ఢిల‍్లీ: ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ సమావేశం కేవలం ఒక ఫొటో సెషన్ మాత్రమేనని అన్నారు. చాయ్ పార్టీ జరుపుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఒక చోట కూడారని చెప్పారు. ఈ సమావేశంతో ప్రతిపక్ష నాయకులు చేయగలిగేది ఏం ఉండదని జోస్యం చెప్పారు. గడ్డం కత్తిరించి, పెళ్లి చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీకి సమావేశంలో సలహా ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు.
VIDEO | "This was actually a photo session. The first photo session was conducted by (Telangana CM) KCR in Bihar with Nitish Kumar a few months ago," says Union Minister Giriraj Singh on Patna opposition meeting.#OppositionMeeting pic.twitter.com/CPunJ1a50m
— Press Trust of India (@PTI_News) June 24, 2023
'ఇది కేవలం ఓ ఫొటో సెషన్ మాత్రమే. నితీష్ కుమార్‌తో కొన్ని నెలల క‍్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఇది జరిగింది. చిన్న చిన్న గుంపులు కలిసి ప్రధాని పదవిపై కలలు కంటున్నాయి. వీటితో ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.' అని గిరిరాజ్ సింగ్ అన్నారు.
ప్రతిపక్షాల భేటీ..
పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష‍్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఇందులో ఎలాంటి ఏకాభిప్రాయానికి నాయకులు రాలేదు. మరో సమావేశాన్ని సిమ్లాలో వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ..
Comments
Please login to add a commentAdd a comment