాత్రం మొదట్లో టెలికాస్ట్ చేసినప్పుడు ఊహించిన స్థాయి టీఆర్పీ రేటింగ్ రాలేదు, కానీ మెల్లమెల్లగా ఊపందుకుంది. అలా ఇప్పుడు పదోసారి టెలీకాస్ట్ కాగా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తొమ్మిది సార్లు ఈ చిత్రం మంచి టీఆర్పీ సాధించగా, పదోసారి 7.80 రేటింగ్స్‌తో సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా మహేశ్ సినిమాలకు ఒక సినిమా పదోసారి కూడా టీవీలో ప్రసారం అయ్యి ఈ రేంజ్లో టీఆర్పీను తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇన్ని సార్లు టెలికాస్ట్ అయిన తర్వాత కూడా మళ్లీ అంత మంది చూడటమే కాకుండా మునపటి కంటే ఎక్కువ మందే ఈ సారి వీక్షించడం ఇదొక అరుదైన ఘటననే చెప్పాలి. అయితే మహర్షి సినిమాకు ఆ స్టామినా ఉందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది వరకు మన రాకుమారుడు నటించిన ‘అతడు’ చిత్రం కూడా ఇదే తరహాలో మొదట మెల్లగా ప్రారంభమై, తర్వాత టీవీ ప్రేక్షకులను కట్టిపడేసిన సంగతి తెలిసిందే. 1st Time: 9.3 2nd time : 7.3 3rd Time: 6.13 4th time: 9.02 5th Time: 10.28 6th Time: 8.82 7th Time: 7.14 8th Time: 5.14 9th Time: 4.92 10th Time: 7.80** చదవండి: అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి -
స్టార్ మాలో రామాయణం
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, బంధాలలోని గొప్పతనాన్ని, విలువలతో కూడిన జీవన విధానాన్ని చెప్పే ఇతిహాసం రామాయణం. తండ్రిమాటను జవదాటని కుమారుడు...ఆ కుమారునిపై అవాజ్యమైన ప్రేమను కురిపించే తండ్రి, పతి బాటలలోనే సతి అనే ఇల్లాలు... ఇలా ఎన్నో బంధాలు, మరెన్నో జీవనసత్యాలను తెలియజేసే మహోన్నత పౌరాణిక గాథ రామాయణం. భారతీయ జీవనగమనంలో అంతర్భాగమైన ఈ పుణ్యగాథ నేటి తరానికి మార్గనిర్ధేశకం. టెలివిజన్ చరిత్రలో ఓ సంచలనంగా 1980లలో రామానంద్ సాగర్ తీసిన రామయణ్ గాథను ఇప్పుడు తెలుగులో స్టార్ మా ఛానెల్ ప్రసారం చేయబోతుంది. అంతర్జాతీయంగా ఓ పౌరాణిక గాధకు అత్యధిక వీక్షణ రేటింగ్ తెచ్చుకోవడం ద్వారా గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్న రామాయణ్‌ను లాక్డౌన్ కాలంలో పునః ప్రసారం చేశారు. అయితే హిందీ భాషలో ఉండటం, భావం అర్థం అయినా భాష అర్థంగాక పోవడం వంటి సమస్యలను కొంతమంది అభిమానులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలకు తగిన పరిష్కారం అందిస్తూనే రామానంద్ సాగర్ తీసిన 'రామాయణ్' సీరియల్‌ను స్టార్ మా ఛానెల్ తెలుగులో ప్రసారం చేయబోతుంది. ఈ సీరియల్ కోసం తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు అనకాపల్లికి చెందిన వృద్ధురాలు సావిత్రమ్మ. తన యుక్త వయసులో తాను ఈ సీరియల్‌ను దూరదర్శన్‌లో ఆదివారం పూట వీక్షించేవారమంటూ, అప్పట్లో ఇంటిల్లిపాది ఈ సీరియల్‌నూ క్రమం తప్పకుండా చూసేవారమని, మరలా ఇన్నాళ్లకు లాక్డౌన్లో మరలా ప్రసారం చేయడం చూశామన్నారు. భాష అర్థంగాకపోవడం కొంత సమస్యగా ఉండేది కానీ ఇప్పుడు స్టార్ మా వారు తెలుగులో ప్రసారం చేస్తున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఆమెనే మాట్లాడుతూ భారతీయ జీవనశైలికి ప్రతిరూపం రామాయణం. కనుమరుగవుతున్న కుటుంబ బంధాల వేళ పరమ పవిత్రమైన రామాయణ మహాకావ్యం మనందరికీ జీవనముక్తి మార్గం చూపడమే కాదు బంధాలను ఎలా నిలుపుకోవాలో కూడా చూపుతుందన్నారు. ఈ ధారావాహిక సోమవారం నుంచి శుక్రవారం వరకూ ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతుంది. -
డీడీ నంబర్ వన్
కేబుల్ రాకముందు దూరదర్శన్ (డీడీ) ఛానలే అందరికీ వినోదం, విజ్ఞానం అందించింది. కేబుల్ టీవీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ కావడంతో దూరదర్శన్ కి ఇంతకు ముందు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే చెప్పాలి. అయితే ఈ ‘లాక్ డౌన్’ సమయంలో ‘డీడీ నేషనల్’ తన పూర్వ వైభవాన్ని చూస్తోంది. టీ. ఆర్. పీ రేటింగ్స్ లో అగ్రగామిగా నిలుస్తోంది. కారణం దూరదర్శన్ లో ఒకప్పుడు బాగా పాపులర్ అయిన సీరియల్స్, షోలను పునః ప్రసారం చేయడమే. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన డేటా ఆధారంగా దేశంలో దూరదర్శన్ నంబర్ వన్ స్థానంలో ఉంది. లాక్ డౌన్ కి ముందు వారాల్లో టాప్ 10లో లేకపోయినా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. మార్చి చివరి వారం (మార్చి 21–27) రేటింగ్ సంఖ్యతో పోలిస్తే ఆ మరుసటి వారం (మార్చి 28– ఏప్రిల్ 3) దూరదర్శన్ వీక్షకుల సంఖ్య సుమారు 580 రెట్లు పెరిగినట్టు తెలిసింది. ‘‘రామాయణం, మహాభారతం, శక్తిమాన్, సర్కస్, బ్యోమకేష్ బక్షి వంటి పాపులర్ సీరియళ్లు, ప్రోగ్రాములు తిరిగి ప్రసారం కావడం దేశం మొత్తాన్ని శ్రద్ధగా టీవీలకు అతుక్కుపోయేలా చేసింది డీడీ. ముఖ్యంగా రామాయణం , మహాభారతం ప్రసారం అవుతున్న సమయాల్లో వీక్షకుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగింది. అలాగే క్వారంటైన్ సమయాల్లో టీవీ వీక్షించే సమయం కూడా 43 శాతం వరకు పెరిగింది’’ అని బార్క్ సంస్థ తెలిపింది. -
థ్యాంక్స్ మోదీ... థ్యాంక్స్ డీడీ
ప్రపంచమంతా కరోనా కల్లోలం కారణంగా ఇంటి గడపదాటని స్థితి. ప్రధాని పిలుపుతో లాక్డౌన్ వల్ల ప్రజలందరితో పాటు సెలబ్రిటీలు సైతం సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. దూరదర్శన్ ఛానెల్ 32 ఏళ్లకిందట ప్రసారం చేసిన ‘రామాయణ్’ సీరియల్‌ని మళ్లీ ప్రసారం చేస్తోంది. దీంతో పెద్దవాళ్లు, సెలబ్రిటీలు రామాయణాన్ని టీవీలో తిలకిస్తూ తమ బాల్యస్మృతులను నెమరేసుకుంటున్నారు. ‘భారతీయ ఇతిహాసాలు పిల్లలు తెలుసుకోవడానికి ఇది ఓ గొప్ప మార్గం’ అంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియా ద్వారా అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సీరియల్ చూస్తూ ఫొటోలు తీసుకొని వాటిని ఆనందంగా షేర్ చేసుకుంటున్నారు. రోజూ 2 ఎపిసోడ్లు రామాయణ్ ధారావాహిక ఈ శనివారం (28–03–2020) ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు మొదటి ఎపిసోడ్‌తో దూరదర్శన్ లో మళ్లీ ప్రారంభమైంది. తిరిగి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు మరో ఎపిసోడ్‌ను ప్రసారం చేసింది. ‘ప్రజల డిమాండ్ మేరకు రామాయణం సీరియల్‌ను పునఃప్రసారం’ చేస్తున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారం ప్రకటించారు. దీంతో చాలామంది సోషల్ మీడియా ద్వారా ప్రధాని మోదీకి, దూరదర్శన్ ఛానెల్‌కు ‘థ్యాంక్స్ మోదీ... థ్యాంక్స్ డీడీ’ అంటూ ధన్యవాదాలు చెబుతున్నారు. అప్పట్లో ఎక్కడివారక్కడే.. జనవరి 25, 1987లో 30 నిమిషాల నిడివితో 78 ఎపిసోడ్లతో మొదటిసారి దూదర్శన్‌లో రామాయణం ప్రసారమైంది. అప్పట్లో ఇది టీవీలో ఓ విప్లవం. ఈ సీరియల్ వచ్చే సమయంలో ప్రజారవాణా సదుపాయాలన్నీ స్తంభించిపోయేవి. రైళ్లు, బస్సులు, ఇంటర్ సిటీ ట్రక్కులు.. జనం లేక వెలవెలబోయేవి. ఊళ్లలో సమూహాలుగా టీవీ సెట్స్ ముందు చేరిపోయేవారు. టీవీల ముందు కొబ్బరికాయలు కొట్టి, అగరొత్తులు వెలిగించేవారు. పువ్వులు జల్లి నీరాజనాలు సమర్పించేవారు. నిజానికి ఇది ఒక కార్యక్రమమే. కానీ పిల్లా జెల్లాతో కలిసి కుటుంబం అంతా ఈ సిరియల్‌ని చూసింది. సీరియల్ పూర్తయ్యాక సత్యమే పలకాలనే వాగ్డానాలు చేసుకునేవారు. పిల్లలు ఇంటి గడప దాటి బయటకు వెళ్లాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకునేవారు. రామాయణంతో టీవీ అలా ప్రతి ఒక్కరినీ కథలో లీనమయ్యేలా చేస్తూ జీవన విలువలనే ధ్యేయంగా విద్యాభ్యాసం చేయించింది. ముప్పై రెండేళ్ల క్రితం ప్రతి ఆదివారం ఉదయం వేళ కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించిన రామాయణం ఇప్పుడు కర్ఫ్యూ వాతావరణంలో మళ్లీ బుల్లితెర మీదకు వచ్చేసింది. రామనవమి వస్తున్న ఈ తరుణంలో రామాయణం మళ్లీ వీక్షించడం మహద్భాగ్యంగా చెప్పుకుంటున్నారు జనం. పాలసంద్రం నుంచి పట్టాభిషేకం దాకా! ‘శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం..’ పాల సముద్రం మీద శేష శయనుడైన నారాయణుడు, పాదాలు వత్తుతూ లక్ష్మీదేవి. బ్రహ్మాది దేవతలంతా స్తుతిస్తున్న సన్నివేశంతో రామాయణం మొదలవుతుంది. యోగనిద్రలో ఉన్న నారాయణుడు కనులు తెరిచి విషయం ఏంటని అడుగుతాడు. రావణాసురుడి ఆగడాలకు అంతులేదు. అధర్మమే అంతటా ఉంది. పాప నాశనం చేసి, ధర్మ సంస్థాపన చేయండి అని వేడుకుంటారు దేవతలు. వరాలను దుర్వినియోగం చేస్తున్న రావణాసురుడిని నిలువరించాల్సిన అత్యావశ్యకం వచ్చింది చెపుతాడు శివుడు. సత్యమే గెలుస్తుందని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సూర్యచంద్రులు ఉండేంతవరకు ఆ ధర్మం అందరికీ మార్గదర్శకం కావాలని కోరుకుంటారు. రావణుడి అహంకారాన్ని మట్టుపెట్టేందుకు తాను జన్మిస్తానని వరమిస్తాడు నారాయణుడు. ‘సత్యమేవ జయతే’ అంటారు దేవగణం. అక్కడి నుంచి.. రాముడు జననం, విద్యాభ్యాసం, వివాహం, వనవాసం మీదుగా కథ నడుస్తూ సీతాదేవి అపహరణ, రావణాసుర సంహారం, తిరిగి అయోధ్యనగర ప్రవేశం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. డీడీ1లో ప్రసారమవుతున్న ‘రామాయణ్’ సీరియల్ చూస్తూ, సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు నిత్యవిద్యార్థి రామానంద సాగర్ రామానంద సాగర్ దాదాపు వందేళ్ల క్రితం కశ్మీరీ ధనిక కుటుంబంలో పుట్టాడు. రచయితగా ఎన్నో మారు పేర్లతో రచనలు చేశాడు. ఒకానొక సమయంలో ముంబయ్‌కి అతని కుటుంబ వలస వచ్చింది. సినిమా మీద వ్యామోహంతో పృథ్వీ థియేటర్లో పృథ్వీరాజ్ కపూర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. 1950లో సాగర్ ఆర్ట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని నిర్మించాడు. పదుల సంఖ్యలో నామమాత్రపు సినిమాలు అతని ప్రొడక్షన్లో వచ్చాయి. ఆ తర్వాత అతని దశ, దిశ మార్చింది మాత్రం చిన్నతెరనే. అంతకాలం అతనొక విద్యార్థి. రామాయణంతో అతనిలోని మేధావి ప్రపంచానికి కనిపించాడు. తనలో సాంకేతికæ పరిజ్ఞానం ఏ మాత్రం లేదని ఒప్పుకున్న సాగర్ రామాయణాన్ని బుల్లితెర మీద చూపించడంలో అపారప్రతిభను కనబరిచాడని అంతా చెబుతుంటారు. తులసీదాస్ రామాయణమే మూలం రామానంద సాగర్ తులసీదాస్ రామాయణంలోని కథను తన సీరియల్‌కి ఎంచుకున్నాడు. రామరాజ్య స్థాపనకు ముందు రాముడి జీవితాన్ని ఇందులో తీసుకున్నారు. రాముడు తిరిగి అయోధ్యను చేరుకోవడం, పట్టాభిషేకంతో కథ ముగుస్తుంది. చివరలో సీతను రాముడు వదిలేయడం, లవకుశల అంశాలతో కూడిన ఉత్తర రామాయణ్ తీసుకోలేదు. ‘చాలా మంది రచయితలు రాముడు సీతను వదిలేసినట్టు రాశారు. ‘కానీ, నా రాముడు అలా కాదు అనేవాడు నాన్న. ఆ తర్వాత ప్రత్యేకంగా లవ–కుశ సీరియల్ తీయాలనుకున్నాడు. కానీ, అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది’ అని చెప్పారు ఓ ఇంటర్వూ్యలో రామానంద్ సాగర్ తనయుడు ప్రేమ్‌సాగర్. భారత దేశంలో పౌరాణిక ఇతివృత్తంతో సీరియల్స్ రూపొందించడానికి రామాయణం ఒక మాధ్యమంగా సాగింది. జీవించిన నటీనటులు రామ పాత్రధారి అరుణ్‌గోవిల్ గళం ఈ సీరియల్‌కే పెద్ద ఎస్సెట్. ప్రశాంత చిత్తం. మృదుమైన మాట. అతను మాట్లాడుతుంటే వినేవారి చెవులు ఆసక్తితో రిక్కించుకుని వింటాయి. ఇక ఇప్పటి వరకు వచ్చిన సీత క్యారెక్టర్లలో ఎవరు ది బెస్ట్ అని కళ్లు మూసుకొని వెతికినా దీపికా చికాలియా రూపం కళ్లముందు నిలుస్తుంది. కళ్లతో ఆమె పలికించిన భావాలు మనసు నుంచి చెదిరిపోవు. ఇప్పటికి వచ్చిన రామాయణ్ సీరిస్‌లో హనుమాన్ పాత్ర ధారులను గమనిస్తే హనుమాన్‌గా నటించిన ధారా సింగ్ అపరమేధావిలా కనిపిస్తాడు. హనుమాన్ అంటే ధారాసింగ్ మాత్రమే అనేలా మెప్పించాడు. ఇక రాముడికి దీటుగా రావణుడి పాత్రకోసమే పుట్టాడేమో అనిపించేలా అరవింద్ త్రివేది కనిపిస్తారు. మరింత అందంగా! మూడు దశాబ్దాల క్రితమే కోటి రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సీరియల్ పాత్రదారులకు బ్రైట్ కలర్ కాస్ట్యూమ్స్ వాడారు. మన దేశ ప్రజలకు అప్పుడప్పుడే కలర్ టెలివిజన్ చేరవవుతుంది. ఈ చిన్న తెరమీద గులాబీ, నీలం, పసుపు, ఎరుపు రంగులతో షోని బ్లాస్ట్ చేశాడు దర్శకుడు. ఇప్పుడు మనంటి గోడ మీద ఠీవీగా స్థానం సంపాదించుకున్న టీవీలో రామాయణం వర్ణాలన్నీ మరింత క్లారిటీగా వీక్షించవచ్చు. రికార్డులు ఇండియన్ టీవీలో మొట్టమొదటి బ్లాక్ బస్టర్, అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన పౌరాణిక షో గా రామాయణం వరల్డ్ లిమ్కా బుక్ రికార్డ్స్‌లో చోటు చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన రామాయణాలకు రామానంద్ సాగర్ రామాయణమే పెద్ద బాలశిక్ష అయ్యింది. – నిర్మలారెడ్డి -
ఐపీఎల్ ప్రసార సిగ్నల్స్‌ను దొంగిలించి..
