latvia
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే కారు ఉక్రెయిన్‌కే!!
రిగా(లాత్వియా): డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన కార్లను లాత్వియా అధికారులు ఉక్రెయిన్‌కు పంపిస్తున్నారు. రష్యాతో జరిగే యుద్ధంలో ఉక్రెయిన్‌కు తమ ప్రయత్నం సాయంగా ఉంటుందని అంటున్నారు. ఈ కార్లను నడిపిన మాజీ యజమానుల రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు 0.15% పైనే ఉందట. ఇప్పటికే ఇలా పట్టుబడిన 8 కార్లు ఉక్రెయిన్‌కు పంపామని లాత్వియా దేశ రెవెన్యూ విభాగం తెలిపింది. కొనుగోలు చేసిన, విరాళంగా అందిన కార్లను దెబ్బతిన్న, యుద్ధం జరిగే ప్రాంతాల్లో అత్యవసర సేవలకు వినియోగిస్తామని ఉక్రెయిన్‌కు చెందిన అగెండమ్ గ్రూప్ తెలిపింది. 2022 ఫిబ్రవరి నుంచి ఇలాంటి 1,200 కార్లను అందజేసినట్లు వెల్లడించింది. లాట్వియా రోడ్లపై మద్యం తాగి కార్లలో తిరిగే వారు ‘పేలని కమికాజ్ డ్రోన్లు’వంటి వారని చమత్కరించింది. ‘సాధారణంగా స్వాధీనం చేసుకున్న కార్లను అమ్మేయడమో, విడగొట్టి అమ్మేయడమో చేస్తుంటాం. అయితే, ఉక్రెయిన్ ప్రజలకు సాయం చేయాలనే వీటిని అక్కడికి పంపిస్తున్నాం’అని లాత్వియా అంటోంది. పట్టుబడిన కార్లను వారానికి 25 చొప్పున అగెండమ్కు అందజేస్తామని లాత్వియా అధికారులు హామీ ఇచ్చారు. -
తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ సంచలనం...
Telangana Gm Erigaisi Arjun: లాత్వియాలో జరిగిన లిండోరస్ అబ్బె బ్లిట్జ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్ 13.5 పాయింట్లు సాధించాడు. అర్జున్ 13 గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని మరో నాలుగు గేముల్లో ఓడాడు. మేటి ప్లేయర్లు కరువానా (అమెరికా), అరోనియన్ (అర్మేనియా) తదితరులపై అర్జున్ గెలిచాడు. షెవ్చెంకో (ఉక్రెయిన్–14 పాయింట్లు) విజేతగా నిలిచాడు. చదవండి: T20 World Cup 2021: అలసటా.. టాస్ ప్రభావమా.. అసలు ధోని ఏం చేశాడు? కారణాలేంటి? -
విషాదం: ఊహించని రీతిలో మృత్యువు ఒడికి..
ఆ యువ ఆటగాడి జీవితాన్ని విధి విచిత్రంగా కాటేసింది. సంబురంగా గడుపుతున్న టైంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ ఘటనతో అతను తీవ్రంగా గాయపడగా.. కొన ఊపిరితో మూడుగంటలు పోరాడి మరీ ప్రాణం విడిచాడు. మాటిస్ కివ్‌లెనిక్స్(24)..లాత్వియాకు చెందిన ఐస్ హకీ ఆటగాడు. నేషనల్ హాకీ లీగ్‌లో కొలంబస్ బ్లూ జాకెట్స్ తరపున గోల్టెండర్(గోల్‌ను అడ్డుకునే క్రీడాకారుడు)గా అతనికి మాంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. తొమిదేళ్ల కెరీర్లో జట్టుకు మంచి సేవలు అందించాడు. అలాంటి టాలెంటెడ్ ఆటగాడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. ఆదివారం రాత్రి బ్లూ జాకెట్స్ కోచ్ మెన్సీ లెగస్ ఇంట్లో(మిషిగాన్)లో పార్టీ జరిగింది. పటాకుల్ని పేల్చి సంబురాలు చేసుకుంది టీం. ఆ టైంలో కివ్‌లెనిక్స్ సహా ఆటగాళ్లంతా హాట్ టబ్‌లో కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. అయితే పటాకులు ఒక్కసారిగా ఆటగాళ్ల వైపు దూసుకొచ్చాయి. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో అంతా తలోదిక్కు పరిగెత్తారు. అయితే కాలు జారి బాత్ టబ్‌లో పడిన కివ్‌లెనిక్స్.. గాయపడ్డ విషయాన్ని తోటి టీం మేట్స్ గుర్తించారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. తొలుత బాత్ టబ్‌లో పడిపోవడంతో అతని తలకు గాయమై చనిపోయి ఉంటాడని డాక్టర్లు భావించారు. అయితే దూసుకొచ్చిన ఫైర్వర్క్స్ మోటర్ బలంగా ఛాతిని ఢీకొట్టడంతో.. అంతర్గతంగా గాయాలై చనిపోయాడని శవపరీక్షలో తేలింది. కాగా, ఈ యువ ఆటగాడి దుర్మరణంపై క్లబ్‌తో పాటు నేషనల్ హాకీ లీగ్ సంతాపం వ్యక్తం చేసింది. కివ్‌లెనిక్స్ లాత్వియా తరపున పలు ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. ఈ మే-జూన్‌లో జరిగిన ప్రపంచ టోర్నమెంట్లో కెనెడాపై లాత్వియా తొలి విజయానికి కివ్‌లెనిక్స్ షూట్ అవుట్ కారణం కావడం విశేషం. -
కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం: వెంకయ్య నాయుడు
రిగా : లాత్వియా దేశ అధ్యక్షుడు లేవిట్స్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశమై రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య రంగంపై చర్చలు జరిపారు. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి మంగళవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా భారత- లాత్వియా దేశాల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చి మైత్రి సంబంధాలు మరింత పటిష్టం కావాలని అభిలాషించారు. లాత్వియా స్వాతంత్ర సమరయోధుల స్థూపం వద్ద నివాళులర్పించిన వెంకయ్య నాయుడు అనంతరం ఆ దేశ చారిత్రక మ్యూజియంను సందర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భారత్ శాంతికాముక దేశమని, జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఏ దేశాన్ని ఆక్రమించబోదనీ అయితే దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని లాత్వియా అభిప్రాయపడింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిలో సంస్కరణలు జరగాలని పేర్కొంది. -
మేయర్ లైవ్ షోలో అనుకోని అతిథి
-
మేయర్ లైవ్ షోలో అనుకోని అతిథి
లైవ్ షోలల్లో ఈ మధ్య ఆసక్తికరమైన దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య ఓ టీవీ చానెల్‌కు ఓ తండ్రి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అతడి చిన్న పిల్లలు దూసుకొని వచ్చి కాసేపు ఆ కార్యక్రమం దృష్టి మరల్చగా సరిగ్గా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. లాత్వియా రాజధాని రిగాకు మేయర్‌గా పనిచేస్తున్న నిల్స్ ఉసాకోవ్స్ ఆన్లైన్ ద్వారా లైవ్ షోలో ఉండగా అందులోకి అనుకోని అతిథిగా ఓ నల్లటి పిల్లి వచ్చి ఆయన ముందు పెట్టిన గ్లాస్‌లోని నీటిని తాగి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకు పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న ఆయన ఒక్కసారిగా ఆగిపోయి ఆ పిల్లిని శ్రద్దగా చూసి నవ్వుతూ దానిని పంపించి తిరిగి విషయంలోకి వెళ్లారు. టేబుల్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకొని నిల్స్ ఉండగా పక్కన ఓ గ్లాస్, ఆయన వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎదురుగా లైవ్ కెమెరా. ప్రైవేటు ల్యాండ్ ఓనర్స్‌తో వారి పెట్టుబడులపై వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమంలో నిల్స్ ఉండగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది.