ఢిల్లీ: పంజాబ్‌లో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ గత నెల 26 నుంచి నిరాహారదీక్ష చేపట్టిన రైతు నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే అలా అడ్డుకోరంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శనివారం విచారణ చేపట్టింది. దలేవాల్‌ను ఆస్పత్రికి తరలించకుండా రైతు నేతలు అడ్డుకుంటున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
దీంతో కోర్టు ఆ రైతు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దలేవాల్ క్షేమం కోరేవారు ఆవిధంగా ప్రవర్తించరని వ్యాఖ్యానించింది. రైతు నేతలతో మాట్లాడి దలేవాల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ఏదైనా సహాయం అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 31కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: Year Ender 2024: ఎన్నటికీ మరువలేని ఐదు విషాదాలు
Comments
Please login to add a commentAdd a comment