యువతి ఆత్మహత్య ప్రత్యక్ష ప్రసారం
పారిస్: ఓ ఫ్రెంచ్ యువతి తన ఆత్మహత్యను పెరిస్కోప్ అనే యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన సంఘటన దక్షిణ పారిస్లోని ఇగ్లీలో చోటుచేసుకుంది. పారిస్కు చెందిన 19 ఏళ్ల యువతి తాను అత్యాచారానికి గురయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి మంగళవారం ఇగ్లీలోని సబర్బన్ రైలు కిందపడి మృతి చెందినట్లు వెల్లడించారు.
పోలీసులు ఆమె ఫోన్ను స్వాధీనం చేసుకుని, అందులోని వీడియోను పరిశీలిస్తున్నారు. అలాగే లైవ్లో ఈ ఆత్మహత్యను వీక్షించినవారిని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతురాలి పేరును మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కాగా పెరిస్కోప్ యాప్ ట్విట్టర్ ఖాతా ద్వారా లైవ్ వీడియోలను అనుమతించే ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్. లైవ్ వీడియోలను వీక్షించేందుకు, షేర్ చేయడానికి ఈ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది.