ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ కీలక నేతలను అంతం చేయాటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలో దాడులను జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 7 దాడుల రూపకర్త, హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ జాడ మిస్టరీగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఆయన బతికే ఉన్నారా? లేరా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే యాహ్యా సిన్వార్‌కు సంబంధించి.. ఖతార్ అధికారులు కీలక విషయాలు వెల్లడించారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం మొదటి నుంచి ఖతార్ కృషి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గత వారం రోజులుగా సిన్వార్ తమకు టచ్‌లో లేరని ఖతార్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం.. తమతో ఆయన కమ్యూనికేషన్‌కు సంబంధించి కీలక విషయాలను వింటారనే భయంతో సిన్వార్ ప్రస్తుతం పెన్, పేపర్లతో మాత్రమే కమ్యూనికేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనతో మధ్యవర్తిత్వ చర్చలకు జరపడానికి తమకు సవాల్‌గా మారిందని తెలిపారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు హమాస్ స్పందించలేదు.
ఇక.. సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణగా పెట్టుకొని ఉన్నారని ఇజ్రాయెల్ స్థానిక మీడియా ఓ నివేదిక ప్రచురించింది దీంతో హమాస్ చీఫ్ వైమానిక దాడిలో మరణించి ఉండవచ్చనే ఊహాగానాలకు తెరపడినట్లైంది. మరోవైపు.. కాల్పుల ఒప్పందానికి విరుద్ధంగా ఇజ్రాయెల్ దాడులతో హత్యల విధానాన్ని కొనసాగిస్తోందని ఖతార్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే మాజీ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ అంతం చేసింది. ప్రస్తుతం హమాస్‌కు కీలకమైకన నేతగా ఖలీద్ మషాల్ ఉన్నారు. ఆయన హనియే కంటే చాలా బలవంతుడని ఖతార్ అధికారులు తెలిపారు.
చదవండి: మీరెన్ని చెప్పినా.. ఇరాన్‌పై మా యుద్ధం ఆగదు : ఇజ్రాయెల్ ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment