మేయర్‌ లైవ్‌ షోలో అనుకోని అతిథి | A Latvian Mayor Whose Cat Interrupted His Live Stream | Sakshi
Sakshi News home page

మేయర్‌ లైవ్‌ షోలో అనుకోని అతిథి

Published Sun, Apr 9 2017 10:13 AM | Last Updated on Tue, Sep 5 2017 8:22 AM

మేయర్‌ లైవ్‌ షోలో అనుకోని అతిథి

మేయర్‌ లైవ్‌ షోలో అనుకోని అతిథి

లైవ్‌ షోలల్లో ఈ మధ్య ఆసక్తికరమైన దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య ఓ టీవీ చానెల్‌కు ఓ తండ్రి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అతడి చిన్న పిల్లలు దూసుకొని వచ్చి కాసేపు ఆ కార్యక్రమం దృష్టి మరల్చగా సరిగ్గా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. లాత్వియా రాజధాని రిగాకు మేయర్‌గా పనిచేస్తున్న నిల్స్‌ ఉసాకోవ్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా లైవ్‌ షోలో ఉండగా అందులోకి అనుకోని అతిథిగా ఓ నల్లటి పిల్లి  వచ్చి ఆయన ముందు పెట్టిన గ్లాస్‌లోని నీటిని తాగి అందరి దృష్టిని ఆకర్షించింది.

అప్పటి వరకు పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న ఆయన ఒక్కసారిగా ఆగిపోయి ఆ పిల్లిని శ్రద్దగా చూసి నవ్వుతూ దానిని పంపించి తిరిగి విషయంలోకి వెళ్లారు. టేబుల్‌పై ల్యాప్‌టాప్‌ పెట్టుకొని నిల్స్‌ ఉండగా పక్కన ఓ గ్లాస్‌, ఆయన వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎదురుగా లైవ్‌ కెమెరా. ప్రైవేటు ల్యాండ్‌ ఓనర్స్‌తో వారి పెట్టుబడులపై వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమంలో నిల్స్‌ ఉండగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement