ఢిల్లీ: రాజకీయ సంక్షోభాలతో బంగ్లాదేశ్.. పాకిస్తాన్లా మారితే పొరుగుదేశానికి పెట్టుబడిదారులు వెళ్లకుండా దూరంగా ఉంటారని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ఆయన బుధవారం భారత్ టెక్స్-2025 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
‘భారతదేశానికి పెద్ద కార్మిక మార్కెట్ ఉన్నందున బంగ్లాదేశ్ లేదా వియత్నాం నుంచి భారతీయ వస్త్ర పరిశ్రమ ఎటువంటి సవాలును ఎదుర్కోవడం లేదు. బంగ్లాదేశ్ పాకిస్థాన్‌లా మారితే పెట్టుబడిదారులు అక్కడికి వెళ్లే ముందు ఆలోచిస్తారు. ప్రతి రంగాన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుసంధానం చేసే యోచనలో ఉన్నాం. మేము మరిన్ని ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు.
భారత్ టెక్స్-2025 కార్యక్రమాలు ఫిబ్రవరి 14 నుంచి 17 తేదీ వరకు భారత్ మైదాన్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి 15 తేదీల్లో ఇండియా ఎక్స్‌పో సెంటర్, మార్ట్‌లో వస్త్రాలు, హస్తకళలు, గార్మెంట్ మెషినరీ, దుస్తులకు సంబంధించిన ఎగ్జిబిషన్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment