టెల్‌అవీవ్:హమాస్ ముఖ్య నేత ఇస్మాయిల్ హనియే ఈ ఏడాది జులైలో హత్యకు గురైన విషయం తెలిసింది. హనియేను తామే అంతం చేశామని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాద గ్రూపు ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగిస్తుంది.
ఈ క్రమంలో వారికి ఓ స్పష్టమైన సందేశం అందించాలనుకుంటున్నా. హమాస్, హెజ్‌బొల్లాలను ఓడించాం. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంతో పాటు హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇరాన్ రక్షణ,ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం.సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదు’ అని కాట్జ్ హెచ్చరించారు.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జులైలో జరిగిన ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే. పథకం ప్రకారమే ఇజ్రాయెలే ఈ పని చేసిందని ఇరాన్ అప్పుడే ఆరోపించింది.అయితే అప్పట్లో ఇజ్రాయెల్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజాగా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు గాజాలో యుద్ధం మొదలైనప్పటినుంచి హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నామని హౌతీ రెబెల్స్ పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment