టెల్‌అవీవ్: హమాస్ అధినేత యహ్యా సిన్వార్ బతికే ఉన్నట్లు ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించింది.సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణ కవచంగా ఏర్పరుచుకున్నారని ఖతర్ అధికారులు చెప్పినట్లు కథనాల సారాంశం.
సెప్టెంబర్ 21న గాజాలోని ఓ స్కూల్‌లో ఉన్న హమాస్ కమాండ్ సెంటర్ టార్గెట్‌గా పెద్దఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి.ఈ దాడుల్లో సిన్వార్ మృతిచెంది ఉంటారని ఇజ్రాయెల్ దళాలు భావించాయి.ఈ విషయంలో సిన్వార్ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.దీంతో అతడు మృతి చెంది ఉంటాడన్న వాదనకు బలం చేకూరింది.
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపు దాడులకు సూత్రధారి సిన్వార్. హమాస్ చీఫ్‌గా ఉన్న హనియే మృతి తర్వాత ఈ ఏడాది ఆగస్టులో సిన్వార్ ఆ బాధ్యతలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: ఇరాన్ భూగర్భ అణు పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment