న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం మరికొద్ది గంటల్లో విపక్షాల మెగా భేటీ జరగనుంది. ఈ సమయంలో కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ భారీ షాక్ ఇచ్చింది. గురువారం పాట్నాలో నిర్వహించబోయే విపక్షాలు సమావేశంలో తాము పాల్గొనాలంటే కాంగ్రెస్ తమ షరతుకు ఒప్పుకోవాలని ఆప్ అల్టిమేటం జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదిలీ విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ప్రభుత్వం జరుపుతున్న పోరుకు మద్దతు ఇవ్వాలని తెలిపింది.
‘వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాకు(ఆప్) తప్పక మద్దతు తెలిపాలి. పార్లమెంటులో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలి. అలా చేయకపోతే మేము గురువారం జరిగే విపక్షాల భేటీని బహిష్కరిస్తాం. అంతేగాక భవిష్యత్తులో జరగబోయే ఏ ప్రతిపక్షాల సమావేశానికి కూడా హాజరుకాము’ అని ఆప్ వర్గాలు తెలిపాయి. కాగా బిహార్ సీఎం నితీష్ కుమార్ చొరవతో పట్నాలో గురువారం తొలసారి భారీ స్థాయిలో విపక్షాలు ఐక్యత భేటీ జరగనుంది.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీని ఓడించేందుకు అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు దేశంలోని కాంగ్రెస్, జేడీయూ, టీఎంసీ, ఎన్సీపీ, ఆప్, ఎస్పీ సహా 120 జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ భీటీలో పాల్గొననున్నాయి. సీఎం నితీష్ అధికారిక నివాసంలోని ‘నెక్ సంవాద్ కక్షా’లో 11 గంటలకు ఈ సమావేజం జరగనుంది. ఇప్పటికే బిహార్ సర్కార్ ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సమయంలో ఆప్ తీసుకున్న నిర్ణయం 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి వచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
చదవండి: పురుషుడిగా మారనున్న పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కుమార్తె.. ఎందుకంటే!
ఇక దేశ రాజధాని ఢిల్లీలోని పాలన యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వివాదస్పంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రం చర్యను ఢిల్లీ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అతిక్రమించి మరీ రాష్ట్ర హక్కులను కాలరాస్తుందని మండిపడుతోంది. దీనిని పార్లమెంట్‌లో చట్టం కాకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలను వరుసగా కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు.
అంతకుముందు.. శుక్రవారం జరగనున్న ప్రతిపక్షాల సమావేశంలో కేంద్ర ఆర్డినెన్స్‌పై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తెలిపారు. ఈ సమావేశంలో అన్ని ఇతర రాజకీయ పార్టీలు సైతం కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నిస్తాయని పేర్కొన్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ ఇప్పటి వరకు తటస్థంగా ఉంది. కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతివ్వాలని కేజ్రీవాల్ ఎప్పుడో కాంగ్రెస్‌ను కోరారు. కానీ పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని మల్లికార్జున్ ఖర్గే దీనిని దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment