
బెంగళూరు: కర్ణాటకలో కొద్ది వారాలుగా కనిపించకుండా పోయిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం అకస్మాత్తుగా అసెం బ్లీలో ప్రత్యక్షమయ్యారు. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు కాంగ్రెస్ సిఫారసు చేసిన రెండు రోజులకే వారు నలుగురు ప్రత్యక్షం కావడం గమనార్హం.కాంగ్రెస్ సభాపక్ష సమావేశాలకు హాజరు కావాలంటూ ఇచ్చిన ఆ పార్టీ విప్ ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ కొద్ది వారాలుగా రమేశ్ జారకిహోళి, ఉమేశ్ జాదవ్, బి.నాగేంద్ర, మహేశ్ కుమతళ్లి అనే నలుగురు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు. ఈనెల 6 నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కావట్లేదు.
వీరు నలుగురు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారని భావిస్తున్నారు. వీరిని తమ వైపు తిప్పుకొని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిసెంబర్ 22న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రమేశ్ జారకిహోళిని మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ‘అసంతృప్తితో ఉన్నానన్న విషయా న్ని నేను ఖండించట్లేదు. కానీ ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ఫిబ్ర వరి 24న జరగనున్న నా కుమార్తె పెళ్లి పనుల కోసం ముంబై వెళ్లాను’ అని రమేశ్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రత్యక్షం కావడంతో అధికార పక్షం కాస్త ఊపిరి పీల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment