12 వరకు మాత్రమే ఎగ్జిట్ పోల్స్పై నిషేధం | Exit polls banned only till May 12, says Election Commissioner H S Bramha | Sakshi
Sakshi News home page

12 వరకు మాత్రమే ఎగ్జిట్ పోల్స్పై నిషేధం

Published Fri, May 9 2014 4:50 PM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

Exit polls banned only till May 12, says Election Commissioner H S Bramha

న్యూఢిల్లీ: ఈ నెల 12 వరకు మాత్రమే ఎన్నికల సర్వేలపై నిషేధం అమల్లో ఉంటుంది. 12వ తేదీ సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ను ప్రసారం చేయవచ్చని కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ ఎస్ బ్రహ్ర శుక్రవారం చెప్పారు. కాగా కౌంటింగ్ జరిగే వరకు అంటే 16 వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉంటుందని తొలుత ప్రకటించిన బ్రహ్మ ఆ వెంటనే వివరణ ఇచ్చారు.

16న లోక్సభ, తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగా, ఈ నెల 12తో లోక్సభ ఎన్నికలు ముగుస్తాయి. ఇప్పటి వరకు 502 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, మరో విడత మాత్రమే మిగిలుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement