
Telangana Gm Erigaisi Arjun: లాత్వియాలో జరిగిన లిండోరస్ అబ్బె బ్లిట్జ్ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ (జీఎం) ఎరిగైసి అర్జున్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్ 13.5 పాయింట్లు సాధించాడు.
అర్జున్ 13 గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని మరో నాలుగు గేముల్లో ఓడాడు. మేటి ప్లేయర్లు కరువానా (అమెరికా), అరోనియన్ (అర్మేనియా) తదితరులపై అర్జున్ గెలిచాడు. షెవ్‌చెంకో (ఉక్రెయిన్–14 పాయింట్లు) విజేతగా నిలిచాడు.
చదవండి: T20 World Cup 2021: అలసటా.. టాస్ ప్రభావమా.. అసలు ధోని ఏం చేశాడు? కారణాలేంటి?
Comments
Please login to add a commentAdd a comment