న్యూఢిల్లీ: తమ పార్టీని అస్థిర పరిచేందుకు బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరుకు లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశించిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. ఇది బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఆడుతున్న సరికొత్త అనుబంధ రాజకీయమంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలు(Welfare Schemes) అమలు చేస్తే అందులో దర్యాప్తు ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు.
‘ మేము రెండు వేల ఒక వంద రూపాయలను మహిళా సమ్మన్ యోజన కింద అమలు చేస్తున్నాం. దాంతో పాటు స సీనియర్ సిటిజన్లకు సంజీవని యోజన కింద ఉచిత వైద్యం చేయిస్తున్నాం. ఇవి ఎన్నిలక హామీలో ఇచ్చినవే. దాన్ని అధికారంలో వచ్చిన తర్వాత అమలు చేస్తున్నాం. ఇందులో అంతా దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావడం లేదు. దర్యాప్తు చేసుకోండి. అవసరమైతే జైలు కెళ్లడానికైనా సిద్ధమే’ అంటూ తీవ్రంగా స్పందించారు కేజ్రీవాల్
ఇది బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఆడుతున్న సరికొత్త డ్రామా అంటూ విమర్శించారు. అసలు బీజేపీకి మహిళల పట్ల కానీ సీనియర్ సిటిజన్ల పట్ల కానీ ఎటువంటి ఉదారత లేదన్నారు. ఢిల్లీలో బీజేపీ(BJP)కి మరోసారి ఓటమి తప్పదనే కారణంతోనే నైతిక విలువలు మరిచిపోయి వ్యవహరిస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment