
చెన్నై: కేంద్ర నూతన జాతీయ విద్యావిధానాన్ని(National Educational Policy) వ్యతిరేకిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాము కోరుకునేది భాషా సమానత్వం మాత్రమేనని.. అంత మాత్రానికే తమను విమర్శించడం తగదని అన్నారాయన. ఈ క్రమంలో.. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ఆయన ఓ కొటేషన్‌తో కౌంటర్ ఇచ్చారు.
మేం కోరుకునేది భాషా సమానత్వం. తమిళనాడులో తమిళం భాషకు ప్రాధాన్యం కల్పించమని అడుగుతున్నాం. అంతమాత్రానికే దురభిమానం, పక్షపాతం అనే ముద్రలు మాపై వేస్తున్నారు. మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడటంతో మేం కోరుకునే సమానత్వం కూడా అణచివేతలా కనిపిస్తుంది(కొటేషన్‌ను పోస్ట్ చేశారు).
దురభిమానం ఎలా ఉంటుందంటే.. తమిళులు అర్థం చేసుకోలేని భాషలో మూడు నేర చట్టాలకు పేర్లు పెట్టడంలా ఉంటుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఎన్‌ఈపీని నిరాకరించినందుకు విద్యకు వెచ్చించాల్సిన నిధులను ఆపేయడం దాని కిందికే వస్తుంది.
.. గాడ్సే భావజాలాన్ని కీర్తించే వ్యక్తులు.. చైనా దురాక్రమణ, కార్గిల్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిపిన యుద్ధాల్లో అత్యధిక నిధులు అందించిన డీఎంకే, ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వానికి ఉన్న దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు అంటూ కేంద్రంలోని బీజేపీకి పరోక్షంగా చురకలంటించారాయన.
👉🏾 "When you are accustomed to privilege, equality feels like oppression." I am reminded of this famous quote when some entitled bigots brand us chauvinists and anti-nationals for the 'crime' of demanding Tamil’s rightful place in Tamil Nadu.
👉🏾 The very people who glorify… pic.twitter.com/MOzmUSEyia— M.K.Stalin (@mkstalin) March 6, 2025
ఇదిలా ఉంటే.. జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. హిందీని బలవంతంగా హిందీయేత ప్రాంతాలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మండిపడుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను, డీఎంకే ప్రభుత్వ ప్రచారాలను కేంద్రం తోసిపుచ్చుతూ వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment