opposition meeting
-
ఆక్సిజన్ మాస్క్‌తో విమానంలో సోనియా గాంధీ.. రాహుల్ భావోద్వేగ పోస్టు..
భోపాల్: బెంగళూరులో విపక్ష భేటీ అనంతరం ఢిల్లీకి వెళుతుండగా.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో విమానంలో ఆక్సిజన్ తక్కువ అయింది. ఈ కారణంగా సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించారు. ఈ ఫొటోను కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ షేర్ చేశారు. 'ఆపదలోనూ దయకు అమ్మే ఉదాహారణ' అని పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. పోస్టు చేసిన మొదటి గంటలోనే 1.8 లక్షల లైకులు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రయాణిస్తున్న విమానం మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎయిర్ పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపం కారణంగా విమానం భోపాల్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినట్లు భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణ్ చారీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలియజేశారు. View this post on Instagram A post shared by Rahul Gandhi (@rahulgandhi) సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెంగళూరులో జరిగిన విపక్ష నేతల సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దాదాపు గంటన్నర సేపు ఎయిర్ పోర్టులో బస చేసిన తర్వాత మంగళవారం రాత్రి 9.35కి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇదీ చదవండి: దంచికొట్టిన వానలు.. నీటమునిగిన కార్లు.. ఒక్క రోజులోనే.. -
‘ఇండియా’ పేరుపై నితీశ్ తీవ్ర అభ్యంతరం!
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రలోని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలు ఐక్యతా పోరు ఉద్ధృతం చేశాయి. ఇందులో భాగంగా పట్నాలో తొలి విడత భేటీ నిర్వహించగా.. రెండో విడతలో భాగంగా బెంగళూరులో మరోసారి సమావేశమయ్యాయి. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, జేడీయూ సహా 26 పార్టీల అధినేతలు, అగ్ర నేతలు ఈ భేటీలో పాల్గొని పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. విపక్ష కూటమికి ‘ఇండియా’(ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్యూజివ్ అలయన్స్)గా నామకరం చేస్తున్నట్లు సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఇండియా పేరును తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించినట్టు సమాచారం. దీనిపై నేతలలంతా లోతుగా చర్చించి, ఏకాభిప్రాయంతో అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇండియా పేరు ఎలా పెడ్తారు? అయితే ఇండియా అనే పేరును బిహార్ సీఎం నితీష్ కుమార్ గట్టిగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. విపక్షాల కూటమి పేరు గురించి కాంగ్రెస్ ఏ విధంగానూ చర్చించలేదని, దీంతో నితీష్ షాక్‌కు గురైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో NDA అక్షరాలు ఉండటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కూటమికి ఇండియా అనే పేరు ఎలా పెడ్తారని భేటీలోనే జేడీయూ అధినేత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నితీష్పాటు వామపక్షాలు సైతం నితీష్‌తోపాటు వామపక్ష నేతలు కూడా INDIA పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రత్యామ్నాయ పేరును సూచించినట్లు సమాచారం. కానీ మిగతా మెజార్టీ పార్టీలు ఆమోదించడంతో నితీష్ కుమార్ సైతం చివరికి అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘సరే మీ ఆందరికీ ఇండియా పేరు ఓకే అయితే కానివ్వండి.. అదే మంచిందంటూ బిహార్ సీఎం అన్నట్లు సమాచారం. కాగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవడంలో నితీష్ కుమార్ పాత్ర ఎంతో కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చదవండి: డేంజర్ యమున.. తాజ్ మహల్‌ను తాకిన వరద జీతేగా భారత్ తమ కూటమికి ఇండియా అనిపేరు పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు దానికి ట్యాగ్‌లైన్‌గా ‘జీతేగా భారత్’( భారతదేశం గెలుస్తుంది)ఎంచుకున్నాయి. కూటమి ట్యాగ్‌లైన్ హిందీలో ఉండాలని ఉద్దవ్ ఠాక్రే సూచించారని తెలుస్తోంది. హిందీ భాషతోపాటు అన్ని భాషల్లో ఈ ట్యాగ్‌లైన్‌ను ఉపయోగిస్తామని వెల్లడించాయి. కూటమికి సారథి ఎవరు? ప్రతిపక్షాల కూటమికి సారథి ఎవరన్నది ఇంకా వెల్లడించలేదు. అయితే నాయకత్వ బాధ్యతలను సోనియా గాంధీకి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్‌ను కన్వీనర్‌గా నియమించవచ్చునని తెలుస్తోంది. భాగస్వామ్యుల మధ్య సమన్వయం, సహకారం తదితరాల సాధనకు 11 మంది సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి కట్టుగా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాయి. ముంబైలో నెక్స్ట్ మీటింగ్ విపక్షాల తర్వాతి భేటీ మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరగనుంది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలోనే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అశం, సీట్ల సర్ధుబాటుపైనా ఆరోజే చర్చిస్తామని నేతలు చెప్పారు. -
ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ కూటమి వైపు కేజ్రీవాల్.. ఆమ్ అద్మీ వ్యూహమేంటీ?
ప్రతిపక్ష కూటమి సమావేశానికి హాజరైన ఆమ్ ఆద్మీ పార్టీపై అందరి దృష్టి ఉంది. అటు ఢిల్లీతో పాటు ఇటు పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారం హస్తగతం చేసుకున్న ఆప్.. కాంగ్రెస్‌తో జట్టు కట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2013 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడించడం మాత్రమే కాదు.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ ఓటమికి కూడా ఆప్ నడిపిన ఆంటీ కరప్షన్ క్యాంపెయిన్ ప్రధాన కారణం. ఇక ఢిల్లీ తరువాత పంజాబ్‌లోనూ ఆప్ కాంగ్రెస్ కంట్లో నలుసుగా మారింది. ఆపై అక్కడ కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించింది. ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓట్లను చీల్చడంలో ఆప్ ప్రధాన పాత్ర పోషించింది. హిమాచల్‌లో ఎలాగోలా అధికారం దక్కినా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడా ఆప్ నుంచి చికాకు తప్పలేదు. చాలాకాలంగా బీజేపీకి బీటీమ్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఆప్‌ను విమర్శిస్తోంది. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల కూటమి సమావేశానికి హాజరయ్యి ఆప్ అందరినీ కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆప్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మీటింగ్‌కు హాజరవడానికి ఒక బలమైన కారణం కనిపిస్తోంది. ఢిల్లీ పరిపాలనా అధికారాలను నియంత్రించే ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తే తాము కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరవుతామని గతంలో ఆప్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఢిల్లీ నేతలు ఆప్ ట్రాప్‌లో పడొద్దని.. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించొద్దని అధిష్ఠానాన్ని కోరాయి. అయితే బెంగుళూరు సమావేశానికి సరిగ్గా నాలుగురోజుల ముందు కాంగ్రెస్ అధిష్టానం.. ఆప్‌కు మద్దతుగా ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తానని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాస్త ఆశ్చర్యకరమైనదే అయితే అది అనాలోచితం మాత్రం కాదు. చదవండి: Opposition Meet: కాంగ్రెస్ పెద్దన్నగా మారిందా? కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ఆప్‌ను డిఫెన్స్‌లోకి నెట్టినట్టయింది. ఇక ఒప్పుకున్నాక.. వెనక్కి తగ్గే అవకాశం ఆప్‌కు లేకుండా పోయింది. వెనక్కి వెళ్లితే ఆప్‌కు ప్రతిపక్షాల్లో మద్దతు కరువయ్యే ప్రమాదం ఉంది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బలం కూడగట్టాలంటే కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ మద్దతు అవసరం. అందుకే ఆప్ నాయకులు ఇష్టం లేకున్నా బెంగుళూరు మీటింగ్‌కు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులతో రాసుకుని పూసుకుని తిరిగారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను కట్టడి చేయాలన్నది కాంగ్రెస్ లాంగ్‌టర్మ్ స్టాటర్జీ. ముఖ్యంగా ఆప్ మాకు మిత్రపక్షమే అని మెసేజ్ ఇస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కలిసి వస్తుందనేది కాంగ్రెస్ వ్యూహం. ఆర్డినెన్స్ పేరుతో ఆప్‌ను దువ్వితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్దిపొందవచ్చని హస్తం నేతల ధీమా. అయితే ఆర్డినెన్స్‌కు మద్దతు సంపాదించడంతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్‌లలో కాంగ్రెస్‌ను పోటీచేయకుండా చూడాలనేది ఆప్ వ్యూహం. అందుకే బెంగుళూరుకు పిలిచి సాండల్ సోప్‌తో కాకా పడుతున్నా... కాంగ్రెస్ పార్టీది ధృతరాష్ట్ర కౌగిలి అనే భయం మాత్రం ఆప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ చాణక్యం వర్క్ అవుట్ అవుతుందా? కేజ్రీ వ్యూహం పని చేస్తుందా? మరో ఆరు నెలల్లో తేలిపోతుంది. -ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ ( విపక్షాల భేటీకి దీటుగా.. 38 పార్టీలతో ఎన్డీఏ కూటమి సమావేశం..) -
Opposition Meet: కాంగ్రెస్ పెద్దన్నగా మారిందా?
కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకునే ఉద్దేశంతో ప్రతిపక్షాలన్నీ కూటమి కట్టాయి. బెంగుళూరు వేదికగా ఐక్యతను చాటే ప్రయత్నం చేశాయి. ప్రత్యామ్నయం తామేనంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాయి. ఇండియా పేరుతో కూటమి కట్టి ఐక్యతా రాగం చాటుతున్నా... ఎవరి ఎజెండా వారిదే. బెంగుళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న 26 పార్టీలు హాజరయ్యాయి. కూటమికి ఇండియా అనే పేరు పెట్టి ప్రతిపక్షాల ఐక్యతే ప్రధానం అంటూ ఈ సమావేశం జరిగింది. ప్రస్తుతానికి సీట్ల పంపకాలు, పొత్తులపై స్పష్టత రాకున్నా... తాము ఐక్యంగా ఉన్నామని చాటేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్‌కు కొన్ని రాజకీయపక్షాలు హాజరవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది . అసలు అంతరించిపోతుందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఈ స్థాయిలో మీటింగ్ పెట్టడం ఆ పార్టీ వ్యూహకర్తల సక్సెస్ అని ఒప్పుకోవాల్సిందే. ప్రాంతీయ పార్టీల ఆశలు వారి ఎత్తుగడలను తనకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఇటీవల హిమాచల్, కర్ణాటక ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పెద్దన్న పాత్రకు తానే కరెక్టు అంటూ సిగ్నల్ ఇచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఎవరికి కావాల్సింది వారికి చేస్తూ కూటమికి అంకురార్పణ చేసింది. (ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..) ఇక ఎప్పటినుంచో ప్రధాని కావాలనుకుంటున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కూటమికి ముందు నుంచి సిద్ధంగానే ఉన్నారు. ఆయన బీహార్ రాజధాని పాట్నాలో ప్రతిపక్షాల తొలి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అవసరమైతే మేము నాయకత్వ బాధ్యతలు వదులుకోడానికి సిద్ధంగా ఉన్నామని ఆశ్చర్యకరంగా కాంగ్రెస్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక తానే ప్రధాని అభ్యర్ధి అని నితీష్ నిర్ధారించుకున్నారు. నితీష్‌ను కేంద్రానికి పంపి తన కొడుకు తేజస్విని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్న లాలుకు పూర్తి అనుకూలమైన పరిస్థితి. అయితే ఎన్నికల ముందు ప్రధాని అభ్యర్ధిగా నితీష్‌ను ప్రొజెక్ట్ చేయడాన్ని కాంగ్రెస్ అంగీకరించే పరిస్థితిలేదు. అయినా తాత్కాలికంగా నితీష్‌ను ఊహల్లో ఉంచాలనేది కాంగ్రెస్-లాలు ఆలోచన. అందుకే బీహార్‌లో బీజేపి వ్యతిరేక పార్టీలన్నీ ఇప్పుడు కూటమిగా ఒక్కతాటిపైకి వచ్చాయి. -ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ (బీఆర్ఎస్కు భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్యే) -
విపక్షాల కూటమికి నాయకుడు ఎవరు..? తేల్చేది ఎవరు..? పెదవి విప్పిన ఖర్గే..
బెంగళూరు: బెంగళూరు వేదికగా నిర్వహించిన విపక్షాల సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. కూటమి పేరుతో సహా.. పలు రాష్ట్రాల్లో పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బెంగళూరు వేదికగా జరిగిన ప్రతిపక్షాల భేటీ అనంతరం మీడియా సమావేశంలో ఖర్గే మాట్లాడారు. కూటమికి సంబంధించి ఎవరు నాయకత్వం వహిస్తారనే అంశాలను చర్చించడానికి ముంబయి వేదికగా మరోసారి విపక్ష పార్టీలు సమావేశమవుతాయని ఖర్గే చెప్పారు. కూటమికి నాయకుడు ఎవరనే అంశాన్ని తేల్చే వ్యవహారంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్.. ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తేల్చుతారని చెప్పారు. ఇవి చాలా చిన్న విషయాలని ఆయన అన్నారు. నేడు బెంగళూరులో జరిగిన భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డిమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ఇదీ చదవండి: Opposition Meeting Live Updates: ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే.. -
ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..
బెంగళూరు: బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు నేడు రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. భేటీలో కీలక అంశాలు ఇవే.. ► 'ఎన్డీయే, బీజేపీ.. మా 'ఇండియా' కూటమిని ఛాలెంజ్ చేస్తారా..?' అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 'మాతృభూమిని ప్రేమిస్తాం.. దేశాన్ని ప్రేమిస్తున్న నిజమైన దేశభక్తులం మేము. హిందువులు, దళితులు, మైనారిటీలు, రైతులు, బెంగాల్, మణిపూర్‌కు బీజేపీతో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వాలను కొనడం.. అమ్మడమే వారి పని' అని బీజేపీని మమతా బెనర్జీ విమర్శించారు. ► విపక్షాల భేటీ మరో సమావేశం ముంబయిలో నిర్వహించనున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ► కూటమికి నాయకుడు ఎవరనే అంశంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తెల్చుతారని చెప్పారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్షాల భేటీ అనంతరం ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. ► బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ఐఎన్‌డిఐఏ ఉద్దేశం ఐక్యంగా పోరాడటమే అని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ► ప్రతిపక్ష భేటీలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకూటమి విజయం సాధించాక పీఎం పదవికి తమకు ఆసక్తి లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ► బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిపక్షాల భేటీలో మొదటి రోజు నిన్న ముగిసింది. అయితే.. ఈ మహాకూటమి తరపున ప్రధాన మంత్రి పేరును యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కన్వినర్ నితీష్ కుమార్ సూచించనున్నట్లు సమాచారం. ► భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా నేడు సమావేశంలో పాల్గొననున్నారు. ► నిన్న సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ పక్క పక్కనే కూర్చున్నారు. దేశ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించుకున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు. ► ప్రతిపక్షాల రెండో సమావేశాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించాక, అదే స్థలంలో దేశ రాజకీయాల్లోనూ విజయాన్ని కాంక్షిస్తూ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: ప్రతిపక్ష భేటీ: బీజేపీకి పోటీగా మహాకూటమి పేరు ఇదే..! -
ప్రధాని పదవిపై ఆసక్తి లేదు.. ఖర్గే కీలక వ్యాఖ్యలు..
బెంగుళూరు వేదికగా మంగళవారం రెండో రోజు విపక్షాల ఐక్యత భేటీ జరిగింది. 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా 26 ప్రతిపక్ష పార్టీలు, అగ్ర నేతలు హాజరయ్యారు. సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణ, తదితరాలపై కూటమి కీలక చర్చలు జరిపారు. ఈ క్రమంలో విపక్షాల భేటీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని ఖర్గే స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారం కోసం పాకులాడటం లేదని, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలు, సామాజిక న్యాయాన్ని కాపాడేందుకే తామంతా కలిశామని ఖర్గే పేర్కొన్నారు. చదవండి: విపక్షాల భేటీ.. మహాకూటమి పేరు ఇదే..! ‘కాంగ్రెస్‌కు అధికారం లేదా ప్రధాని పదవిపై ఆసక్తి లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే చెన్నైలో స్టాలిన్ బర్త్‌డే సందర్భంగా చెప్పాను. ఆ వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రస్తుతం ఈ భేటీలో 26 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. బీజేపీ స్వయంగా 303 స్థానాల్లో గెలుపొందలేదు. అధికారంలోకి వచ్చేందుకు మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకున్న కాషాయ పార్టీ.. ఆ తర్వాత వారిని విస్మరించింది’ అని ఖర్గే మండిపడ్డారు. మరోపక్క విపక్షాల భేటీకి దీటుగా ఎన్డీయే మంగళవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఏకంగా 38 మిత్రపక్షాలతో కలిసి మెగా పోటీ భేటీ తలపెట్టింది. ఈ సమావేశంలో ఎల్జేపీ, హిందూస్తానీ అవామ్ మోర్చా వంటి కొత్త పార్టీలు పాల్గొంంటాయని ఇప్పటికే బీజేపీ వెల్లడించింది. అతి కీలకమైన 2024 లోక్‌సభ ఎన్నికల ముందు ఇక హస్తిన, బెంగళూరు వేదికలుగా జరగుతున్న అధికార, విపక్ష కూటముల పోటాపోటీ భేటీల మీదే ఇప్పుడిక అందరి కళ్లూ నిలిచాయి. -
విపక్ష కూటమిపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు
-
అందుకే అంతా బెంగళూరు చేరారు: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: బెంగళూరులో విపక్ష కూటమి సమావేశం జరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు విసిరారు. పోర్ట్ బ్లెయిర్‌లో వీరసావర్కర్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్‌ను మంగళవారం వర్చువల్‌గా ఢిల్లీ నుంచే ప్రారంభించిన ఆయన.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేశాయి. ప్రతీకార రాజకీయాలకు పాల్పపడ్డాయి. కానీ, యూపీఏ హయాంలో జరిగిన తప్పులను మేం సరిదిద్దాం. అందుకే ఈ తొమ్మిదేళ్లలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది అని తెలిపారాయన. సొంత లాభాల కోసమే విపక్షాలు పని చేస్తున్నాయన్న ప్రధాని మోదీ.. గతంలో వాళ్లు గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి అనే మాటెత్తకుండా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నాయంటూ విపక్షాల కూటమిపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అని ఉంటుంది. కానీ, కుటుంబ రాజకీయాలను ప్రొత్సహించే పార్టీల్లో.. కుటుంబాల కోసమే, కుటుంబాల చేత, కుటంబాల కొరకే అని ఉంటుంది. దేశం కోసం వాళ్లేం చెయ్యరు. అందుకే విద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు ఉంటాయి. కేవలం వాళ్ల కుటుంబాలే ఎదగాలనుకుంటున్నాయి. పేదల గురించి ఎలాంటి ఆలోచనలు చెయ్యరు అంటూ విపక్షాలపై మండిపడ్డారు. దేశ ప్రజలు మమ్మల్ని 2024 అధికారంలోకి మళ్లీ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకే బెంగళూరు చేరి.. వాళ్లు(విపక్షాలను ఉద్దేశించి) తమ దుకాణాలు తెర్చుకున్నారు. 24 కే లియే 26 హోనే వాలే రాజనైతిక్ దలోన్ పర్ యే బడా ఫిట్ బైత్'తా హై అంటూ పాటలు పాడుతున్నారు. కానీ, వాస్తవం మరోలా ఉంది. వాళ్ల దుకాణాల వద్ద కులతత్వం అనే విషం, అపారమైన అవినీతి అనే హామీలే ఉంటాయి అని ఎద్దేవా చేశారాయన. #WATCH | Delhi: PM Narendra Modi takes a jibe at the Opposition; says, "In democracy, it is of the people, by the people and for the people. But for the dynastic political parties, it is of the family, by the family and for the family. Family first, nation nothing. This is their… pic.twitter.com/4xNzzDQxQq — ANI (@ANI) July 18, 2023 -
'జాతీయ సంక్షేమమే అజెండా'.. ముగిసిన ప్రతిపక్ష పార్టీల భేటీ..
బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం ముగిసింది. సాంఘీక న్యాయం, సమ్మిళిత వృద్ధి, జాతీయ సంక్షేమమే అజెండాగా పనిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఒకే భావాజాలం కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే ధ్యేయం కోసం పోరాడతామని అన్నారు. డిన్నర్ మీటింగ్ అనంతరం ఈ మేరకు మీడియాకు తెలిపారు. "Like-minded opposition parties shall closely work together to foster an agenda of social justice, inclusive development and national welfare," says Congress President Mallikarjun Kharge after Opposition leaders' dinner meeting in Bengaluru. pic.twitter.com/H27D4nL1iU — ANI (@ANI) July 17, 2023 బెంగళూరులో జరుగుతున్న ప్రతిపక్ష కూటమి భేటీలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్ అనంతరం హోటల్ నుంచి బయటకు వస్తున్నారు. Opposition leaders' dinner meeting concludes in Karnataka's Bengaluru; Opposition leaders leave the meeting venue pic.twitter.com/FijRJO4ANl — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష పార్టీలు నేడు బెంగళూరులో సమావేశమయ్యాయి. దాదాపు 24 ప్రతిపక్ష పార్టీల నేతలు డిన్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. Opposition leaders' dinner meeting gets underway in Karnataka's Bengaluru pic.twitter.com/HENPkecg1g — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమికి హాజరవ్వడానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెంగళూరు వెళ్లారు. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆయన్ను ఆహ్వానించారు. #WATCH | Delhi CM Arvind Kejriwal along with AAP MP Sanjay Singh arrives at the venue of the Opposition meeting in Bengaluru, received by Karnataka CM & Congress leader Siddaramaiah, deputy CM DK Shivakumar and party leader KC Venugopal, in Bengaluru pic.twitter.com/ResmhdV5rn — ANI (@ANI) July 17, 2023 బీజేపీని ఓడించే లక్ష్యంతో బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్ష భేటీకి బిహార్ సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు బెంగళూరు చేరిన ఆయనకు సిద్దరామయ్య ఆహ్వానం పలికారు. #WATCH | JD(U) leader and Bihar CM Nitish Kumar arrives for Opposition dinner meeting in Bengaluru, Karnataka pic.twitter.com/Fag2a6OK8a — ANI (@ANI) July 17, 2023 ప్రతిపక్ష కూటమి సమావేశంలో హాజరవడానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరు వచ్చారు. ఈ మేరకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య .. వారిని ఆహ్వానించారు. Sonia Gandhi, Mallikarjun Kharge, Rahul Gandhi arrive at Bengaluru ahead of joint Oppn meeting Read @ANI Story | https://t.co/Vb0wqrGsl0#SoniaGandhi #MallikarjunKharge #RahulGandhi #Bengaluru pic.twitter.com/8f3MaeRTvl — ANI Digital (@ani_digital) July 17, 2023 బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని సమాజ్ వాదీ పార్టీ అధినేత అకిలేష్ యాదవ్ అన్నారు. మూడింటిలో రెండొంతుల మంది ప్రజలు బీజేపీని ఓడించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఈ సారి బీజేపీ కూటమిని చిత్తుగా ఓడిస్తామని అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష కూటమి భేటీకి బెంగళూరు వచ్చారు. #WATCH | Samajwadi Party (SP) chief Akhilesh Yadav, who arrived in Bengaluru today to participate in the joint Opposition meeting, was received by Karnataka Ministers MB Patil and Lakshmi Hebbalkar. (Video: MB Patil) pic.twitter.com/ohxBhot7m2 — ANI (@ANI) July 17, 2023 రెండు రోజులపాటు జరగనున్న ప్రతిపక్ష కూటమి భేటీకి హాజరవడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బెంగళూరుకు వచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడతామని స్పష్టం చేశారు. West Bengal CM and TMC leader Mamata Banerjee and party MP Abhishek Banerjee arrived in Bengaluru for the two-day joint Opposition meeting. Karnataka Deputy CM DK Shivakumar received them. (Pics: Karnataka Pradesh Congress Committee) pic.twitter.com/3VXQG45kCc — ANI (@ANI) July 17, 2023 #WATCH | West Bengal CM and TMC leader Mamata Banerjee arrives in Bengaluru for the two-day joint Opposition meeting. pic.twitter.com/qXmrEtV7uw — ANI (@ANI) July 17, 2023 అర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లు పాట్నా నుంచి బెంగళూరుకు బయలుదేరారు. #WATCH | RJD chief Lalu Prasad Yadav and party leader-Bihar Deputy CM Tejashwi Yadav leave from Patna. They will participate in the joint Opposition meeting in Bengaluru. pic.twitter.com/cmHOhJWMgR — ANI (@ANI) July 17, 2023 బెంగళూరు వేదికగా ప్రతిపక్ష పార్టీల భేటీ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటేకే కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగళూరుకు చేరారు. కాగా.. బెంగళూరులోని తాజ్ హోటల్లో వీరు సమావేశం కానున్నారు. #WATCH | Congress president Mallikarjun Kharge and Congress Parliamentary Party Chairperson Sonia Gandhi arrive in Bengaluru for the joint opposition meeting which will have the participation of 26 like-minded parties. pic.twitter.com/OogxvHsDnK — ANI (@ANI) July 17, 2023 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ప్రతిపక్ష కూటమి అజెండాను చర్చించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. 2024 ఎన్నికల కోసం కూటమిని నడిపించడానికి ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కూటమికి కొత్త పేరును సూచించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష కూటమికి ఏం పేరు పెట్టనున్నారనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు హజరుకానున్నారు. ఇదీ చదవండి: విపక్షాల సభకు పవార్ వస్తాడా? రాడా? ఇదీ క్లారిటీ.. -
విపక్షాల సభకు పవార్ వస్తారా? రారా? ఇదీ క్లారిటీ..
బెంగళూరు: బెంగళూరు వేదికగా నేటి నుంచి ప్రారంభమైన ప్రతిపక్షాల సమావేశానికి ఎస్పీపీ అధినేత శరద్ పవార్ గైర్హాజరు కానున్నాడని ఊహాగానాలు వచ్చిన వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే క్లారిటీ ఇచ్చారు. శరద్ పవార్ రేపు(మంగళవారం) మీటింగ్‌కు హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు. శరద్ పవార్‌తో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రతిపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరు కాట్లేదనే పుకార్లను కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఖండించారు. ప్రతిపక్షాల సమావేశం అధికారికంగా మంగళవారం(జులై 18)నే జరగనుందని తెలిపారు. జులై 17 (సోమవారం) కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆతిథ్యమిస్తున్న డిన్నర్‌కు మాత్రమే హాజరవుతామని వెల్లడించారు. 'మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమవనున్న నేపథ్యంలో శరద్ పవార్ తప్పనిసరిగా ఉండాల్సిన అవరసరం ఏర్పడింది. రేపు తప్పకుండా ప్రతిపక్షాల సమావేశానికి హజరవుతారు. భేటీకి రావాల్సిందిగా శరద్ పవార్‌ను కోరాను' అని ఖర్గే తెలిపారు. ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు.. శరద్ పవార్ తప్పకుండా హాజరవుతారని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల భేటీలో ఎలాంటి సమస్యలు లేవని ఖర్గే వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, నితీష్ కుమార్, తేజశ్వీ యాదవ్, స్టాలిన్ సహా పలువురు ముఖ్య నేతలు తప్పకుండా హజరవుతారని ఖర్దే తెలిపారు. పాట్నా భేటీలో హాజరైన నేతల కంటే ఎక్కువ మంది నేతలు బెంగళూరు సమావేశానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో బేజీపీని ఓడించడమే లక్ష్యంగా దాదాపు 26 ప్రతిపక్ష పార్టీల నేతలు ఏకమవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి రెండు రోజుల పాటు బెంగళూరులో భేటీ కానున్నారు. మంగళవారం అధికారికంగా సమావేశం జరగనుంది. కామన్ మనిమమ్ ప్రోగ్రామ్‌తో సహా పలు ప్రణాళికలను రచించనున్నారు. ఇదీ చదవండి: ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చెయ్యను: శరద్ పవార్ -
విపక్షాల భేటీకి సోనియా గాంధీ!..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ నెల 17, 18న జరిగే ప్రతిపక్షాల కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సైతం హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోమవారం చెప్పారు. ఈ భేటీలో పాల్గొనాలని సోనియాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారని తెలిపారు. దీనిపై సోనియా సానుకూలంగా స్పందించినట్లు,ఆమె రాబోతున్నట్లు తమకు సమాచారం అందిందని అన్నారు. అలాగే, రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేసినందుకు నిరసనగా ఈ నెల 12న ఇక్కడి ఫ్రీడమ్ పార్క్ వద్ద మౌన దీక్ష చేపట్టనున్నట్లు డీకే శివకుమార్ తెలిపారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు విపక్షాలన్నీ ఒక్కటి కావాలని సూచించారు. దేశంలో మార్పు కోసం జరుగుతున్న మహా యుద్ధంలో పాల్గొనేందుకు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తొలి సమావేశం జూన్ 23న బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: ఉత్తరాది అతలాకుతలం.. ప్రమాదస్థాయికి చేరుకున్న యమున -
సిమ్లా కాదు బెంగళూరు
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీలు రెండో విడతగా బెంగళూరులో సమావేశం కానున్నాయి. తొలుత సిమ్లాలో భేటీ నిర్వహించాలని భావించినప్పటికీ వేదికను బెంగళూరుకి మార్చారు. జులై 13, 14 తేదీలలో విపక్షాల భేటీ ఉంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వెల్లడించారు. పట్నాలో జరిగిన తొలి సమావేశంలో 17 పార్టీలు కలసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సారి సమావేశంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఉమ్మడి ఎజెండా, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన శరద్ పవార్ పట్నా సమావేశం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలో అసహనం పెరిగిపోయిందని ఆరోపించారు. ఉమ్మడి పౌరస్మృతి మన దేశానికి అవసరమని ప్రధాని వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో యూసీసీపై తమ పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. వివిధ వర్గాలు, మత సంస్థలతో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు. యూసీసీ కంటే ముందు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని పవార్ డిమాండ్ చేశారు. -
'ప్రతిపక్షాల భేటీ ఓ ఫొటో సెషన్..' కేంద్ర మంత్రి వ్యంగ్యాస్త్రాలు..
ఢిల్లీ: ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ సమావేశం కేవలం ఒక ఫొటో సెషన్ మాత్రమేనని అన్నారు. చాయ్ పార్టీ జరుపుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఒక చోట కూడారని చెప్పారు. ఈ సమావేశంతో ప్రతిపక్ష నాయకులు చేయగలిగేది ఏం ఉండదని జోస్యం చెప్పారు. గడ్డం కత్తిరించి, పెళ్లి చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీకి సమావేశంలో సలహా ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు. VIDEO | "This was actually a photo session. The first photo session was conducted by (Telangana CM) KCR in Bihar with Nitish Kumar a few months ago," says Union Minister Giriraj Singh on Patna opposition meeting.#OppositionMeeting pic.twitter.com/CPunJ1a50m — Press Trust of India (@PTI_News) June 24, 2023 'ఇది కేవలం ఓ ఫొటో సెషన్ మాత్రమే. నితీష్ కుమార్‌తో కొన్ని నెలల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఇది జరిగింది. చిన్న చిన్న గుంపులు కలిసి ప్రధాని పదవిపై కలలు కంటున్నాయి. వీటితో ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.' అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఇందులో ఎలాంటి ఏకాభిప్రాయానికి నాయకులు రాలేదు. మరో సమావేశాన్ని సిమ్లాలో వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ.. -
'చరిత్రను రక్షిస్తాం..' ప్రతిపక్షాల భేటీ తర్వాత మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
పట్నా: ఐక్యంగా ఉన్నాం.. ఐక్యంగా పోరాడతామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పట్నాలో ప్రతిపక్షాల భేటీ అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ.. ఈ సమావేశం నుంచే కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. చరిత్రను మారుస్తామని బీజేపీ చెబుతోంది.. కానీ దేశ చరిత్రను బిహార్ సమావేశం నుంచే కాపాడతామని మమత అన్నారు. జాత్యంహకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే తమ ప్రధాన ధ్యేయమని ఆమె చెప్పారు. 1974 తర్వాత ఇదే.. దేశంలో ఇందిరా గాంధీ విధానాలకు వ్యతిరేకంగా 1974లో పట్నాలో జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో మొదటిసారి ప్రతిపక్షాల భేటీ జరిగింది. ఇన్నాళ్ల తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ అదే వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రతిపక్షాలు సమావేశం ఏర్పరచడం గమనార్హం. ప్రజాస్వామ్యాన్ని చంపేశారు.. విధ్వంసం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతిపక్షాలు భేటీ అయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) లీడర్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో ప్రధాని మోదీ వివరించిన ప్రజాస్వామ్యం కశ్మీర్లో ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. కశ్మీర్ నుంచి తాను, మెహబూబా ముఫ్తీ హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. జులైలో మరోసారి.. నేడు జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మరోసారి భేటీ కానున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన అజెండాను చర్చిస్తామని చెప్పారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం.. -
ప్రతిపక్షాల భేటీపై ఓవైసీ విసుర్లు.. ఆ నాయకుల చరిత్రేంటో తెలియదా?
ప్రతిపక్షాల భేటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్ధీన్ ఓవైసీ. ఈ సమావేశానికి హాజరైన నాయకుల చరిత్ర ఏంటో తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందనేది సత్యం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీని గద్దె దింపడానికి ఐక్యమత్యంగా పోరాడటం సరైన విధమే అయినప్పటికీ భేటీ జరిగిన ప్రదేశం, నేతృత్వం వహించిన నాయకుల తీరును ఆయన ఆక్షేపించారు. 'నితీష్ చరిత్ర ఎటువంటిది..?' ప్రతిపక్షాలకు నేతృత్వం వహించిన నితీష్ కుమార్ గత ఏడాది వరకూ బీజేపీతో కలిసి మహాఘట్ బంధన్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని పంచుకున్న వ్యక్తేనని ఓవైసీ గుర్తుచేశారు. అధికారం కోసం బీజేపీ నుంచి విడిపోయి.. మళ్లీ కలిసి.. మళ్లీ విడిపోయిన చరిత్ర ఆయనదని అన్నారు. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు రైల్వే మంత్రిగా నితీష్ ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. గుజరాత్లో మారణకాండ జరిగిన కాలంలో బీజేపీతో నితీష్ కలిసి ఉన్నారని ఓవైసీ అన్నారు. 'ఉద్ధవ్, కేజ్రీవాల్ ఎలాంటివారు..?' 'ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన లౌకిక పార్టీనా? బాబ్రీ మజీద్‌ను కూలదోయడం మేము గర్వంగా భావిస్తున్నామని అన్నది ఉద్ధవ్ ఠాక్రే కాదా? రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలపలేదా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు నేతృత్వం వహించేది ఎవరు?' అని ఓవైసీ ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే 540 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఓవేసీ చెప్పారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం.. -
మిషన్ 2024.. పట్నాలో నేడే విపక్షాల సమావేశం
పట్నా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. 20 ప్రతిపక్ష పార్టీలతో పట్నాలో శుక్రవారం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థి ఎవరు వంటి అంశాల జోలికి పోకుండా ప్రజాసమస్యలపై పోరుబాట పట్టేలా వ్యూహరచన చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, హేమంత్ సోరెన్‌లతో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ వంటి అగ్ర నాయకులు హాజరుకానున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తారు. ఈ సమావేశం మొట్టమొదటిది కావడంతో అత్యంత సంక్లిష్టమైన ప్రధాని అభ్యర్థి, సీట్ల సర్దుబాటు వంటి అంశాల జోలికి పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి మోదీపై పోరుబాట పట్టే వ్యూహాలు రచించనున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారమే పట్నాకి చేరుకున్నారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలుసుకున్న ఆమె బీజేపీని తాము ఉమ్మడిగా ఒక కుటుంబంలా ఎదుర్కొంటామన్నారు. ఇలా విపక్ష పార్టీలన్నీ ఏకం కావడం శుభారంభమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఆప్ అల్టిమేటమ్ విపక్ష పార్టీల సమావేశానికి ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల్నిపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో తమకు మద్దతుగా నిలవకపోతే విపక్ష పార్టీల సమావేశాన్ని బహిష్కరిస్తామని అల్టిమేటమ్ ఇచ్చింది. -
విపక్షాల భేటీకి ముందు.. కాంగ్రెస్‌కు ట్విస్ట్ ఇచ్చిన ఆప్
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం మరికొద్ది గంటల్లో విపక్షాల మెగా భేటీ జరగనుంది. ఈ సమయంలో కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ భారీ షాక్ ఇచ్చింది. గురువారం పాట్నాలో నిర్వహించబోయే విపక్షాలు సమావేశంలో తాము పాల్గొనాలంటే కాంగ్రెస్ తమ షరతుకు ఒప్పుకోవాలని ఆప్ అల్టిమేటం జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం జరుపుతున్న పోరుకు మద్దతు ఇవ్వాలని తెలిపింది. ‘వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాకు(ఆప్) తప్పక మద్దతు తెలిపాలి. పార్లమెంటులో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలి. అలా చేయకపోతే మేము గురువారం జరిగే విపక్షాల భేటీని బహిష్కరిస్తాం. అంతేగాక భవిష్యత్తులో జరగబోయే ఏ ప్రతిపక్షాల సమావేశానికి కూడా హాజరుకాము’ అని ఆప్ వర్గాలు తెలిపాయి. కాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ చొరవతో పట్నాలో గురువారం తొలసారి భారీ స్థాయిలో విపక్షాలు ఐక్యత భేటీ జరగనుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించేందుకు అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు దేశంలోని కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్, ఎస్పీ సహా 120 జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ భీటీలో పాల్గొననున్నాయి. సీఎం నితీష్ అధికారిక నివాసంలోని ‘నెక్ సంవాద్ కక్షా’లో 11 గంటలకు ఈ సమావేజం జరగనుంది. ఇప్పటికే బిహార్ సర్కార్ ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమయంలో ఆప్ తీసుకున్న నిర్ణయం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే! ఇక దేశ రాజధాని ఢిల్లీలోని పాలన యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదస్పంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రం చర్యను ఢిల్లీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమించి మరీ రాష్ట్ర హక్కులను కాలరాస్తుందని మండిపడుతోంది. దీనిని పార్లమెంట్లో చట్టం కాకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలను వరుసగా కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. అంతకుముందు.. శుక్రవారం జరగనున్న ప్రతిపక్షాల సమావేశంలో కేంద్ర ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో అన్ని ఇతర రాజకీయ పార్టీలు సైతం కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నిస్తాయని పేర్కొన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ ఇప్పటి వరకు తటస్థంగా ఉంది. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతివ్వాలని కేజ్రీవాల్ ఎప్పుడో కాంగ్రెస్‌ను కోరారు. కానీ పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని మల్లికార్జున్ ఖర్గే దీనిని దాటవేశారు. -
భేటీ సజావుగా సాగుతుందంటరా సార్!
ముఖ్యమైనా విషయమే ముఖ్యం కాదంటున్నాడు.. భేటీ సజావుగా సాగుతుందంటరా సార్! -
12న పట్నాలో విపక్షాల కీలక భేటీ!
పట్నా/కోల్‌కతా: కేంద్రంలో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) అగ్రనేత నితీశ్ కుమార్ తన కార్యాచరణను వేగవంతంగా చేశారు. తమతో కలిసివచ్చే పార్టీల ముఖ్యనాయకులతో రాజధాని పట్నాలో కీలక భేటీ నిర్వహించాలని ఆయన ఇప్పటికే నిర్ణయించారు. ప్రతిపక్షాల సమావేశం వచ్చే నెల 12న జరిగే అవకాశం ఉందని నితీశ్ కుమార్‌కు సన్నిహితుడైన బిహార్ మంత్రి విజయ్‌కుమార్ చౌదరి సోమవారం చెప్పారు. భేటీ తేదీ దాదాపు ఖరారైనట్లేనని అన్నారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ హాజరవుతాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పనిచేస్తే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించడం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. విపక్ష కూటమి ఏర్పాటుకు నితీశ్ కుమార్ చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. హాజరుకానున్న మమతా బెనర్జీ ఈ భేటీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత హాజరయ్యే అవకాశం ఉందని టీఎంసీ నేత చెప్పారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటుతోపాటు బీజేపీ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఆమె సలహాలు సూచనలు ఇస్తారని వెల్లడించారు. పట్నాలో ప్రతిపక్షాల కీలక సమావేశం ఏర్పాటు చేయాలన్న సూచన తొలుత మమత నుంచి రావడం విశేషం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట తాము ఆ పార్టీకే మద్దతు ఇస్తామని మమత గతంలో అన్నారు. -
రాష్రపతి ఎన్నికలపై విపక్షాల సమావేశం
-
పార్లమెంట్లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు
కోల్‌కతా: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో సమన్వయం చేసుకోవడంపై తమకు ఆసక్తి లేదని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) స్పష్టం చేసింది. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఇతర పక్షాలకు సహకారం అందిస్తామని వెల్లడించింది. కాంగ్రెస్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల 29న నిర్వహించనున్న ప్రతిపక్షాల భేటీకి తాము హాజరుకాబోమని పేరు వెల్లడించడానికి ఇష్టపడని టీఎంసీ సీనియర్ నాయకుడొకరు శనివారం చెప్పారు. కాంగ్రెస్ ముందు అంతర్గతంగా సమన్వయం చేసుకోవాలని, సొంత ఇంటిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. ఈ తర్వాతే ఇతర పార్టీలతో సమన్వయంపై ఆలోచించాలని సూచించారు. అధికార బీజేపీని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ నేతల్లో అంకితభావం కనిపించడం లేదని తప్పుపట్టారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతింటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అసమర్థ పార్టీ అని తృణమూల్ ఆరోపిస్తోంది. బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శిస్తోంది. -
సఫాయన్నా నీకు సలాం అన్న: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 'సఫాయన్న నీకు సలాం అన్న .. అనే నినాదం నాది. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ. ఎవరూ డిమాండ్ చేయకున్నా ప్రతీసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుకుంటూ వస్తున్నాం’ అంటూ ప్రగతిభవన్‌లో ఆదివారం జరిగిన అఖిలపక్ష భేటీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సఫాయి కార్మికులకు ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాల రూపకల్పన విధానం (పీఆర్సీ తరహాలో) అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. అఖిల పక్ష భేటీలో ఆయన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలన్నారు. ఈ సందర్భంగా లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను దేనికదిగా సిద్ధం చేసుకోవాలన్నారు. 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సమష్టి కార్యాచరణ అందరం కలిసి చేపట్టాలని అఖిల పక్ష నేతలతో కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రాజెక్టులు తదితర ప్రజావసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టాభూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లిస్తుందని ఈ సందర్భంగా కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత్ ఎంపవర్మెంట్ పథకం కోసం ఈ బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించామని తెలిపారు. ఎటువంటి బ్యాంక్ గారెంటీ జంజాటం లేకుండానే ఈ పథకం ద్వారా దళితులకు సహకారం అందిస్తామన్నారు. అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచంలో, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలన్నారు. అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. చదవండి: సీఎం దళిత్ ఎంపవర్మెంట్కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం: కేసీఆర్ -
డర్టీ పాలిటిక్స్.. విపక్షాల భేటీకి మమత దూరం
కోల్కత్తా : ఢిల్లీలో జనవరి 13న జరగనున్న విపక్షాల భేటీకి తను దూరంగా ఉండనున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. సీఏఏపై ఒంటరిగానే పోరు చేయనున్నట్లు తెలిపారు. బుధవారం జరిగిన భారత్ బంద్‌లో భాగంగా కాంగ్రెస్‌తోపాటు లెఫ్ట్ పార్టీలు బెంగాల్లో తమ ప్రభుత్వంపై దాడి చేయడంపై మమత ఆగ్రహంగా ఉన్నారు. బంద్ సందర్భంగా బెంగాల్లో జరిగిన హింసపై మమత తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ద్వంద వైఖరిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మమత గురువారం మాట్లాడుతూ.. ‘జనవరి 13న సోనియా గాంధీ పిలుపు మేరకు జరిగే విపక్షాల భేటీని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే బుధవారం బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పాల్పడిన హింసకు నేను మద్దతు తెలుపలేను’ అని పేర్కొన్నారు. మరోవైపు లెఫ్ట్ పార్టీలతోపాటు ప్రతిపక్షాలు మాత్రం తమ పార్టీలకు చెందిన నాయకులను ఇబ్బంది పెట్టేందుకే టీఎంసీ హింసను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఒకవేళ మమత కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తే.. బెంగాల్‌కు వచ్చేసరికి ఆ పార్టీలే ఆమెకు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది చాలా కాలంగా మమతను ఇబ్బంది పెడుతున్న విషయం. కాగా, యూనివర్సిటీలలో జరుగుతన్న హింసతోపాటు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న ఆందోళనలపై చర్చించడానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ విపక్షాల భేటీకి పిలుపునిచ్చారు. సోనియా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశాన్ని విజయవంతరం చేయడానికి సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఈ భేటీకి సంబంధించి సోనియా ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో మాట్లాడారు. చదవండి : భారత్ బంద్.. లెఫ్ట్ పార్టీలపై మమత ఫైర్ -
బీజేపీపై ఉమ్మడి పోరాటం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు వ్యతిరేకంగా కూటమి కట్టాలని 21 విపక్ష పార్టీలు నిర్ణయించాయి. ఎన్డీఏయేతర పార్టీలకు చెందిన అగ్ర నాయకులు సోమవారం ఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో సమావేశమై ఉమ్మడి వ్యూహ రచనపై మంతనాలు జరిపారు. రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, సీబీఐ, న్యాయ వ్యవస్థలో వెలుగుచూసిన అసాధారణ పరిణామాలు, నోట్లరద్దు ప్రభావాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. బీఎస్పీ, ఎస్పీ మినహా దాదాపు అన్ని ప్రధాన పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. బీజేపీ హయాంలో ఆర్బీఐ, సీబీఐ లాంటి సంస్థలపై దాడి జరుగుతోందని ప్రతిపక్షాలు మూకుమ్మడిగా ఆరోపించాయి. రాష్ట్రాల వారీ పొత్తులే నయం.. బీజేపీ వ్యతిరేక ఓట్లను కూటగట్టడానికి రాష్ట్రాల వారీగా పొత్తులు పెట్టుకోవడం మేలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా ఈ ఆలోచనకు మద్దతు పలికినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏ క్షణమైనా తమ వైఖరిని మార్చుకునే బీఎస్పీ, ఎస్పీలు ఈ సమావేశానికి హాజరుకాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. 80 సీట్లున్న యూపీకి చెందిన ఈ పార్టీలు లేకుండా ఎన్డీయేకు ధీటుగా కూటమి ఏర్పాటుచేయడం అసాధ్యం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ప్రధాని దేవెగౌడ, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతా రాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. వినాశన యత్నాల్ని అడ్డుకుంటాం ఆర్బీఐ లాంటి సంస్థలను నాశనం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల్ని నిలువరించా లని విపక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడంతో దేశంలో ఆర్థి క అత్యవసర పరిస్థితి ప్రారంభమైందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్ ఇలా ఉన్నపళంగా ఎప్పుడూ రాజీనామా చేయలేదని, తాజా పరిణామం తనను షాక్‌కు గురిచేసిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని పరిరక్షించడానికే విపక్షాలన్నీ చేతులు కలిపాయని, ఈ సమావేశం చారిత్రకమని చంద్రబాబు చెప్పారు. -
చంద్రబాబుకు షాకిచ్చిన అఖిలేశ్, మయావతి
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకతాటిపైకి వస్తాయని ఆశించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం ఢిల్లీలో జరిగిన విపక్షాల సమావేశానికి యూపీలో బలమైన నేతలు అఖిలేశ్, ములాయం సింగ్ యాదవ్, మయావతిలు డుమ్మా కొట్టారు. తొలి నుంచి తనవల్లే విపక్షాలు ఏకమవుతన్నాయని అనుకూల మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్న చంద్రబాబుకు జాతీయస్థాయిలో ఏపాటి స్థానం ఉందో ఈ సంఘటనతో తెటతెల్లమయిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్లి పిలిచినా కూడా మయావతి, అఖిలేశ్‌లు ఆయన విజ్ఞప్తికి స్పందించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మోదీని ఎదుర్కొవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష పార్టీలు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ లెక్కన అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న యూపీలో విపక్షాల సాధించే స్థానాలు కీలకం కానున్నాయి. కానీ అక్కడ ప్రధాన పార్టీలుగా ఉన్న బీఎస్పీ, ఎస్పీలు నేడు జరిగిన సమావేశానికి దూరంగా జరగడంతో.. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఉత్తర భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కూడా బీఎస్పీ కొంతమేర ఓటు బ్యాంక్ కలిగి ఉంది. సమావేశానికి హాజరైన బీజేపీయేతర పార్టీలు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరిగిన విపక్షాల సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 14 బీజేపీయేతర పార్టీల నాయకులు హాజరయ్యారు. బీజేపీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగంపై వీరు చర్చించుకున్నారు. పార్లమెంట్ లోపల, బయట కలిసి పనిచేయాలనే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీని గద్దెదించేందుకు ఉమ్మడి కార్యచరణతో ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశానికి గైర్హాజరు అయిన ఎస్పీ, బీఎస్పీలు తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి హాజరైన నేతలు: 1. గులాం నబీ ఆజాద్ 2. అహ్మద్ పటేల్ 3. రాహుల్ గాంధీ 4. బద్రుద్దిన్ అజ్మల్ (ఏఐడీయూఎఫ్) 5. సీతారాం ఏచూరి (సీపీఎం) 6. చంద్రబాబు నాయుడు 7. ఫరూక్ అబ్దుల్లా 8. ప్రఫుల్ పటేల్ 9. శరద్ పవార్ 10. శరద్ యాదవ్ 11. అశోక్ గెహ్లాట్ 12. కనిమొజి 13. స్టాలిన్ 14. మమతా బెనర్జీ 15. అరవింద్ కేజ్రీవాల్ 16. తేజస్వి యాదవ్ 17. సంజయ్ సింగ్ 18. ఎకే ఆంథోనీ 19. హెచ్డీ దేవేగౌడ 20. మన్మోహాన్ సింగ్ 21. డి రాజా 22. ఎలంగోవన్ (డీఎంకే) 23. జితేన్ రామ్ మాంఝీ 24. హేమన్ సోరెన్ 25. మజిద్ మేమోన్ -
ఎన్సీపీ కూడా ‘చెయ్యి’స్తుందా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో ఏకమవుతున్న ప్రతిపక్షాల కూటమి నుంచి బీహర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ ఇప్పటికే తప్పుకోగా ఇప్పుడు శరద్ యాదవ్ నాయకత్వంలోని ఎన్సీపీ తప్పుకోనుందని ఊహాగానాలు బయల్దేరాయి. సోనియా గాంధీ నాయకత్వాన శుక్రవారం జరిగిన విపక్షాల సమావేశానికి ఎన్సీనీ హాజరుకాకపోవడమే ఈ ఊహాగానాలకు కారణమైంది. నితీష్ కుమార్ పార్టీ జేడీయూ విపక్షాల కూటమి నుంచి తప్పుకున్న నేపథ్యంలో జరిగినందున ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్రంలో బీజేపీ నేతత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలనే అంశంపై సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా ప్రతిపక్షాల ఐక్యతను చాటేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాంటి సమావేశానికి ఎన్సీపీ రాకపోవడం ఊహాగానాలకు తెరలేపింది. ఇంతకుముందు జరిగిన అన్ని విపక్షాల సమావేశానికి శరద్ పవార్ హాజరయ్యారు. ఈసారి మాత్రం తాను అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నానని కబురు పంపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబోలు అనుకున్నారు. ఇంతలో తాము సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఎన్సీపీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ బహిరంగంగా ప్రకటించడం వారిని ఇరుకున పెట్టింది. ఇటీవల గుజరాత్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ పటేల్‌కు ఓటు వేసినప్పటికీ వేయలేదని కాంగ్రెస్ పార్టీ నమ్ముతున్నందున తాము అసంతప్తితో ఉన్నట్లు ఎన్సీపీ నాయకులు తెలిపారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా బయట మాట్లాడకపోయినా అంతర్గతంగా పార్టీ నాయకులు తమ అనుమానాన్ని ఎన్సీపీ నాయకుల ముందు బయటపెట్టారు. అహ్మద్ పటేల్ ఒక్క ఓటుతో ఆ ఎన్నికల్లో విజయం సాధించిన విషయం తెల్సిందే. జేడీయూ వేయడం వల్ల ఆ ఒక్క ఓటుతో గట్టెక్కామని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కేంద్రంలో, అటూ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ మొదటి నుంచి కలసి కాపురం చేస్తున్నప్పటికీ ఎన్సీపీ పట్ల కాంగ్రెస్‌కు ఎన్నడూ పూర్తి విశ్వాసం లేదు. అందకు కారణం శరద్ పవార్ అన్ని రాజనీయ పార్టీలతో సన్నిహితంగా ఉండడమే. ఎప్పుడు ఎవరి పట్ల ఎలా వ్యవహరిస్తారో ఎవరికి అర్థం కాకపోవడమే. ఆయన రాజకీయ కదలికలు అర్థం కాకపోవడం వల్ల మున్ముందు బీజేపీ–శివసేన కూటమి ప్రభుత్వం నుంచి శివసేన తప్పుకున్న పక్షంలో బీజేపీకి ఎన్సీపీ తప్పకుండా మద్దతిస్తుందన్నది కాంగ్రెస్ విశ్వాసం. 2019 సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష కూటమికి దూరంగా ఉండాల్సిందిగా ఆది నుంచి ఎన్సీపీపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. శరద్ పవార్ సమీప బంధువు అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండడం, అలాగే సీనియర్ ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర విమానయాన శాఖా మంత్రిగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉండడం వల్ల వారు మోదీ ఒత్తిళ్లకు లొంగిపోతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల భావన. కేంద్రంలోని దర్యాప్తు సంస్థల ద్వారా లాలూ ప్రసాద్ నాయకత్వంలోని ఆర్జేడీతో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకునేలా చేసిందీ మోదీయేనని, ఇప్పుడు ఎన్సీపీపై కూడా అలాగే ఒత్తిడి తెస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని విపక్షాల కూటమి నుంచి ఎన్సీపీ కూడా తప్పుకుంటే ఆ కూటమికి పెద్ద నష్టమే. విపక్షాలన్నీ ఎలా కలసికట్టుగా వెళ్లాలో, ప్రభుత్వాన్ని దబ్బెతీసే విధంగా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలో నిర్ణయం తీసుకునేందుకు సోనియా గాంధీ మొన్నటి సమావేశంలో ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ సిఫార్సుల మేరకు తదుపరి కార్యాచరణ ఉండవచ్చు.