ఇండోర్: ఐపీఎల్ బెట్టింగ్ తారాస్థాయికి చేరిందనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసార సిగ్నల్స్‌ను దొంగిలించి మరీ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా టీవీల్లో కొన్ని సెకన్లు ఆలస్యంగా మ్యాచ్ ప్రసారమవుతుంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ బెట్టింగ్ బృందం.. సిగ్నల్స్‌ను దొంగిలించడం ద్వారా టీవీల్లో ప్రసారం కావడానికి ఎనిమిది సెకన్ల ముందే మ్యాచ్ గమనాన్ని తెలుసుకుని కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. క్రికెట్ బెట్టింగ్ టిప్స్ ఫర్ ఫ్రీ పేరు ఒక వెబ్‌సైట్‌ను తెరిచిన ఈ ముఠా.. మ్యాచ్ ఫీడ్‌ను మళ్లించి ఈ సైట్లో ఉంచుతోంది. మధ్యప్రదేశ్ పోలీసులు ఈ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ ముఠా దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి ప్రధాన సూత్రధారి అంకిత్ జైన్ అలియాస్ మున్నూ జాకీగా అనుమానిస్తున్నారు. అతన్ని విదిషాలో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోర్ సైబర్ సెల్ ఎస్పీ జితేందర్ సింగ్ తెలిపారు. -
ఎస్వీబీసీ ఛానల్ తీరుపై విమర్శలు
-
12 వరకు మాత్రమే ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
న్యూఢిల్లీ: ఈ నెల 12 వరకు మాత్రమే ఎన్నికల సర్వేలపై నిషేధం అమల్లో ఉంటుంది. 12వ తేదీ సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను ప్రసారం చేయవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్ర శుక్రవారం చెప్పారు. కాగా కౌంటింగ్ జరిగే వరకు అంటే 16 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుందని తొలుత ప్రకటించిన బ్రహ్మ ఆ వెంటనే వివరణ ఇచ్చారు. 16న లోక్‌సభ, తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగా, ఈ నెల 12తో లోక్‌సభ ఎన్నికలు ముగుస్తాయి. ఇప్పటి వరకు 502 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, మరో విడత మాత్రమే మిగిలుంది. -
దూరదర్శన్‌లో భారీ సీరియళ్లు!
న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ఒకే తరహా మూస కార్యక్రమాలతో విసిగెత్తిన ప్రేక్షకులకు శుభవార్త! ఇకపై బుల్లితెరపై భారీ బడ్జెట్‌తో నిర్మించిన ధారావాహికలను ప్రసారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నాణ్యమైన కార్యక్రమాలను అందచేసే నిర్మాతలతో కలిసి ఆదాయం పంచుకోవాలని దూరదర్శన్ నిర్ణయించింది. కొత్త విధానం ప్రకారం భారీ బడ్జెట్‌తో సీరియళ్లు నిర్మించే నిర్మాతలు ప్రకటనదారులను తెచ్చుకోవచ్చు. ఈ ప్రతిపాదనలను ప్రసార భారతి బోర్డు ఇటీవల ఆమోదించింది. ఆదాయ పంపిణీ విధానం కింద సీరియళ్ల నిర్మాతలు వాటిని దూరదర్శన్‌లో ప్రసారం కోసం ఉచితంగా అందచేయాలి. దీనిద్వారా లభించే ఆదాయాన్ని ప్రత్యేక ఖాతాకు జమచేసి దూరదర్శన్, నిర్మాతలు పంచుకుంటారు. కనీసం ఎయిర్టైం ఖర్చులైనా దూరదర్శన్‌కు దక్కేలా నిబంధన రూపొందించారు.