family politics
-
ఒకతాటిపైకి పవార్ ఫ్యామిలీ!
పవార్ ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది. కుటుంబ పెద్ద అయిన శరద్ పవార్‌పై 2023, జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పవార్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి శివసేన-బీజేపీ మహాయుతి సర్కారు పంచన చేరి పెద్దాయన పెద్ద షాకే ఇచ్చారు అజిత్ పవార్. అప్పటి నుంచి ఇద్దరు అగ్రనేతల మధ్య రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.కలిసిపోవాలని కోరుకున్నాతాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నూతన సంవత్సరం తొలిరోజు సందర్భంగా బుధవారం పండరీపూర్ శ్రీ విఠల రుక్మిణిమాయిలను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంతరాలు సమసిపోయి పవార్ కుటుంబమంతా ఏకతాటి పైకి వచ్చేలా కటాక్షించాలని విఠలేశుడిని కోరుకున్నట్టు తెలిపారు. ‘పవార్ కుటుంబంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోవాలని.. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుడిని కోరుకున్నాను. నా ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నాన’ని ఆశా పవార్ అన్నారు.పెద్దాయన అంటే చాలా గౌరవంపవార్ ఫ్యామిలీ ఏకతాటిపైకి వస్తే అంతకంటే ఆనందం మరోటి ఉండదని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేక పక్షంలో ఉన్నప్పటికీ పెద్దాయన అంటే అజిత్‌కు చాలా గౌరవం ఉందని తెలిపారు. ‘శరద్ పవార్ మాకు తండ్రి లాంటివారు. భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నప్పటికీ, మేము ఎల్లప్పుడూ ఆయనను గొప్పగా గౌరవిస్తాం. పవార్ కుటుంబం మళ్లీ కలిస్తే చాలా సంతోషిస్తాం. నన్ను నేను పవార్ కుటుంబంలో భాగమని భావిస్తున్నాన’ని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు.అప్పుడు చాలా బాధపడ్డాంఎన్సీపీ మరో సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరద్, అజిత్ పవార్ తిరిగి చేతులు కలిపితే పార్టీకి, కార్యకర్తలకు మేలు జరుగుతుందని అన్నారు. శరద్ పవార్‌ను తాము చాలా గౌరవిస్తామని, పార్టీ చీలిపోయినందుకు బాధపడ్డామని ఆయన తెలిపారు.పెద్దాయనతో అజిత్ భేటీ వెనుక..శరద్, అజిత్ మళ్లీ చేతులు కలుపుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆశా పవార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. మరో సంఘటన కూడా ఈ ప్రచారానికి ఊతంగా నిలిచింది. పార్టీని చీల్చిన తర్వాత తనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పెద్దాయనను అజిత్ గత డిసెంబర్ నెలలో కలవడంతో ఈ ప్రచారం మొదలయింది. పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో ఉన్న శరద్ పవార్‌ను డిసెంబర్ 12న అజిత్ కుటుంబ సమేతంగా కలిశారు. పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే అరగంట పాటు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు నడిచాయని, త్వరలోనే పవార్ ఫ్యామిలీ కలిసిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అజిత్ తోసిపుచ్చారు. కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన రాలేదని వివరణ ఇచ్చారు. చదవండి: ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా? మళ్లీ ఒక్కటవుతారా?ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ భంగపాటు ఎదురైంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అజిత్ సత్తా చాటారు. ఆయన పార్టీకి 41 స్థానాల్లో విజయం సాధించగా, శరద్ పవార్ వర్గానికి కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. మహాయుతి సంకీర్ణ సర్కారులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు రాష్ట్ర కేబినెట్లో మొత్తం 9 మంత్రి పదవులు దక్కించుకుని అజిత్ మరింత పవర్ఫుల్ అయ్యారు. అటు కేంద్రం, అటు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగియడంతో అజిత్, శరద్ మధ్య సయోధ్య వాతావరణం నెలకొంది. అజిత్ కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడంతో పెద్దాయన కాస్త మెత్తబడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అజిత్ తల్లి కూడా పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించడంతో మళ్లీ చర్చ మొదలయింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. -
కుటుంబ రాజకీయాలకు చెక్..!
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్టంలోని మూడు విధానసభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కుటుంబ రాజకీయాలకు కన్నడిగులు చెక్ పెట్టినట్లు అర్థం అవుతోంది. చెన్నపట్టణ, శిగ్గావి నియోజకవర్గాల్లో కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించారు. ఒక్క సండూరులో మాత్రమే ఈ.తుకారాం సతీమణి అన్నపూర్ణకు గెలుపు వరించింది. బీజేపీ అభ్యర్థి బంగార హనుమంతప్పపై ఈమె గెలిచారు. చెన్నపట్టణలో కేంద్ర మంత్రి, జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, శిగ్గావిలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై ఓటమి పాలయ్యారు. హెచ్డీ కుమారస్వామి, డీసీఎం డీకే శివకుమార్‌ల ప్రతిష్టాత్మక పోటీగా నిలిచిన చెన్నపట్టణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమిని సాధించినట్లు అయింది. ఇక్కడ బీజేపీ నుంచి ఎన్నికల ముందు టికెట్ దక్కక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత సీపీ యోగేశ్వర విజయం సాధించారు. జేడీఎస్ పార్టీ కంచుకోట అయిన రామనగర జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన చెన్నపట్టణను కోల్పోవడం ఎన్డీఏను తీవ్రంగా నిరాశ పరిచింది. 2023 విధానసభ ఎన్నికల్లోనూ రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ ఓడిపోయారు. అలాగే 2019 లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, సీనియర్ నటి సుమలతా అంబరీశ్ చేతిలో కూడా నిఖిల్ పరాజయం పొందారు. తాజాగా చెన్నపట్టణలో కూడా ఓటమి పలకరించింది. హేమాహేమీలు ఇక్కడ నిఖిల్ తరపున ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ సత్ఫలితాన్ని పొందలేకపోయారు.భరత్ బొమ్మైకు నిరాశేఅయితే శిగ్గావిలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న మాజీ సీఎం బసవరాజు బొమ్మై కుమారుడు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైకు నిరాశే ఎదురైంది. ఎన్నికల తొలినాళ్లలో తన కుమారుడికి టికెట్ వద్దని చెప్పిన బసవరాజు బొమ్మై ఆ తర్వాత చివరి నిమిషంలో మనసు మా ర్చుకుని టికెట్ ఇప్పించుకున్నారు. ఆలస్యంగా బరిలో దిగడం, ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఎక్కువమంది ఓటర్లను చేరుకోలేకపోయా రు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం భరత్‌కు కష్టంగా మారింది. భరత్ ఓటమికి ఇది కూడా ఒక కారణమే. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్‌ఖాన్ 13వేల ఓట్ల మెజారిటీతో భరత్‌పై గెలిచారు. -
‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’
భోపాల్: వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వీటివల్ల ఒకే కుటుంబం చెప్పుచేతల్లో పార్టీ, ప్రభుత్వం ఉంటాయన్నారు. కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్)వర్గం కుటుంబ రాజకీయాలను నడిపిస్తున్నాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్నారు. వీటివల్లే 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. -
కుటుంబ పాలన.. ‘క్విట్ ఇండియా’
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టేందుకు ‘క్విట్ ఇండియా’ ఉద్యమ స్ఫూర్తితో భారత్ యావత్తూ ముందుకొస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రధాని మోదీ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్షంలోని ఓ వర్గం తాము పనిచెయ్యం, ఇతరులను పనిచెయ్యనివ్వబోమన్న ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది నిజంగా దురదృష్టకరమైన పరిస్థితి అని వాపోయారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధునాతన పార్లమెంట్ భవనం నిర్మించామని, ప్రజాస్వామ్యానికి అదొక చిహ్నమని, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి అది ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. అలాంటి పార్లమెంట్‌ను సైతం విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, అందులోకి అడుగుపెట్టేందుకు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. కర్తవ్యపథ్‌ను అభివృద్ధి చేయడాన్ని కూడా వ్యతిరేకించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పారీ్టలు కేవలం ఎన్నికల సమయంలోనే సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్‌ను స్మరిస్తాయని, తాము గుజరాత్లో అతిపెద్ద విగ్రహం ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. గత 70 ఏళ్లలో మన అమర జవాన్ల కోసం కనీసం యుద్ధ స్మారకాన్ని కూడా నిర్మించలేదని కాంగ్రెస్ పారీ్టపై పరోక్షంగా ధ్వజమెత్తారు. తాము నిర్మిస్తే నిస్సిగ్గుగా బహిరంగంగా విమర్శలు చేశాయని దుయ్యబట్టారు. దేశ ప్రగతికి రెక్కలు తొడుగుతున్న యువత ప్రతికూల రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, ఓటు బ్యాంకు రాజకీయాలను, పార్టీ రాజకీయాలను లెక్కచేయకుండా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రస్తుతం రోజ్‌గార్ మేళా కొనసాగుతోందన్నారు. దేశంలో మార్పు మొదలైందని, దేశ అభివృద్ధితో యువతకు నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వెల్లడించారు. దేశ ప్రగతికి మన యువత కొత్త రెక్కలు తొడుగుతున్నారని ప్రశంసించారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఈ నెల 9న జరిగే ‘క్విట్ ఇండియా’ వార్షికోత్సవాన్ని మోదీ ప్రస్తావించారు. ఇదొక చరిత్రాత్మక దినం అని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇచి్చన రోజు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశమంతా క్విట్ ఇండియా అంటూ బిగ్గరగా నినదిస్తోందని వివరించారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు వంటివి దేశం వదిలి వెళ్లిపోవాలని ఆకాంక్షిస్తోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది లాగే ఈసారి కూడా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సదుపాయాలు పెరగడం, జీవనం సులభతరం కావడంతో దేశంలో పన్నులు చెల్లించేవారి సంఖ్య మరింత పెరిగిందని వివరించారు. ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినవారి సంఖ్య ఈ ఏడాది 16 శాతం పెరిగిందన్నారు. ‘అమృత్‌భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా 508 రైల్వేస్టేషన్ల అభివృద్ది కోసం మోదీ శంకుస్థాపన చేయగా, వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 55, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 18 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. -
విపక్ష కూటమిపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు
-
అందుకే అంతా బెంగళూరు చేరారు: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: బెంగళూరులో విపక్ష కూటమి సమావేశం జరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ విసుర్లు విసిరారు. పోర్ట్ బ్లెయిర్‌లో వీరసావర్కర్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్‌ను మంగళవారం వర్చువల్‌గా ఢిల్లీ నుంచే ప్రారంభించిన ఆయన.. విపక్షాలపై విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేశాయి. ప్రతీకార రాజకీయాలకు పాల్పపడ్డాయి. కానీ, యూపీఏ హయాంలో జరిగిన తప్పులను మేం సరిదిద్దాం. అందుకే ఈ తొమ్మిదేళ్లలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించింది అని తెలిపారాయన. సొంత లాభాల కోసమే విపక్షాలు పని చేస్తున్నాయన్న ప్రధాని మోదీ.. గతంలో వాళ్లు గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి అనే మాటెత్తకుండా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నాయంటూ విపక్షాల కూటమిపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అని ఉంటుంది. కానీ, కుటుంబ రాజకీయాలను ప్రొత్సహించే పార్టీల్లో.. కుటుంబాల కోసమే, కుటుంబాల చేత, కుటంబాల కొరకే అని ఉంటుంది. దేశం కోసం వాళ్లేం చెయ్యరు. అందుకే విద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు ఉంటాయి. కేవలం వాళ్ల కుటుంబాలే ఎదగాలనుకుంటున్నాయి. పేదల గురించి ఎలాంటి ఆలోచనలు చెయ్యరు అంటూ విపక్షాలపై మండిపడ్డారు. దేశ ప్రజలు మమ్మల్ని 2024 అధికారంలోకి మళ్లీ తేవాలని నిర్ణయించుకున్నారు. అందుకే బెంగళూరు చేరి.. వాళ్లు(విపక్షాలను ఉద్దేశించి) తమ దుకాణాలు తెర్చుకున్నారు. 24 కే లియే 26 హోనే వాలే రాజనైతిక్ దలోన్ పర్ యే బడా ఫిట్ బైత్'తా హై అంటూ పాటలు పాడుతున్నారు. కానీ, వాస్తవం మరోలా ఉంది. వాళ్ల దుకాణాల వద్ద కులతత్వం అనే విషం, అపారమైన అవినీతి అనే హామీలే ఉంటాయి అని ఎద్దేవా చేశారాయన. #WATCH | Delhi: PM Narendra Modi takes a jibe at the Opposition; says, "In democracy, it is of the people, by the people and for the people. But for the dynastic political parties, it is of the family, by the family and for the family. Family first, nation nothing. This is their… pic.twitter.com/4xNzzDQxQq — ANI (@ANI) July 18, 2023 -
కేసీఆర్ కుటుంబ రాజకీయాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
భోపాల్: భోపాల్ బహిరంగ సభలో కుటుంబ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై మోదీ విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుమార్తె కవిత బాగుపడాలంటే బీఆర్ఎస్కు ఓటేయండి.. మీ పిల్లల మంచి భవిష్యత్తుకు బీజేపీకి ఓటేయాలని అన్నారు. కవిత లిక్కర్ స్కాం.. ఈడీ రైడ్లను కూడా ఆయన ప్రస్తావించారు. భోపాల్ సభలో కుటుంబ రాజకీయాలను మోదీ మరోసారి తెరమీదకు తెచ్చారు. నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీని ప్రధాని మోదీ విమర్శించారు. 2024 ఎన్నికల్లో భాజపా గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయని ప్రధాని అన్నారు. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు ఉచిత హామీ ఇస్తాయని విమర్శించారు. తాను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నానని మోదీ పేర్కొన్నారు. భాజపాకు కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ చెప్పారు. ప్రతిపక్ష భేటీలో పాల్గొన్న నాయకులందరూ కలిసి 20 లక్షల కోట్ల స్కాంకు పాల్పడినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ఒక్కటే లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ఇదీ చదవండి: మహారాష్ట్ర వేదికగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలకు స్ట్రాంగ్ కౌంటర్ -
నియంతృత్వ రాజకీయాలు అభివృద్ధికి గొడ్డలిపెట్టు
రాజకీయాలను ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేయాల్సిన కొన్ని పార్టీలు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి ‘ఆగర్భ శతృత్వం’తో పని చేస్తున్నాయి. అందులో ఎక్కువగా కుటుంబ పార్టీలు ఉండడం విశేషం. నిస్వార్థ రాజకీయాలు దేశంలోకి వస్తే తమ పీఠాలు కదిలిపోతాయన్న ఆందోళనతో ‘వ్యక్తిత్వ హననం’ చేస్తూ కుటిల రాజకీయా లకు తెరతీశాయి. ఇప్పుడు ఆ వరుసలోకి కేసీఆర్ సారథ్యం లోని టీఆర్ఎస్ అగ్రస్థానం తీసుకున్నది. గత నెల నుండి తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆందో ళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉండే వర్గాలకు కేసీఆర్ నియంతృత్వ, ధన రాజకీయాలు తెలంగాణ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారాయి. రాజ్యాంగబద్ధంగా ఎంపిక చేసిన గవర్నర్‌ను ఒక మహిళ అని కూడా చూడకుండా అడుగడుగునా అవమాన పరుస్తున్న కేసీఆర్ అండ్ కో ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. రోజూ ప్రజాస్వామ్య పాఠాలు వల్లించే కమ్యూని స్టులకు కొత్తగా కేసీఆర్ స్నేహం దొరికింది. సీఎంను మెప్పించడం కొరకు ‘కోతికి కొబ్బరిచిప్ప’ దొరికినట్లుగా గవర్నర్‌పై అవాకులు చవాకులు పేలుతున్నారు. అతి చిన్న వయసులో మంత్రిపదవి కూడా లెక్కపెట్టకుండా ‘న్యాయం కోసం’ రాజీనామా చేసిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్... అక్కడి కమ్యూనిస్టుల దురాగతాలు ఒక్కొక్కటి బయటపెడుతూంటే ఆ అక్కసును కమ్యూనిస్టులు ఇక్కడ వెళ్ళగక్కడం విచిత్రం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు చదువుకొనే విశ్వవిద్యాలయ అధ్యాపకుల నియామక బిల్లు లోని లొసుగులతో ప్రభుత్వ పెద్దలు తప్పు చేసేందుకు అవ కాశం ఉంది. దానికి తగిన సవరణలు చేయాలని గవర్నర్ సూచిస్తే తమ వందిమాగధులలో దుష్ప్రచారం చేయిస్తూ కేసీఆర్ వ్యవస్థకు తీరని ద్రోహం చేస్తున్నారు. ఇప్పటికే అణ గారిన వర్గాలకు చెందిన యువత చదువులపై సమ్మెట దెబ్బలా ఎక్కడా లేనివిధంగా తన అస్మదీయులకు, తస్మదీ యులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టింది. ఎనిమిదేళ్ళలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసింది. కాబట్టి గవర్నర్ పేరు చెప్పి నియామకాలు జరగకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన కామన్ రిక్రూట్ బోర్డు 1953లో పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రిజ ర్వేషన్ల విషయంలో విధిగా పాలించాల్సిన రోస్టర్ పాయింట్లు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క విధంగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ బోర్డు ఏ రోస్టర్ విధానాన్ని పాటించి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నది అనేది ప్రశ్న. ఓవైపు పోడు భూములకు సంబంధించిన పట్టాలు గిరిజనులకు ఇస్తాం అంటూనే, మరోవైపు వాళ్ళపై నిఘా పెట్టండని అటవీ అధి కారులను ఉసిగొల్పి ఓ నిజాయితీ గల ఆఫీసర్ హత్యకు కేసీఆర్ ప్రభుత్వం కారణమైంది. ప్రభుత్వ భూములను అమ్ముతూ, అలా వచ్చిన ఆదా యాన్ని తమ సొంత నియోజకవర్గాలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు తరలించుకు పోతున్నారు. రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు, విద్య, వైద్య వ్యవస్థలు ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్నట్లు తయారయ్యాయి. గవర్నర్ దగ్గర ఎన్నో బిల్లులు ఆగా యని ఓ వైపు చెబుతున్నారు. ముఖ్యమంత్రి తప్పని సరిగా వెళ్ళాల్సిన చోటు రాజ్‌భవన్. కానీ ఆయన ప్రతి దానినీ రాజకీయ కోణంలో చూస్తూ గవర్నర్ ముఖం చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. గ్లోబరీనా టెండర్లను తనవారికి ఇప్పించి ఆ సంస్థ తప్పిదాలతో ఎందరో ఇంటర్ విద్యార్థులు మరణించినా కేసీఆర్ కనికరించలేదు. వాళ్ళ కుటుంబాలకు ఓదార్పు కలి గించలేదు. అలాగే ధరణి పోర్టల్ అనే భూమాయను సృష్టించి రైతులు ఆత్మహత్యలు చేసుకొనేందుకు కారణం అవుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు ఎమ్మా ర్వోలపై పెట్రోల్ దాడులు చేయడం ఈ రాష్ట్రంలోనే చూశాం. చివరికి ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు నిర్వహించే ఆరోగ్య శాఖ వైఫల్యంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు విక టించి మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ఎవరి పాపమో కేసీఆర్ ప్రజలకు చెప్పాలి. గరీబులను వంచించే సరికొత్త ‘గడీ’గా కేసీఆర్ ప్రగతి భవన్‌ను నిర్మించుకొని కుట్రలకు, కుహకాలకు కేంద్రంగా దానిని తయారు చేశారు. బూర నర్సయ్యగౌడ్ లాంటి సీనియర్ నాయకుడు భాజపాలోకి రాగానే బెంబేలెత్తిన కేసీఆర్ మునుగోడులో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో సరిక్రొత్త కుట్ర రాజకీయాలకు తెరతీశారు. ప్రగతి భవన్లో కూర్చొని ‘ఫాంహౌస్ బ్లాక్ బస్టర్ సినిమా’కు స్క్రిప్ట్ రచించారు. అనామకులు ఎవరో ఏదో మాట్లాడుకున్న వీడి యోలకు లేని స్క్రిప్ట్ తయారుచేసి జనం మీదకు వదిలారు. నిఖార్సుగా, నిజాయితీగా రాజకీయం చేసే భాజపాపై బురద చల్లేందుకు సరిక్రొత్త ‘కపట నాటకం’ కేసీఆర్‌కు పనికివచ్చింది. తన ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకు తెలం గాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయంగా ఎదిగిన భాజపాను బూచిగా చూపిస్తూ... సొంతపార్టీ వారిపైనే బ్లాక్ మెయి లింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై, ముఖ్యంగా భాజపాపై ఎదురుదాడికి దిగాలని ప్రగతి భవన్ మీటింగ్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, మంత్రులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయడం తెలంగాణలో జరుగుతున్న దాడుల రాజకీయానికి నాందిగా కనిపిస్తుంది. టీఆర్ఎస్ వాళ్లు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడికి దిగారు. ఇది రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న బాధ్యత గల వ్యక్తులు ఇలాంటి అరాచకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిందిస్థాయి కార్యకర్తల మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయో ఆలోచించవచ్చు. రాష్ట్రంలో శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న ఓ రాజకీయ పార్టీ అధ్యక్షురాలైన శర్మిళను మహిళ అని కూడా చూడకుండా కారుతో సహా అరెస్ట్ చేసిన పోలీసుల అత్యుత్సాహం చూస్తే కేసీఆర్ హయాంలో ఇక్కడి స్వేచ్ఛకున్న హద్దులు బహిర్గత మవుతున్నాయి. కేసీఆర్ నియంతృత్వ ధోరణిని ఈ సంఘ టన బహిర్గతం చేస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ అబద్ధాలు ప్రచారం చేయడంలో గోబెల్స్‌ను మించిపోయారు. దుబ్బాక నుండి మునుగోడు ఎన్నికల వరకు కరెంట్ మీటర్లు కేంద్రం పెట్టబోతోందనీ, అలాగే కేంద్రం రాష్ట్రానికి ‘నయా పైసా’ ఇవ్వలేదనీ రోజూ దుష్ప్రచారం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎంలు వెళ్ళి ఆహ్వానిస్తారు. ఇప్పటికి మూడుసార్లకు పైగా ప్రధాని రాష్ట్రానికి వస్తే సీఎం కేసీఆర్ ఆయనను ఆహ్వా నించకుండా ముఖం చాటేశారు. మునుగోడు ఎన్నికలలో దశాబ్దాలుగా కాంట్రాక్టులు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిపై 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అంటూ దుష్ట ప్రచారానికి తెరలేపారు. మరి మిషన్ భగీరథ, కాకతీయ, సీతారామ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టింది ఎవరు? అందులో కమిషన్ ఎంత ముట్టిందని మాత్రం వీళ్ళను ప్రశ్నించడం ‘సమాఖ్య వ్యవస్థ’పై దాడి అవుతుంది కాబోలు! రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ‘గాడిపసరం’లా కట్టేసి ఇలా ఏ ముఖ్యమంత్రీ వాడలేదు. కానీ రోజూ ‘ఈడీ, సీబీఐ దాడులు’ అని గింజు కుంటారు! ఈ రాష్ట్రంలో ‘జన్మకో శివరాత్రి’లా జరిగే ముఖ్యమంత్రి పర్యటన నాడు ప్రతిపక్షాల నాయకులను, కార్యకర్తలను ‘హౌస్ అరెస్టు’లు చేస్తున్నారు. ఏ సభ, పాదయాత్ర జరుపు కోవాలన్నా హైకోర్టుకు వెళ్ళి అనుమతి తెచ్చుకోవాల్సిన దుఃస్థితి నెలకొన్న కేసీఆర్ పాలన కేసీఆర్ చేరదీసిన మేధా (తా)వులకు స్వర్గంలా ఉందట. ధర్నా చౌక్ కూడా లేకుండా చేసి, సచివాలయానికి రాని సీఎం కేసీఆర్‌ను గొప్ప ప్రజా స్వామ్య వాదిగా వీరు కీర్తిస్తున్నారు. అయితే వేయి శవాలను తిన్న రాబందు కూడా ఏదో ఒక రోజు కుప్పకూలక తప్పదు. కాలం ప్రతి దానికీ సమాధానం చెబుతుంది. చరిత్రలో కూలి పోయిన ఎందరో నియంతలు ఇందుకు ఉదాహరణ. (క్లిక్ చేయండి: ఉగ్రవాద లెక్కలు పరమ సత్యాలా?) - డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు -
కుటుంబ పాలన అంతమొందించాలి: బండి
మొయినాబాద్ (చేవెళ్ల): ‘‘తెలంగాణ రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో 1,400 మంది అమరులైతే.. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం గుర్తించింది 600 మందినే. అమరవీరుల ఆత్మబలిదానాలతో ఏర్పాటైన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అధికారం అనుభవిస్తూ జల్సాలు చేస్తోంది. ఆ అమరవీరుల సాక్షిగానే కేసీఆర్ కుటుంబ పాలనను అంతమొందించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ధ్వజమెత్తారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం మొయినాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే దళితున్ని సీఎం చేస్తానని, వారికి 3 ఎకరాల భూమి ఇస్తానని దళితులను మోసం చేసిన సీఎం కేసీఆర్, ఇప్పుడు కొత్తగా దళిత జపం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లకోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు నిధులిస్తే, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించడం లేదని ఆరోపించారు. 111 జీవోను సమర్థిస్తారా.. వ్యతిరేకిస్తారా? ఎన్నో సంవత్సరాలుగా చేవెళ్ల ప్రాంతంలో 111 జీవో సమస్యగా మారిందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం 111 జీవోను సమర్ధిస్తుందో వ్యతిరేకిస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. సీఎం కేసీఆర్‌కు, ఆయన కూతురు, కొడుకు, అల్లుడికి ఈ ప్రాంతంలో ఫాంహౌస్‌లు ఉన్నాయని.. వాటిని కాపాడుకోవడం కోసం జీవోను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు. రోడ్లు, బియ్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు, హరితహారం అన్నింటికీ కేంద్రం నిధులిస్తుందని.. కానీ రాష్ట్రమే ఇస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రంగారెడ్డి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో, ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సందీప్ పాత్ర, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఫామిలీ పాలిటిక్స్
-
బాబు సమర్పించు ఫ్యామిలీ పాలిటిక్స్
-
ఒక ఫ్యామిలీ.. రెండు పార్టీలు
‘భర్త ఒక పార్టీలో భార్య మరో పార్టీలో ఉంటే.. రేప్పొద్దున్న ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇద్దరూ బాగుపడొచ్చు’ అన్న పాత సినిమా డైలాగు క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబానికి బాగా సరిపోతుంది. రవీంద్ర జడేజా గుజరాత్‌లోని జామ్‌నగర్ ప్రాంతానికి చెందిన వాడు. కాగా, ఆయన భార్య రివబా కిందటి నెల భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా జడేజా తండ్రి అనిరుధ్ సిన్హ, సోదరి నైనబా రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. జామ్‌నగర్ నియోజకవర్గంలోని కలవాడ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన హార్దిక్ పటేల్ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత మార్చి 3వ తేదీన ప్రధాని మోదీ గుజరాత్ పర్యటనకు రావడానికి ఒక రోజు ముందు జడేజా సతీమణి బీజేపీలో చేరారు. జామ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ పూనంబెన్ సమక్షంలో రివబా కమలదళంలో భాగస్వాములయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున పూనంబెన్ పోటీ చేస్తున్నారు. -
నియంతృత్వ పాలనకు గుడ్‌బై
సాక్షి, పలాస (శ్రీకాకుళం): పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ముఖ్యమైన నాయకులంతా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. కుటుంబ పాలన ఇంకెన్నాళ్లంటూ కార్యకర్తలు సైతం పార్టీని వీడుతుండటంతో ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీషకు ఓటమి భయం వెంటాడుతోంది. గతంలో శివాజీ మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలకు మేలు చేయకపోయినా అంతగా సమస్యలు ఉండేవి కావని, ఇప్పుడు ఆ కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలు తయారయ్యారని సాక్షాత్తు టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకోవడం గమనార్హం. ఎవరి వద్దకు వెళ్లి సమస్యలు చెప్పుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు పడుతున్నామని లోలోపన మదనపడుతున్నారు. శివాజీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అతని అల్లుడు వెంకన్న చౌదరి చక్రం తిప్పడం, అతనికి వ్యాపార దృక్పథం తప్ప అభివృద్ధి సంక్షేమం పట్టలేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు శిరీష ఎమ్మెల్యే అయితే పలాసలో ఉండరు సరికదా వెంకన్న వల్ల మరింతగా ఇబ్బందులు ఎక్కువ అవుతాయని, ఇప్పటికే అతని వల్ల అవస్థలు పడిన ద్వితీయ శ్రేణి నాయకులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావుకు, ఎమ్మెల్యేకు మధ్య ఆది నుంచి కోల్డ్ వార్ జరిగి చివరకి పూర్ణచంద్రరావు పార్టీని విడిచిపెట్ట వలసి వచ్చింది. తోటి కౌన్సిలర్లతో కలసి పార్టీకి గుడ్‌బై చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలం జెడ్పీటీసీ ఉప్పరపల్లి నీలవేణి భర్త ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ కూడా ఇటీవలే టీడీపీకి రాజీనామా చేశారు. శిరీష అభ్యర్థిత్వాన్ని, వెంకన్న చౌదరి పెత్తనాన్ని నిరసిస్తూ వజ్రపుకొత్తూరు మండలంలో బలమైన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం ఆ పార్టీకి దూరమైంది. మందస మండలం ఎంపీపీ కొర్ల కవిత భర్త కొర్ల కన్నారావు కూడా తెలుగుదేశం పార్టీని వీడారు. వెంకన్నచౌదరి పెట్టిన ఇబ్బందుల వల్లే బలమైన కాళింగ సామాజిక వర్గానికి చెందిన కన్నారావు పార్టీని వీడవలసి వచ్చిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. వీరితో పాటు మందస మాజీ జెడ్పీటీసీ అందాల శేషగిరి, వజ్రపుకొత్తూరు మాజీ ఎంపీపీ మద్దిల చిన్నయ్య, పలాస మాజీ జెడ్పీటీసీ వరిశ హరిప్రసాద్ కూడా తెలుగుదేశం పార్టీని వీడారు. ప్రస్తుతం హరిప్రసాద్, అందాల శేషగరి, ఉప్పరపల్లి ఉదయ్‌కుమార్ వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు. నాయకులతో పాటు ముఖ్యమైన కార్యకర్తలంతా పార్టీకి దూరమవుతుండటంతో గౌతు కుటుంబా నికి ఓటమి భయం పట్టుకుంది. దీంతో ఎలాగైనా గెలవాలనే దురుద్దేశంతో డబ్బులు ఎరజూ పుతూ అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. పలాస నియోజవర్గానికి గౌతు శిరీష స్థానికేతరం ఇక్కడి ప్రజల నుంచి స్పందన కరవవుతోంది. అదే సమయంలో వైఎస్సార్సీపీకి ప్రజల్లో తగిన ఆదరణ ఉండటంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి డాక్టరు సీదిరి అప్పలరాజు బలమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గౌతు కుటుంబానికి ముచ్చెమట్లు పడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదుకునేవారినే ఆదరించండి పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు జిల్లా స్థాయిలో మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం వైఎస్సార్సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎంపీగా దువ్వాడ శ్రీను, పలాస అభ్యర్థిగా డాక్టర్ సీదిరి అప్పలరాజులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలాస అసోషియేషన్ అధ్యక్షుడు మన్నేళ శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు. – కాశీబుగ్గ వెంకన్న వేధింపులే కారణం పార్టీని వీడడానికి ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి వేధింపులే ప్రధాన కారణం. పార్టీలో ఉన్నప్పటికీ తగిన గుర్తింపు ఇవ్వలేదు. రాజకీయంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెట్టారు. శివాజీ దృష్టికి తీసుకొని వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అందుకే పార్టీలో ఉండలేక బయటకు రావాల్సి వచ్చింది. – కొర్ల కవిత, మాజీ ఎంపీపీ, మందస అభివృద్ధిని పట్టించుకోలేదు వజ్రపుకొత్తూరు మండలంలో ఎంతో అభివృద్ధి చేయాలని ఆశించాం. ఆశలన్నీ అడియాశలయ్యాయి. నామమాత్రంగానే జెడ్పీటీసీగా ఉండాల్సి వచ్చింది. అధికారాలన్నీ శివాజీ, ఆయన అల్లుడు వెంకన్న చేతిలో పెట్టుకున్నారు. రాకాసి గెడ్డ వంతెన నిర్మాణం చేయాలని కోరాను. పూండి మార్కెటును అభివృద్ధి చేయాలని చెప్పాను. అయినా పట్టించుకోలేదు. మత్స్యకా రులకు ఎమ్మెల్యే టికెట్ గానీ, ఎమ్మెల్సీ పదవి గానీ ఇస్తామన్నారు. ఇది కూడా నెరవేరలేదు. అం దుకే మత్స్యకారుల సామాజకవర్గానికి చెందిన డాక్టరు సీదిరి అప్పలరాజుకు మద్దతు ఇస్తున్నాం. – ఉప్పరపల్లి ఉదయకుమార్ (జెడ్పీటీసీ నీలవేణి భర్త), వజ్రపుకొత్తూరు అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు శివాజీ కుటుంబానికి అభివృద్ధి అంటే ఇష్టం ఉండదు. వారికి అదొక రాజకీయ సూత్రం. అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే వాటి వల్ల నాలాంటివాళ్లకు ప్రజాదరణ ఎక్కడ వచ్చేస్తుందోనన్న భయం వాళ్లది. అన్నీ అధికారాలు వారి వద్దనే ఉంచుకొని మిగిలిన వారిని ఆటబొమ్మల్లా చేసుకుంటారు. వారికి ఎవరూ పోటీ కాకూడదు. ముఖ్యంగా వెంకన్న చౌదరి వేధింపులు చాలా ఎక్కువ. – కోత పూర్ణచంద్రరావు, మున్సిపల్ చైర్మన్, పలాస కాశీబుగ్గ -
బరిలో బంధుగణం!
సాక్షి, శ్రీకాకుళం: ఈ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కొన్ని ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ఇవి ఓటర్లలో ఆసక్తిని రేపుతున్నాయి. సమీప బంధువులు, రక్త సంబంధీకులు వివిధ పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ నర్సన్నపేట నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆమదాలవలస నుంచి వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, ఆయనపై టీడీపీ అభ్యర్థిగా ఆయన బావమరిది (భార్య సోదరుడు) కూన రవికుమార్ తలపడుతున్నారు. టీడీపీ తరఫున శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి కింజరాపు రామ్మోహన్నాయుడు, ఆయన బాబాయ్ (తండ్రికి సొంత సోదరుడు) కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారు. అలాగే రాజాం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కంబాల జోగులు బరిలో ఉండగా ఆయన బాబాయ్ (తండ్రి సోదరుడి) కుమారుడు కంబాల రాజవర్థన్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. విశేషమేమిటంటే వీరిలో రాజాం నుంచి బరిలో ఉన్న కంబాల జోగులు, రాజవర్థన్ (ఈయన తొలిసారిగా పోటీలో ఉన్నారు)లు మినహా మిగిలిన వారంతా 2014 సార్వత్రిక ఎన్నికలోనూ అవే స్థానాల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల్లో తలపడుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ చుట్టాలు, బంధువులను ఆకట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయా అభ్యర్థుల బంధుత్వాల గురించి ఆయా నియోజకవర్గాల ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. -
ఏళ్ల తరబడి రాజకీయ వారసత్వం
సాక్షి, ఉదయగిరి (నెల్లూరు): రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాకు రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. వారసత్వ రాజకీయాలకు పెట్టిందిపేరుగా ఈ జిల్లా గుర్తింపు పొందింది. జిల్లాలో పలు కుటుంబాలు వారసత్వ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. బెజవాడ రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి, మాగుంట, ఆనం, మేకపాటి తదితర కుటుంబాల్లో వారసత్వ రాజకీయాలు సాగుతూనే ఉన్నాయి. సర్పంచ్ స్థాయి నుంచి రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, తదితర కీలకపదవులు చేపట్టిన వారు ఉన్నారు. జిల్లాలో వారసత్వ రాజకీయాలపై ప్రత్యేక కథనం. ఐదు దఫాలు ఎంపీగా.. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి జిల్లాలో ఏళ్ల తరబడి రాజకీయాల్లో తమ హవా కొనసాగిస్తున్న పలు కుటుంబాల్లో మేకపాటి కుటుంబం ఒకటి. జిల్లాలోని కడప సరిహద్దు ప్రాంతంలోని వెలుగొండ అడవుల్లో మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మేకపాటి కుటుంబం వారసత్వ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంతరించుకుంది. ఈ కుటుంబంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఐదు దఫాలుగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయన 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన 1985లో ఉదయగిరి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. 1998లో నరసారావుపేట నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నెల్లూరు ఎంపీ స్థానం నుంచి రికార్డు మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 1999లో ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి చెందారు. 2004, 2009 ఎన్నికల్లో ఉదయగిరి నుంచే విజయం సాధించారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జిల్లాలోనే అత్యంత మెజారిటీతో గెలుపొందిన రికార్డు నమోదుచేసుకున్నారు. అదే కుటుంబం నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు మేకపాటి గౌతమ్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ప్రస్తుతం ఈ కుటుంబానికి చెందిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి నుంచి, గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. నల్లపరెడ్ల హవా నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి జిల్లా రాజకీయాల్లో నల్లపరెడ్డిలకు ప్రత్యేక స్థానం ఉంది. 1952, 1955లో వల్లేటి గోపాలకృష్ణారెడ్డి గూడూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన పెద్ద మేనల్లుడు నల్లపరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి జెడ్పీ చైర్మన్‌గా, వెంకటగిరి ఎమ్మెల్యేగా, రాష్ట్ర పంచాయతీరాజ్ చాంబర్ చైర్మన్‌గా పనిచేశారు. ఆయన సోదరుడు నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయాల్లో ఓటమెరుగని నేతగా పేరు సంపాదించుకున్నారు. ఆయన కోట సమితి అధ్యక్షునిగా, కోవూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టి.అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు కేబినెట్లో మంత్రి పదవులు చేపట్టారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో బలమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. అలాగే ఆయన సోదరులైన నల్లపరెడ్డి గోపాల్, సుబ్బారెడ్డి కోట సమితి రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించారు. నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో వైఎస్సార్సీపీ తరపున అదే స్థానంనుంచి పోటీచేసి పరాజయం పొందారు. 2019 ఎన్నికల్లో కోవూరు బరిలోనే వైఎస్సార్సీపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన సోదరులు హరనాథరెడ్డి, సురేష్‌రెడ్డి కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. సీఎం స్థాయికి ఎదిగిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, రాజ్యలక్ష్మి, రామ్‌కుమార్‌రెడ్డి వాకాడుకు చెందిన నేదరుమల్లి జనార్దన్‌రెడ్డి 1965లో రాజకీయాల్లోకొచ్చారు. 1970లో ఎమ్మెల్సీగా పోటీచేసి వైసి.రంగారెడ్డి చేతిలో ఓడిపోయారు. 1972లో రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యారు. 1970,1984లో ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, భవనం వెంకటరమణారెడ్డి కేబినెట్లో మంత్రి పదవులు చేపట్టారు. 1983లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1990లో విశాలాంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన బాపట్ల, నరసరావుపేట, విశాఖపట్టణం ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సతీమణి నేదురుమల్లి రాజ్యలక్ష్మి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి 2014లో బీజేపీలో చేరి ఆ పార్టీలో ఇమడలేక ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరఫున క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. ప్రస్తుతం వెంకటగిరి నుంచి వైఎస్సార్సీపీ బరిలో ఉన్న రామనారాయణరెడ్డి విజయానికి పావులు కదుపుతున్నారు. నేదురుమల్లి కుటుంబం ప్రభావం నేటికీ గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలపై ఉంది. క్రియాశీలకం.. మాగుంట శ్రీనివాసులురెడ్డి, సుబ్బరామిరెడ్డి, పార్వతమ్మ జిల్లా రాజకీయాల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి చురుకైన నేతగా పేరు సంపాదించుకున్నారు. స్వల్పకాలంలోనే నెల్లూరు నుంచి కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ నేతగా గుర్తింపుపొందారు. తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశం విజయవంతం కావడంతో మాగుంట సుబ్బరామిరెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించడంతో ఇందిరాగాంధీ కుటుంబానికి సన్నిహితుడుగా మారారు. 1991లో ఒంగోలు ఎంపీగా గెలుపొందారు. రాజకీయాల్లో పైస్థాయికి ఎదుగుతున్న తరుణంలో 1995 డిసెంబరు ఒకటో తేదీన ఒంగోల్లో నక్సలైట్ల కాల్పులకు బలయ్యారు. ఆ తర్వాత ఆయన సతీమణి మాగుంట పార్వతమ్మ 1996లో ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ బరిలో టీడీపీ తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానా నికి వైఎస్సార్సీపీ తరపున పోటీలో ఉన్నారు. ఆనం కుటుంబానికి ప్రత్యేక స్థానం వెంకటరెడ్డి, రామనారాయణరెడ్డి, చెంచుసుబ్బారెడ్డి, వివేకానందరెడ్డి జిల్లా రాజకీయ చరిత్రలో ఆనం కుటుంబానికి సుమారు 80 ఏళ్ల చరిత్ర ఉంది. దివంగత నేత ఆనం చెంచు సుబ్బారెడ్డి (ఏ.సి.సుబ్బారెడ్డి)తో రాజకీయ జీవితం ప్రారంభమై రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి పిల్లల వరకు కొనసాగుతోంది. బ్రిటిష్ పాలనలో పోలీసు అధికారిగా పని చేసిన ఆనం సుబ్బారెడ్డి కుమారుడు ఏ.సి.సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి రాజకీయాల్లో ప్రముఖ పాత్రవహించారు. వీరిలో ఏసి.సుబ్బారెడ్డి సహకార సంస్థల నుంచి నెల్లూరు మున్సిపల్ చైర్మన్‌గా పోటీకి దిగి మొదట పరాజయం పొందినా 1937లో చైర్మన్‌గిరి దక్కించుకుని 1952 వరకు కొనసాగారు. 1952లో నెల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమిచెందారు. 1955 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ నేపథ్యంలో కొంతకాలం టీటీడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఇరిగేషన్, ఆర్థికశాఖ మంత్రిగా పనిచేశారు. 1967లో ఏసి.సుబ్బారెడ్డి మరణించడంతో ఆయన వారసుడిగా ఆనం వెంకటరెడ్డి రాజకీయ ప్రవేశం చేసి డీసీసీబీ అధ్యక్షునిగా పనిచేశారు. 1972లో నెల్లూరు ఎమ్మెల్యేగా ఎన్నికై నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు.1978లో నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమిచెంది 1983లో టీడీపీ తరపున ఆత్మకూరు నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఈ విధంగా జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏసి.సుబ్బారెడ్డి కుమారుడు భక్తవత్సలరెడ్డి ఇందుకూరుపేట సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రవేశం చేశారు. ఆయన 1972లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత సర్వేపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీచేసి పరాజయం పొందారు. ఏసి.సుబ్బారెడ్డి రాజకీయ స్ఫూర్తిగా వారి సంతానంలో రామనారాయణరెడ్డి, వెంకటరమణారెడ్డి, విజయకుమార్‌రెడ్డి రాజకీయాల్లో ముందుకు వెళుతున్నారు. ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆయన అనారోగ్యంతో తనువు చాలించినప్పటికీ సోదరులు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు, రాపూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా చక్రం తిప్పారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో కాంగ్రెస్ తరపున ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. అనంతరం టీడీపీలోకి వెళ్లినా అక్కడ ఇమడలేక వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల బరిలో వెంకటగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఆయన సోదరుడు ఆనం విజయకుమార్‌రెడ్డి వైఎస్సార్సీపీలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆనం జయకుమార్‌రెడ్డి టీడీపీలో కొనసాగుతున్నారు. ఆనం వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూర్‌రెడ్డి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. -
జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే
జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే. పార్టీలు వేరైనా.. ప్రాధాన్యతలు అవే. ప్రతి పార్టీ వారసత్వరాజకీయాలకే మొగ్గు చూపుతోంది. అన్ని పార్టీలు టికెట్ల కేటాయింపులో పలుకుబడి గల రాజకీయకుటుంబాలకు అగ్రతాంబూలం ఇస్తున్నాయి. జిల్లాలో వారసత్వ పాలన కొత్తేమీ కాకున్నా ఇటీవలి కాలంలోజోరందుకున్నాయి. అన్నదమ్ములు.. తండ్రి, కొడుకులు, బాబాయ్ అబ్బాయ్.. ఇలా ఎవరికి వారు టికెట్ల కోసంఅధిష్టానాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సమితిలో కీలక భూమిక పోషిస్తున్న తాజా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మరోసారి పార్టీలో తన ప్రాబల్యాన్ని చాటుకున్నారు. ఈసారి ఎన్నికల్లో సోదరుడు నరేందర్‌రెడ్డికి కొడంగల్ టికెట్టును దక్కించుకోవడం ద్వారా పలుకుబడిని ప్రదర్శించారు. సతీమణి సునీతను జిల్లాపరిషత్ చైర్‌పర్సన్‌గా.. నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించిన మహేందర్.. తాజాగా నరేందర్‌కు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఖరారు చేయించుకోవడంలో కీలక భూమిక పోషించారు. కొడంగల్‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి అధికార పార్టీకి కొరకరానికొయ్యగా మారిన నేపథ్యంలో ఆయన ఓటమే లక్ష్యంగా నరేందర్‌ను టీఆర్ఎస్ అధిష్టానం బరిలో దించింది. అదేసమయంలో గెలిపించే బాధ్యతను మహేందర్‌రెడ్డిపై పెట్టింది. తల్లీ..కొడుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ఈసారి శాసనసభ బరిలో దిగాలని నిర్ణయించారు. మహేశ్వరం నుంచి తల్లి, రాజేంద్రనగర్ నుంచి పుత్రుడు పోటీ చేసే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో పోటీచేయాలని భావించిన సబితకు కుమారుడి రూపంలో చుక్కెదురైంది. కుటుంబానికి ఒకే సీటుఇవ్వాలనే ఏఐసీసీ ఆంక్షల నేపథ్యంలో చేవెళ్ల ఎంపీగా కార్తీక్ రాజకీయ అరంగేట్రానికి తలూపిన సబిత.. శాసనసభ సీటును త్యాగం చేశారు. ఈసారి మాత్రం ఇరువురు పోటీచేయడానికే మొగ్గు చూపుతున్నారు. పాత షరతులు తెరమీదకు వస్తే తప్ప ఇద్దరూ పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. గౌడ్ల దౌడ్! టీడీపీ సీనియర్ నేత దేవేందర్‌గౌడ్ కుటుంబం కూడా రెండు టికెట్లను ఆశిస్తోంది. దేవేందర్‌గౌడ్ కుమారుడు వీరేందర్‌గౌడ్ ఉప్పల్ నుంచి పోటీచేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కాంగ్రెస్‌తో దాదాపుగా పొత్తు కుదురుతుందని భావిస్తున్న తరుణంలో ఆయన పోటీ తథ్యంగా కనిపిస్తోంది. దేవేందర్‌గౌడ్ మహేశ్వరం అసెంబ్లీ సెగ్మెంట్‌కు పోటీచేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున సబిత బరిలో దిగుతున్నందున ఆయన పోటీ.. సీట్ల సర్దుబాటుపై ఆధారపడి ఉంది. బాబాయ్..అబ్బాయ్! చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్న జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ తన సొదరుడి కుమారుడు వీరేశ్‌ను కుత్బుల్లాపూర్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీనిపై ఇటీవల అమరావతి వెళ్లిన ఆయన అక్కడ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో కూడా చర్చలు జరిపారు. పొత్తు పొడిస్తే టీడీపీ ఈ సీటును కోరే అవకాశం ఉంది. ఈ అంశాన్ని ముందే పసిగట్టిన కాసాని.. తన కుమా రుడి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. మర్రి కుటుంబం కూడా.. మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి మరోసారి సనత్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కుమారుడు ఆదిత్య మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ జనసమితి (టీజేఎస్)లో చేరారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ సీటును ఆశించి భంగపడ్డ ఆదిత్య ఈ సారి తప్పనిసరిగా శాసనసభకు పోటీచేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తాండూరు నుంచి బరిలో దిగే అంశాన్ని పరిశీలిస్తున్నారు. టీజేఎస్ మహాకూటమిలో భాగస్వామిగా మారడం.. ఈ స్థానం నుంచి తన తాత, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి ప్రాతినిథ్యం వహించినందున తాండూరును ఎంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొడుకుకు ప్రేమతో... పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి తన కుమారుడు మహేశ్‌రెడ్డి కోసం ఈసారి పొటీ నుంచి తప్పుకున్నారు. వయోభారం, ఆనారోగ్యం కారణంగా పుత్రుడు మహేశ్‌కు టీఆర్ఎస్ సీటు ఇప్పించుకోగలిగారు. మరోవైపు మల్రెడ్డి సోదరులు మరోసారి టికెట్ల వేట సాగిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఇబ్రహీంపట్నంతో పాటు ఎల్బీనగర్ లేదా మహేశ్వరం నుంచి పోటీచేసేందుకు హస్తినలో లాబీయింగ్ నెరుపుతున్నారు. -
'అన్నాడీఎంకేను మళ్లీ వెనక్కి తెస్తాం'
తమిళనాడులో రాజకీయాలు రోజుకో కొత్త మలుపుతిరుగుతున్నాయి. అన్నాడీఎంకే నుంచి బయటికి గెంటివేయబడ్డ మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మళ్లీ తమ పార్టీని తిరిగి వెనక్కి తెచ్చుకుంటామని వాగ్దానం చేశారు. పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత బయటికి గెంటివేయబడ్డ కుటుంబం ఇప్పుడు అన్నాడీఎంకేలో చక్రాలు తిప్పుతుందని, వారి చేతుల్లోంచి పార్టీని బయటపడేస్తానని పన్నీర్ సెల్వం చెప్పారు. జయలలిత మరణం గురించి అందరిలో ఓ అనుమానం ఉందని, ఆమె మరణానికి సంబంధించిన మిస్టరీ గురించి ప్రతిఒక్కరూ అడుగుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆమె మరణం గురించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ అతిపెద్ద చాలెంజ్ 'ధర్మ యుద్ధం'. కచ్చితంగా ధర్మం గెలుస్తుందన్నారు. ఎంజీఆర్ మృతి తర్వాత జయలలిత చాలా సమస్యలను ఎదుర్కొన్నారని, అన్నాడీఎంకేను ఎలాంటి కుటుంబ రాజకీయాలు లేకుండా అమ్మ తీర్చిదిద్దారని చెప్పారు. కానీ ప్రస్తుతం తమిళ ప్రభుత్వం, పార్టీ ఒక కుటుంబం చేతిలోకి వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. అన్నాడీఎంకేలో శశికళ కుటుంబం మళ్లీ చక్రాలు తిప్పడం ప్రారంభించిందని ఇప్పటికే పలువురి నుంచి అసహనం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ, తన అక్క కొడుకు దినకరన్ కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టడంతో కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
తమిళనాట మళ్లీ వారసత్వ రాజకీయాలు
న్యూఢిల్లీ: ‘మక్కాలాల్ నాన్, మక్కాలుకాగవే నాన్ (ప్రజల వల్లనే నేను, ప్రజల కోసమే నేను)’ ప్రతి బహిరంగ సభలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ముందుగా చెప్పిన మాటలివే. ఆ తర్వాత ‘మీది పక్కా వారసత్వ రాజకీయాలు’ అంటూ డీఎంకే పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఎక్కువ. ఇప్పుడు అలాంటి అన్నాడీఎంకే పార్టీలో కూడా వారసత్వ రాజకీయాలు పురివిప్పాయి. జయలలిత అన్నకూతురు దీపా జయకుమార్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పార్టీలోకి ఆహ్వానించడం, ఆమె శశికళకు వ్యతిరేకంగా ఆయనకు మద్దతివ్వడం తెల్సిందే. సుప్రీం కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో పార్టీపై పట్టుకోసం శశికళ కూడా వారసత్వ రాజకీయాలనే ఆశ్రయించారు. తన సోదరుడి కుమారుడైన టీటీవీ దినకరన్‌ను మళ్లీ పార్టీలోకి తీసుకొని ఏకంగా పార్టీ డిప్యూటి జనరల్ సెక్రటరీ పదవి అప్పగించారు. మరో సమీప బంధువు ఎం. వెంకటేషన్‌ను కూడా తీసుకున్నారు. అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వీరిద్దరికి 2011లో జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. దినకరన్, అక్రమాస్తుల కేసులో శశికళతోపాటు శిక్ష పడిన సుధాకరన్‌కు స్వయాన సోదరుడు. జయలలిత బతికున్నంతకాలం దూరంగా ఉంచిన వీరిద్దరిని సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శశికళ దగ్గరికి తీసుకున్నారు. తాను జైలుకు వెళ్లాల్సి రావడంతో శశికళ తప్పనిసరి పరిస్థితిలో పార్టీ శాసనసభా పక్షం నాయకుడిగా పళనిసామికి మద్దతిచ్చారు. గౌండర్ కమ్యూనిటికి చెందిన పళనిసామి పార్టీలో బలమైన నాయకుడు. ఆ కులానికి చెందిన వారు పార్టీ శాసన సభ్యుల్లో 45 మంది ఉన్నారు. అంతటి వ్యక్తి ముఖ్యమంత్రయితే స్వతంత్రంగా వ్యవహరిస్తూ తనను పట్టించుకోకపోవచ్చనే దూరదష్టితో ఆయనకు చెక్ పెట్టేందుకు దినకరన్‌ను శశికళను తీసుకొచ్చినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి పదవీ స్వీకారానికి రేపు ఎవరిని ఆహ్వానించినా, ఎవరు ముఖ్యమంత్రయినా ఈ వారసత్వ రాజకీయాల వల్ల పార్టీ చీలిపోయే ప్రమాదం ఎప్పటికీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే దీపా జయకుమార్‌ను పార్టీలోకి ఆహ్వానించడం పట్ల పన్నీర్ సెల్వం వర్గీయులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. పార్టీలోకి తీసుకున్నా ఆమెకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని, ఇస్తే తమ సీటుకే ఎసరు పెడతారని పన్నీరు సెల్వంను హెచ్చరిస్తున్నవారు కూడా ఉన్నారు. -
ఫ్యామిలీ ప్యాకేజి మొదలైపోయింది!
బిహార్‌లో ఒకప్పటి బద్ధశత్రువైన జేడీ(యూ)తో చేతులు కలిపిన తర్వాత అధికారం చేపట్టిన ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్.. తన ఫ్యామిలీ ప్యాకేజి ప్రారంభించేశారు. స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేని లాలు.. తన ఇద్దరు కొడుకులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడమే కాక, వాళ్లలో తేజస్వి యాదవ్‌ను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేసిన విషయం తెలిసిందే. తాజాగా తన భార్య రబ్రీదేవికి కూడా మరో పదవిని కట్టబెట్టేశారు. బిహార్ శాసన మండలిలో రాష్ట్రీయ జనతాదళ్ పక్ష నేతగా ఆమె పేరును ఖరారు చేశారు. ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహిస్తున్న తేజస్వి యాదవ్‌కే ఆర్జేడీ శాసన సభా పక్ష నేత పదవి కూడా కట్టబెట్టారు. గతంలో బిహార్ రాష్ట్రంలో ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్యామిలీ ప్యాకేజి కింద మొత్తం పదవులలో సింహభాగాన్ని తన కుటుంబ సభ్యులకే కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్లీ అధికారాన్ని పంచుకోవడమే కాక.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా కూడా అవతరించడంతో తమవంతు వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ పదవులను లాక్కుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ పదవులలో కూడా తన సొంత మనుషులు (ఫ్యామిలీ) తప్ప బయటివాళ్లు లేకుండా లాలు జాగ్రత్త పడుతున్నారు. -
చిగురించిన కుటుంబ వారసత్వం
సందర్భం నితీశ్ ప్రభుత్వంలో ఎక్కువమంది మహిళలను మంత్రులుగా నియమించే విషయంలో పట్టుపట్టని లాలూ తన కుమారులిద్దరికీ మంత్రి పదవులు సాధించడంలో ఘన విజయమే సాధించారు. ప్రజాజీవితం పేరిట కుటుంబంలో కొత్త వారసత్వం మొలకెత్తింది. శిశుమరణాలు అధికంగా ఉన్న రోజుల్లో కుటుంబ సంరక్షణ కోసం సమర్ధనగా విడి కుటుంబాల్లో పలువురు పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కుటుంబాన్ని పైకి తీసుకురావ డానికి మరిన్ని చేతులు అద నంగా ఉంటే బాగుంటుందని కూడా సమర్థించుకునేవారు. అయితే వాస్తవానికి పేదలు ఎక్కువమంది పిల్లల్ని కనేవారు కానీ ఆ పెద్ద కుటుంబాలు ఆ పిల్లల్ని పేదరికం లోనే ఉంచేవనేది మరో విషయం. లాలూకు తొమ్మిదిమంది పిల్లలు. ఇంత మంది సంతానాన్ని కని, పెంచడానికి రబ్రీదేవికి ఎంత సాహస ముండాలి అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసే వారు. చాలా మంది ఈ విషయంలో లాలూను పరిహ సించేవారు. అయితే అదనపు చేతుల సహాయం అవస రం కావడానికి లాలూ పేదవాడేం కాదు. ఆయన విద్యా వంతుడు. ప్రజాసేవ చేయాలని ఉందని చెప్పుకుం టూనే బతకడానికి రాజకీయాల్లో స్వయం ఉపాధిని వెతుక్కుంటున్న నేతలలో లాలూ ఒకరు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, లాలూ కుటుంబ సభ్యులిద్దరు ఆయన మంత్రివర్గంలో చేరారు. ఆ వెంటనే లాలూ కుటుంబం తమ మూలపురుషుడితో కలిసి గ్రూప్ ఫొటోకు దిగింది. రాజకీయాల్లో కొనసాగుతానని ఈ కుటుంబం స్పష్టంగా తన ఉద్దేశాలను వ్యక్తపరిచాక -ఒక కుమారుడు రాజకీయాల కోసం క్రికెట్‌నే త్యజించాడు- ఇప్పటికి లాలూ కుటుంబం రాజకీయంగా విస్తృతరూపాన్ని సంతరించుకున్నట్లయింది. అయితే నా మనసులో కుటుంబ పరిమాణానికి ప్రముఖ స్థానం లేదు. ఇద్దరు కుమారులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం అందులోనూ ఒకరు నేరుగా ఉప ముఖ్యమంత్రి కావడంతో ఒక నూతన రాజ కీయ కుటుంబం ఇప్పుడు ఎంత పటిష్టంగా తన స్థానాన్ని నెలకొల్పుకున్నది అన్నదే నా ఆలోచన. మేం అయిదుగురం- మా తల్లిదండ్రులు, నా ఇద్దరు సోద రులు, నేను రాజకీయాల్లో ఉన్నామని లాలూ కుమార్తె మీసా యాదవ్ టీవీల ముందునిల్చుని చెప్పారు. కుల రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబ పెద్ద.. దాణా కుంభ కోణంలో ఇరుక్కుని జైలుకెళ్లినప్పుడు లాలూ కుటుంబం పార్టీని ఎలా నడపగలదనిపించింది. కాని ఈ విషయం పెద్దగా వివాదాస్పదం కాలేదు. అవినీతి కేసులో శిక్షపడిన కారణంగా ఎన్నికల్లో పాల్గొనడం, ఓటేయడం చేయలేకపోయిన ఆర్జేడీ పార్టీ అధినేత నూతన ప్రభుత్వంలో ఎక్కువమంది మహిళ లను మంత్రులుగా నియమించే విషయంలో పట్టుపట్ట డంకానీ, నితీశ్‌ను ఒప్పించడంకాని చేయకపోగా, తన కుమారులిద్దరికీ మంత్రి పదవులు సాధించడంపైనే దృష్టిపెట్టారు. ఈసారి బిహార్ శాసనసభ కు 22 మంది మహిళలు ఎంపికయ్యారు. రాజకీయాలకు బొత్తిగా కొత్త వాడైన ఒక పుత్రుడేమో ఏకంగా ఉపముఖ్యమంత్రి అయిపోయాడు. మరొకరేమో, రెండుసార్లు సవరణ చెప్పించుకుంటేగానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ లేని అవిద్యావంతుడు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని మోదీ తగినంతగా మహిళలకు స్థానం కల్పించలేదని పలు ఆరోపణలు గుప్పించిన నితీశ్ కుమార్ తన మంత్రివర్గంలో ఎక్కువ మంది మహిళలను చేర్చుకుంటారని భావించడం మరీ ఎక్కువ ఆశించడమే అవుతుందని కొందరు మిత్రులు సూచించారు. లాలాకు ఏడుగురు కుమార్తెలున్నప్పటికీ నిర్ణయాధికారంలో వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారానే మహిళలకు సాధికారత లభిస్తుందని లాలూకు తట్టినట్లు లేదు. మహిళలను సమానులుగా చూడడంలో లేదా వారిని సమానులుగా చేయడంలో తాను ప్రద ర్శించిన వ్యతిరేకతను పార్లమెంటులో మహిళల కోటా పట్ల లాలూ వ్యక్తంచేసిన అభ్యంతరంలో చూడొచ్చు. ప్రభుత్వం కంటే కుటుంబం ముందు అనే వైఖరి పూర్తిగా వ్యతిరేకించదగినది. అందుకే ఈ వ్యాసం మొద ట్లోనే సంతానం అనే పదం వాడాను. రాజకీయాల్లో ఉంటున్న ఇతర కుటుంబాలతో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడం ద్వారా లాలూ కుటుంబం విస్తరిస్తోం ది. నేను గతంలో సూచించినట్లుగా, లాలూ చిన్న కూతు రు సమాజ్‌వాదీపార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మునిమనవడు, ఎంపీ అయిన తేజ్ ప్రతాప్ సింగ్ భార్య అయింది. ఇక లాలూ నాలుగో కూతురు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి గెంతేసిన ఎమ్మెల్యే జితేంద్రయాదవ్ కుమారుడు రాహుల్‌యాదవ్ భార్య. ఇక చిన్నకూతురు హేమ మరొక రాజకీయ కుటుంబానికి చెందిన వినీత్ యాద వ్ని పెళ్లాడింది. ఆరవ కూతురు ధను, చిరంజీవరా వును పెళ్లాడింది. ఈయన తండ్రి ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు చెందిన రావ్ అజిత్‌సింగ్. ఈయన హరియా ణాలో ఒకసారి విద్యుత్ మంత్రిగా పనిచేశారు కూడా. ఇక్కడ చిన్న గమనిక: లాలూ ఏడుగురు కుమా ర్తెల్లో ముగ్గురు రాజకీయవర్గాలకు చెందని వ్యక్తులను పెళ్లాడారు. అయినంతమాత్రాన లాలూ కుటుంబం రాజకీయాలకు తక్కువ అని చెప్పలేం. ఏమాత్రం అను భవం లేని కుమారులను పెద్ద పదవుల్లో నియ మింప చేయడమే రాజకీయం. పైగా లాలూ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. ఆర్జెడీ పార్టీకి ఇప్పుడు ఒక ఉపాధ్యక్షులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ లాలు ఇప్పుడెంత ప్రభావం చూపుతున్నారంటే, మన ప్రజా జీవితంలోని ప్రమాణాల ప్రకారం చూస్తే కొత్త రాజ కీయ వారసత్వం ఎంతో సహజమనిపిస్తోంది. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్ mvijapurkar@gmail.com) -
'లోకేశ్ కు ఏ పదవి ఉందని...'
వరంగల్: కేసీఆర్ కుటుంబం ఏనాడు నేరుగా పదవులు తీసుకోలేదని, ఉద్యమాలు చేసి ప్రజల దీవెనెలతో పదవులు తీసుకుందని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... దేశం, రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు లేవా అని ఆమె ప్రశ్నించారు. కేవలం తమ కుటుంబంపై అక్కసు ఎందుకు అని అన్నారు. తల్లి జాతీయ అధ్యక్షురాలు, కొడుకు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. నారా లోకేశ్ కు ఏ పదవి ఉందని అమరావతి శంకుస్థాపనలో ఉన్నారని ప్రశ్నించారు. జానారెడ్డి, జైపాల్ రెడ్డి విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక రాష్ట్రం తెచ్చేవారు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యార్థుల చావులకు కారణం కాంగ్రెస్సే అని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాలపై కూడా దృష్టి సారిస్తున్నట్టు కవిత చెప్పారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ఫలితాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రెఫరెండంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. -
గోదావరి రాజకీయాల్లో కుటుంబాల జోరు
పశ్చిమగోదావరి జిల్లాలో కుటుంబ రాజకీయాల హవా చాలాకాలంగా కొనసాగుతోంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబం కొన్నేసి తరాల పాటు రాజకీయాలు చేసిన చరిత్ర ఈ జిల్లాలో ఉంది. సమితుల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా.. కుటుంబానికి ఉన్న మంచిపేరు గానీ, తొలినాళ్లలో పనిచేసిన నాయకులు కొంతలో కొంత నిస్వార్థంగా వ్యవహరించడం వల్ల గానీ ప్రజల గుండెల్లో ఆయా కుటుంబాలకు సుస్థిరమైన స్థానం ఉండిపోయింది. దాంతో ఆ కుటుంబాల వారసులను కూడా ఆయా ప్రాంత ప్రజలు ఆదరిస్తూ వచ్చారు. అయితే, ఈ తరం వచ్చేసరికి మాత్రం అన్ని కుటుంబాలూ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి. కొందరు మాత్రమే తమ తాతముత్తాతల నాటి విలువలను కాపాడుకుని రాజకీయాల్లో మనగలుగుతున్నారు. మాగంటి, ఈలి హవా మాగంటి కుటుంబం దశాబ్దాల తరబడి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఉంది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి జడ్పీ చైర్మన్‌గా, మంత్రిగా పనిచేశారు. రెండోసారి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి మంత్రి వర్గంలో ప్రమాణస్వీకారం చేసినరోజే ఆయన గుండెపోటుతో మరణించారు. 1991 ఉప ఎన్నికల్లో ఆయన భార్య వరలక్ష్మి గెలిచారు. ఆమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. వాళ్ల కుమారుడు మాగంటి వెకంటేశ్వరరావు (బాబు) 2004లో వైఎస్సార్ ప్రభంజనంలో దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయ్యారు. తాడేపల్లిగూడెం రాజకీయాలపై ఈలి కుటుంబం ముద్ర ఉండేది. 1967లో మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికైన ఈలి ఆంజనేయులు 1983లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అదే ఏడాది ఆయన మరణించడంతో ఆయన భార్య వరలక్ష్మి పోటీచేసి గెలిచారు. 1985లో ఓడిపోయి, తర్వాత కాంగ్రెస్ నుంచి గెలిచి 1990లో టీడీపీలో చేరారు. 2008లో ఆమె తనయుడు ఈలి నాని పీఆర్పీలో చేరి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల టీడీపీలో చేరినా టికెట్ దక్కలేదు. తణుకులో చిట్టూరి.. ముళ్లపూడి తణుకు రాజకీయాల్లో చిట్టూరి కుటుంబం ముందు నుంచి ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఆ కుటుంబ నాయకులు అంతగా లేరు. 1891 నుంచి ఈ కుటుంబీకులు సమితి అధ్యక్షులుగా చేశారు. 1946లో జస్టిస్ పార్టీ తరఫున తణుకు నుంచి చిట్టూరి ఇంద్రయ్య ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈయన సోదరుడు సుబ్బారావు చౌదరి 1960 ప్రాంతాల్లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1952లో ఇంద్రయ్య కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కమ్యూనిస్టు పార్టీ మద్దతుతో ఇదే కుటుంబానికి చెందిన చిట్టూరి సుబ్బారావు చౌద రి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1983లో ఇంద్రయ్య కుమారుడు వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచారు. 1980 ప్రాంతంలో సుబ్బారావు చౌద రి ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో ఇంద్రయ్య కుమారుడు బాపినీడు వైఎస్సార్ హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముళ్లపూడి కుటుంబం ఒకానొక సమయంలో చక్రం తిప్పినా.. ఇప్పుడు మాత్రం అంతగా లేదు. హరిశ్చంద్ర ప్రసాద్ గ్రామసర్పంచ్‌గా ప్రస్థానం ప్రారంభించి మునిసిపల్ చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 1955, 1962లో గెలుపొందారు. 1967లో స్వతంత్ర అభ్యర్థి గన్నమని సత్యనారాయణపై పోటీచేసి ఓటమి చెందారు. ఈయన కుమారుడు నరేంద్రనాథ్ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. చిన్నల్లుడు వైటీ రాజా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగాను, ఆయన సమీప బంధువు ముళ్లపూడి కృష్ణారావు 1985 నుంచి 1994 వరకు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో వైటీరాజా ఎమ్మెల్యేగా ఎన్నికైనా తర్వాత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. ఏజెన్సీ కింగ్ కరాటం ఏజెన్సీ ప్రాంత రాజకీయాల్లో కరాటం కుటుంబం ముద్ర ఎప్పటి నుంచో ఉంది. పోలవరం నియోజకవర్గానికి చివరి గిరిజనేతర ఎమ్మెల్యేగా కరాటం బాబూరావు వ్యవహరించారు. ఇదే కుటుంబం నుంచి కరాటం కృష్ణమూర్తి సమితి అధ్యక్షుడిగా చేశారు. అప్పట్లో ఈయనకు ఏజెన్సీ టైగర్‌గా పేరుగాంచారు. కరాటం రాంబాబు డీసీసీబీ అధ్యక్షుడిగా పనిచేస్తూ పోలవరం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. కృష్ణమూర్తి కుమారుడు జానకిరాం ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. మనువడు కరాటం కృష్ణ స్వరూప్ వైఎస్సార్ సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. -
కర్నూలు జిల్లాలో ఓ కుటుంబ కథా చిత్రం