సాక్షి, ఢిల్లీ: బెంగళూరులో విపక్ష కూటమి సమావేశం జరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు విసిరారు. పోర్ట్ బ్లెయిర్‌లో వీరసావర్కర్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్‌ను మంగళవారం వర్చువల్‌గా ఢిల్లీ నుంచే ప్రారంభించిన ఆయన.. విపక్షాలపై విరుచుకుపడ్డారు.
కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేశాయి. ప్రతీకార రాజకీయాలకు పాల్పపడ్డాయి. కానీ, యూపీఏ హయాంలో జరిగిన తప్పులను మేం సరిదిద్దాం. అందుకే ఈ తొమ్మిదేళ్లలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది అని తెలిపారాయన. సొంత లాభాల కోసమే విపక్షాలు పని చేస్తున్నాయన్న ప్రధాని మోదీ.. గతంలో వాళ్లు గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి అనే మాటెత్తకుండా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నాయంటూ విపక్షాల కూటమిపై విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అని ఉంటుంది. కానీ, కుటుంబ రాజకీయాలను ప్రొత్సహించే పార్టీల్లో.. కుటుంబాల కోసమే, కుటుంబాల చేత, కుటంబాల కొరకే అని ఉంటుంది. దేశం కోసం వాళ్లేం చెయ్యరు. అందుకే విద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు ఉంటాయి. కేవలం వాళ్ల కుటుంబాలే ఎదగాలనుకుంటున్నాయి. పేదల గురించి ఎలాంటి ఆలోచనలు చెయ్యరు అంటూ విపక్షాలపై మండిపడ్డారు.
దేశ ప్రజలు మమ్మల్ని 2024 అధికారంలోకి మళ్లీ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకే బెంగళూరు చేరి.. వాళ్లు(విపక్షాలను ఉద్దేశించి) తమ దుకాణాలు తెర్చుకున్నారు. 24 కే లియే 26 హోనే వాలే రాజనైతిక్ దలోన్ పర్ యే బడా ఫిట్ బైత్'తా హై అంటూ పాటలు పాడుతున్నారు. కానీ, వాస్తవం మరోలా ఉంది. వాళ్ల దుకాణాల వద్ద కులతత్వం అనే విషం, అపారమైన అవినీతి అనే హామీలే ఉంటాయి అని ఎద్దేవా చేశారాయన.
#WATCH | Delhi: PM Narendra Modi takes a jibe at the Opposition; says, "In democracy, it is of the people, by the people and for the people. But for the dynastic political parties, it is of the family, by the family and for the family. Family first, nation nothing. This is their… pic.twitter.com/4xNzzDQxQq
— ANI (@ANI) July 18, 2023
Comments
Please login to add a commentAdd a comment