భోపాల్: భోపాల్ బహిరంగ సభలో కుటుంబ రాజకీయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై మోదీ విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుమార్తె కవిత బాగుపడాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి.. మీ పిల్లల మంచి భవిష్యత్తుకు బీజేపీకి ఓటేయాలని అన్నారు. కవిత లిక్కర్ స్కాం.. ఈడీ రైడ్లను కూడా ఆయన ప్రస్తావించారు. భోపాల్ సభలో కుటుంబ రాజకీయాలను మోదీ మరోసారి తెరమీదకు తెచ్చారు.
నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాల భేటీని ప్రధాని మోదీ విమర్శించారు. 2024 ఎన్నికల్లో భాజపా గెలవనున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలన్నీ ఒకచోట చేరాయని ప్రధాని అన్నారు. ఆ పార్టీలన్నీ అవినీతి, కుంభకోణాలకు ఉచిత హామీ ఇస్తాయని విమర్శించారు. తాను మాత్రం అవినీతిపరులను వదిలిపెట్టేదే లేదన్న హామీ ఇస్తున్నానని మోదీ పేర్కొన్నారు. భాజపాకు కార్యకర్తలే అతిపెద్ద బలమని మోదీ చెప్పారు. ప్రతిపక్ష భేటీలో పాల్గొన్న నాయకులందరూ కలిసి 20 లక్షల కోట్ల స్కాంకు పాల్పడినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ఒక్కటే లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు.
ఇదీ చదవండి: మహారాష్ట్ర వేదికగా బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్.. కాంగ్రెస్, బీజేపీలకు స్ట్రాంగ్ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment