కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. సీనియర్‌ నాయకుడు రాజీనామా | Congress Leader Ex MLA Mateen Ahmed Joins AAP Party At Delhi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. సీనియర్‌ నాయకుడు రాజీనామా

Published Sun, Nov 10 2024 3:56 PM | Last Updated on Sun, Nov 10 2024 3:56 PM

Congress Leader Ex MLA Mateen Ahmed Joins AAP Party At Delhi

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హస్తం పార్టీ సీనియర్‌ నాయకుడు చౌదరీ మతీన్‌ అహ్మాద్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం, ఆయన అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. వచ్చే ఏడాదిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న నేపథ్యంలో సీనియర్‌ నేత పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది.

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మతీన్‌ అహ్మద్‌ ఆదివారం ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు. ఆప్‌లో ఆయన చేరికను పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీలోకి అహ్మాద్‌ను స్వాగతిస్తూ.. మతీన్ సాహబ్ సరైన పార్టీలో చేరారు. అహ్మద్ ఢిల్లీ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. పార్టీలో చేరిన అహ్మాద్‌కు సరైన గౌవరం, స్థానం ఉంటుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

ఢిల్లీలోని సీలంపూర్ నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా 1993 నుండి 2013 వరకు అహ్మాద్‌ ఎన్నికయ్యారు. ఇక, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సీలంపూర్ అసెంబ్లీ స్థానాన్ని ఆప్ గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. అహ్మద్ కుమారుడు చౌదరి జుబేర్ అహ్మద్.. అతని భార్య, కాంగ్రెస్ కౌన్సిలర్ షగుఫ్తా చౌదరి అక్టోబర్‌లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్‌లో చేరారు. కాగా, ఢిల్లీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీలంపూర్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా చౌదరి జుబేర్ అహ్మద్ బరి నిలుస్తారనే చర్చ నడుస్తోంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement