'చరిత్రను రక్షిస్తాం..' ప్రతిపక్షాల భేటీ తర్వాత మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు.. | History Should be Saved From Bihar Mamata Banerjee Makes BIG Statement At Patna Opposition Meet | Sakshi
Sakshi News home page

'అదే మా ధ్యేయం..'ప్రతిపక్షాల భేటీ తర్వాత మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

Published Fri, Jun 23 2023 9:25 PM | Last Updated on Fri, Jun 23 2023 9:37 PM

History Should be Saved From Bihar Mamata Banerjee Makes BIG Statement At Patna Opposition Meet - Sakshi

పట‍్నా: ఐక్యంగా ఉన్నాం.. ఐక్యంగా పోరాడతామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. పట్నాలో ప్రతిపక్షాల భేటీ అనంతరం మాట్లాడిన మమతా బెనర్జీ.. ఈ సమావేశం నుంచే కొత్త చరిత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. చరిత్రను మారుస్తామని బీజేపీ చెబుతోంది.. కానీ దేశ చరిత్రను బిహార్‌ సమావేశం నుంచే కాపాడతామని మమత అన్నారు. జాత్యంహకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటమే తమ ప్రధాన ధ‍్యేయమని ఆమె చెప్పారు.

1974 తర్వాత ఇదే..
దేశంలో ఇందిరా గాంధీ విధానాలకు వ్యతిరేకంగా 1974లో పట్నాలో జయప్రకాశ్ నారాయణ నేతృత్వంలో మొదటిసారి ప్రతిపక్షాల భేటీ జరిగింది. ఇన్నాళ్ల తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మళ్లీ అదే వేదికగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నితీష్ కుమార్ అధ్యక్షతన ప్రతిపక్షాలు సమావేశం ఏర్పరచడం గమనార్హం. 

ప్రజాస్వామ్యాన్ని చంపేశారు..
విధ్వంసం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రతిపక్షాలు భేటీ అయ్యాయని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) లీడర్ ఒమర్ అబ్దుల్లా అన్నారు. అమెరికా కాంగ్రెస్‌ సమావేశంలో ప్రధాని మోదీ వివరించిన ప్రజాస్వామ్యం కశ్మీర్‌లో ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. కశ్మీర్‌ నుంచి తాను, మెహబూబా ముఫ్తీ హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. 

జులైలో మరోసారి..
నేడు జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో ఎలాంటి ఏకాభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మరోసారి భేటీ కానున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన అజెండాను చర్చిస్తామని చెప్పారు.   

ప్రతిపక్షాల భేటీ..
పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష‍్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement